ఓటిటి సమీక్ష: అన్నాబెల్లె సేతుపతి – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ చిత్రం!

Gully Rowdy Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 17, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: విజయ్ సేతుపతి, తాప్సీ పన్ను

దర్శకుడు: దీపక్ సుందరరాజన్

నిర్మాతలు: సుధన్ సుందరం, జి జయరామ్

సంగీత దర్శకుడు: కృష్ణ కిషోర్

సినిమాటోగ్రఫీ: గౌతమ్ జార్జ్

ఎడిటర్: ప్రదీప్ ఇ. రాగవ్

విజయ్ సేతుపతి మరియు తాప్సీ ప్రధాన పాత్రలలో నటించిన అన్నాబెల్లె సేతుపతి ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో చూడవచ్చు. ఈ సినిమా పై మా సమీక్ష ఇక్కడ ఉంది.

 

కథ:

 

రుద్ర (తాప్సీ), ఒక దొంగ తన కుటుంబ సభ్యులతో కలిసి నిర్మానుష్యంగా ఉన్న రాజ భవనాన్ని దోచుకోవాలని యోచిస్తోంది. కానీ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత, ఆమెకి రాజ భవనంతో మరియు దానిని నిర్మించిన వీర సేతుపతి తో ప్రత్యేక సంబంధం ఉందని ఆమె గ్రహించింది. రాజభవనం గురించి వెనుక కథ ఏమిటి? అనేది సినిమా కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

విజయ్ సేతుపతి ఈ చిత్రంలో చాలా తక్కువ సేపు కనిపించినప్పటికీ, అతను తన చక్కటి నటనతో శాశ్వత ముద్ర వేస్తాడు. తాప్సీ ఈ చిత్రం లో పోషించిన పాత్ర చాలా బాగుంది. ఇందులో తాప్సీ తన ప్రదర్శన తో ఆకట్టుకుంది అని చెప్పాలి.

ఫ్లాష్‌బ్యాక్ భాగం ఈ చిత్రం లో ప్రధాన అంశాన్ని లేవనెత్తింది. ఇది చాలా బాగా రూపొందించబడింది మరియు అమలు చేయబడింది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది.

 

మైనస్ పాయింట్స్:

 

రాజభవనంలో చిక్కుకున్న దెయ్యాలకు సంబంధించిన ట్రాక్, మరియు రుద్ర (తాప్సీ) వారితో గందరగోళానికి గురవడం చాలా సిల్లీ గా చూపించడం జరిగింది. కామెడీ ట్రాక్ అనవసరంగా అనిపిస్తుంది. అంతగా ఆకట్టుకోదు.

ఫ్లాష్‌బ్యాక్ మినహా, మిగిలిన ప్లాట్ అంతగా ఆకట్టుకొనే విధంగా ఉండదు. మళ్లీ మళ్లీ అదే హార్రర్ కామెడీ సన్నివేశాలను చూడటం తో కథనం అంతగా ప్రభావం చూపించదు.

 

సాంకేతిక విభాగం:

 

దర్శకుడు దీపక్ సుందరరాజన్ హారర్ కామెడీ సబ్జెక్ట్‌ను రాసి స్లాప్‌ స్టిక్ కామెడీతో లోడ్ చేశాడు అని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, కానీ పాటల గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్యాలెస్ సెట్ అత్యున్నత నాణ్యతతో ఉంటుంది.

 

తీర్పు:

 

20 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ భాగాన్ని తీసి వేస్తే అన్నాబెల్లె సేతుపతి ఒక నీరసమైన భయంకర కామెడీ. స్క్రీన్ ప్లే సైతం అంతగా ఆకట్టుకోదు. విజయ్ సేతుపతి మరియు తాప్సీ పన్నులు తమ పాత్రలలో ఒదిగిపోయారు. కానీ కథనం వారి ప్రదర్శనలను పూర్తి చేసే విధంగా ఉండదు. ఈ చిత్రం బోరింగ్ గా ఉంటుంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :