సమీక్ష : 12th ఫెయిల్ – మెప్పించే రియల్ స్టొరీ

సమీక్ష : 12th ఫెయిల్ – మెప్పించే రియల్ స్టొరీ

Published on Nov 4, 2023 3:03 AM IST
Vidhi Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 03, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, అన్షుమాన్ పుష్కర్, అనంత్ విజయ్ జోషి, గీతా అగర్వాల్, హరీష్ ఖన్నా, సరితా జోషి, వికాస్ దివ్యకీర్తి

దర్శకుడు : విధు వినోద్ చోప్రా

నిర్మాత: విధు వినోద్ చోప్రా

సంగీతం: శంతను మోయిత్రా

సినిమాటోగ్రాఫర్‌లు: రంగరాజన్, రామబద్రన్

ఎడిటర్స్: జస్కున్వర్ కోహ్లీ, విధు వినోద్ చోప్రా

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

బాలీవుడ్ లో సూప‌ర్‌హిట్ అయిన 12th ఫెయిల్ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుద‌లైంది. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే మరియు మేధా శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

12th ఫెయిల్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మనోజ్ కుమార్ శర్మ (విక్రాంత్ మాస్సే) చంబల్‌లో నివసించే పేద కుటుంబం. తన పనిలో తాను నిజాయితీగా వ్యవహరించినందుకు మనోజ్ తండ్రి సస్పెండ్ అవుతాడు. మనోజ్ అక్కడ స్కూల్ లో చదువుతున్నాడు. అక్కడ అతని ప్రిన్సిపాల్ విద్యార్థులను పరీక్షల సమయంలో మాల్‌ప్రాక్టీస్‌లో పాల్గొనమని ప్రోత్సహిస్తాడు. DSP దుష్యంత్ (ప్రియాన్షు ఛటర్జీ) ఆ హెడ్‌ మాస్టర్‌ ని అరెస్ట్ చేసి, జీవితంలో నిజాయితీ చాలా ముఖ్యమైనది అని మనోజ్‌కి వివరిస్తాడు. మనోజ్ దుష్యంత్ మాటల తో ఇన్స్పైర్ అవుతాడు. నిజాయితీగల అధికారి సమాజంలో మార్పు తీసుకురాగలడని నమ్మడం మొదలు పెడతాడు. మనోజ్ ఎలా సక్సెస్ అయ్యాడు? అతను ఎలాంటి కష్టాలు పడ్డాడు? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

సినిమా కథ అద్భుతంగా ఉంది. 12th ఫెయిల్ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే రాయడం అనేది అంత తేలిక కాదు. ఎందుకంటే ఇదే టాపిక్‌పై చాలా సినిమాలు వచ్చాయి. అందువల్ల, కథనం అత్యంత ఆకర్షణీయంగా ఉండటం ముఖ్యం. విధు వినోద్ చోప్రా మంచి కథనంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. సినిమాలో చాలా మంచి సన్నివేశాలు ఉండేలా చూసుకున్నారు.

మనోజ్ కుమార్ శర్మగా విక్రాంత్ మాస్సే అద్భుతంగా నటించాడు. అతని అత్యద్భుతమైన నటన సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. విక్రాంత్ మాస్సే మనోజ్ పాత్ర లోకి పరకాయ ప్రవేశం చేశాడు అని చెప్పాలి. 12th ఫెయిల్ వంటి బయోపిక్‌లు ఎక్కువ రిఫరెన్స్ పాయింట్‌లను కలిగి ఉండవు. అయితే ప్రధాన నటీనటుల పర్ఫార్మెన్స్ బాగా లేకుంటే మైనస్ గా మారేది. కానీ విక్రాంత్ మాస్సే మన దృష్టిని అన్ని విధాలుగా ఆకర్షిస్తాడు. ఈ చిత్రం అతనికి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది అని చెప్పవచ్చు.

విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ లు ఒకరికి ఒకరు బాగా సపోర్ట్ చేశారు. నిజ జీవితంలో ఉన్న జంటలు ఒకరికొకరు తోడుగా నిలిచారు అనేది బాగా చూపించడం జరిగింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. చివరిలో వచ్చే ఇంటర్వ్యూ సీన్ హైలైట్ గా ఉంటుంది. అనంత్ విజయ్ జోషి, సరితా జోషి, వికాస్ దివ్యకీర్తి, అన్షుమాన్ పుష్కర్ తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.

 

మైనస్ పాయింట్స్:

12th ఫెయిల్‌ సినిమాలో కథనం అక్కడక్కడా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ టీమ్ ట్రిమ్ చేసి ఉంటే మరింత ఎఫెక్టివ్ గా ఉండేది. ఈ జానర్‌లోని చాలా సినిమాల మాదిరిగానే, ఒక టైమ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ముందుగానే ప్రిడిక్ట్ చేయవచ్చు.

సెకండాఫ్ స్టార్టింగ్ లో కొన్ని సన్నివేశాలు చాలా డల్ గా సాగాయి. లీడ్ పెయిర్‌ మధ్య జరిగే గొడవను ఇంకా బెటర్ గా చూపించే అవకాశం ఉంది. ఈ చిత్రం వ్యవస్థలో నిజాయితీ గల అధికారులను కలిగి ఉండవలసిన అవసరాన్ని గురించి చాలా నొక్కి చెబుతుంది. అందుకే ఎలాంటి కమర్షియల్ అంశాలు ఇందులో ఉండవు. ఇది అందరినీ అంతగా ఆకట్టుకోదు. అవసరం లేని చాలా చోట్ల కూడా వాయిస్ ఓవర్ కొనసాగింది.

 

సాంకేతిక విభాగం:

శంతను మొయిత్రా కంపోజ్ చేసిన పాటలు చాలా బాగున్నాయి. తెలుగు సాహిత్యం బాగుంది. 12th ఫెయిల్ తెలుగు డబ్బింగ్ టీమ్ కి అభినందనలు చెప్పాల్సిందే. ఎందుకంటే ఇది డబ్బింగ్ సినిమాలా అనిపించదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

దర్శకుడి విషయానికి వస్తే, విధు వినోద్ చోప్రా సినిమాతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం లో కామెడీ మరియు ఎమోషన్స్ ను చూపించిన విధానం బాగుంది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ఇంకా బాగుండేవి. నటీనటులందరి నుండి దర్శకుడు అద్భుతమైన నటనను రాబట్టారు.

 

తీర్పు:

మొత్తం మీద, 12th ఫెయిల్ చాలా అడ్డంకులు ఎదుర్కొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ కథ ఆకట్టుకుంటుంది. కథకి అనుగుణంగా సినిమాను బాగా తెరకెక్కించారు మేకర్స్. ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్ మాస్సే తన పాత్రలో జీవించాడు. మేధా శంకర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. 12th ఫెయిల్‌లో చాలా హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల కథనం చాలా నెమ్మదిగా సాగడం, కొన్ని చోట్ల ముందుగా ఏం జరుగుతుంది అనేది ఊహించే విధంగా ఉంటుంది. అయితే ఇన్స్పిరేషన్ తో సాగే రియల్ లైఫ్ స్టోరీ లను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు