సమీక్ష : అల్లుడు అదుర్స్ – అక్కడక్కడా ఆకట్టుకునే కామెడీ డ్రామా !

విడుదల తేదీ : జనవరి 14, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మజీ

దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్

నిర్మాత‌లు : సంతోష్ శ్రీనివాస్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్ : చోటా కె నాయుడు

ఎడిట‌ర్‌ : తిమ్మరాజు కె

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో ‘అల్లుడు అదుర్స్’ గా వచ్చిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) చిన్నతనంలోనే వసుంధరా రెడ్డి (అనూ ఇమాన్యుల్)ను ప్రేమించి విఫలం అవుతాడు. అప్పటినుండి అమ్మాయిలకు, ప్రేమకు దూరంగా ఉంటాడు. అయితే పెద్దయ్యాక అతను కౌముది (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కౌముది తండ్రి జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్)తో ఓ ఒప్పందానికి రావడం, తీరా శ్రీను, కౌముదిని ప్రేమలో పడేసే టైంకి అతని జీవితంలోకి గజా (సోనూసూద్) ఎంట్రీ ఇవ్వడంతో దాంతో శ్రీను గోల్ మారుతుంది. అసలు ఈ గజా ఎవరు ? అతనికి వసుంధరకి సంబంధం ఏమిటీ ? చివరకు శ్రీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? తన ఫస్ట్ లవ్ అయిన వసుంధరకు ఎలాంటి సాయం చేశాడు ? ఈ మధ్యలో ఏమి జరిగింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

శ్రీను పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. పైగా గతంలో కంటే పరిణతి చెందిన తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఆయన రిస్క్ చేసి మరి చేసిన యాక్షన్ సీన్స్ లోని అడ్వంచరస్ బాగున్నాయి. ఇక హీరోయిన్ గా నటించిన నభా నటేష్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది.

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రంతో తనకు కలిసొచ్చిన కామెడీ యాంగిల్ ను చూపించాలనుకున్న ప్రయత్నం బాగుంది. ఊహ నిజం మధ్య స్క్రీన్ ఫ్లే రాసుకోవడం, ఆ నేపథ్యంలోనే సెకెండ్ హాఫ్ సినిమాను చేయాలనుకోవడం, ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ను మిస్ కాకుండా బాగానే హ్యాండిల్ చేశాడు.

ప్రకాష్ రాజ్, ఇంద్రజ, సోనూసూద్ లాంటి మంచి నటులు ఈ చిత్రంలో తమ పాత్రలను అద్భుతంగా పోషించి ఈ చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడ నవ్విస్తాడు. అలాగే ఎక్కువ సేపు కనిపించకపోయిన కీలక పాత్రలో నటించిన అను ఇమాన్యుల్ తన నటనతో ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

రెగ్యులర్ పాయింట్‌ తో కూడుకున్న రెగ్యులర్ కథతో వచ్చిన ఈ సినిమాలో ఫేక్ ఎమోషన్స్, సిల్లీ కామెడీ ఎక్కువైపోయింది. పైగా రొటీన్ సినిమాలాగే ఐదు ఫైట్స్, మాస్ సాంగ్స్ తో పక్కా కమర్షియల్ చిత్రంలానే సాగుతూ.. బోర్ కొడుతుంది.

సినిమా ఇంట్రస్ట్ గా మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అదికాక నమ్మశక్యం కాని సన్నివేశాలతో, కొన్ని అక్కరలేని సీన్లతో సినిమా ప్లో దెబ్బతింది. పైగా సినిమా కథాంశంలో కూడా ఎలాంటి కొత్తధనం చూపించకపోవడం, అలాగే సినిమాలో ఎక్కడా బలమైన కంటెంట్ లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.

సిచ్యుయేషన్ ఫన్ అండ్ హీరో ఆడే డ్రామాలోని కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపించిన్నప్పటికీ మరి నాటకీయంగా అనిపిస్తాయి. సోనూసూద్ ట్రాక్, అలాగే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అతని ట్రాక్ వాస్తవానికి చాలా దూరంగా ఉండటం వల్ల ఎక్కడా జన్యున్ ఎమోషన్ సినిమాలో లేదు. కనీసం, పాత్రల్లో మమేకం అయిపోయి ఫీల్ అయ్యే సందరర్భం సినిమాలో ఒక్కటి కూడా లేదు.

 

సాంకేతిక విభాగం :

 

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రాసుకున్న స్టోరీ ఐడియానే వెరీ రెగ్యులర్ గా ఉంది. పైగా ఆ ఐడియాకు తగ్గట్టు ట్రీట్మెంట్ వెరీ వెరీ రెగ్యులర్ అండ్ బోరింగ్ గా సాగింది. మ్యూజిక్ డైరెక్టర్‌ దేవి అందించిన అందించిన రీరికార్డింగ్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది, సౌండ్, పాటల్లోని కొన్ని బిట్స్ చాలా బాగున్నాయి. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లానే ఉంటుంది. సినిమాటోగ్రఫర్ సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని సాగతీత సీన్లను కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

రెగ్యులర్ పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం చివరకి ఓ రొటీన్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గానే సాగుతూ బోర్ కొడుతోంది. అయితే, సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, పాత్రల నటన, వారి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. కానీ, సినిమాలో కొత్తదనం లేకపోవడం, అక్కడక్కడ కొన్ని దృశ్యాలు పాత సినిమాలను గుర్తుకుచేయడం, అలాగే బోరింగ్ ట్రీట్మెంట్ సినిమా రిజల్ట్ ను దెబ్బ తీసింది. ఓవరాల్ గా ఈ చిత్రంలోని కొన్ని అంశాలు బి.సి సెంటర్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయినా, సినిమా మాత్రం మెప్పించదు.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :

More