సమీక్ష : యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటుమానియా

Ant-Man Movie-Review-In-Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 17, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: పాల్ రూడ్, ఈవెంజిలిన్ లిల్లి, జోనాథన్ మెజర్స్, క్యాథరిన్ న్యూటన్, డేవిడ్ డస్ట్ మాల్చయిన్, కాటి ఓబ్రెయిన్, విలియం జాక్సన్ హార్పర్, బిల్ ముర్రే, మిచెల్లీ ఫెయిఫర్, కోరే స్టోల్, మైఖేల్ డగ్లస్

దర్శకుడు : పేయిటోన్ రీడ్

నిర్మాతలు: కెవిన్ ఫెయిజ్, స్టీఫెన్ బ్రోసర్డ్,

సంగీత దర్శకులు: క్రిస్టోఫే బెక్

సినిమాటోగ్రఫీ: విలియం పొప్

ఎడిటర్: ఆడమ్ గెర్స్టెల్, లారా జెన్నింగ్స్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

హాలీవుడ్ లో ప్రస్తుతం భారీ సినిమాల యొక్క ఫ్రాంచైజ్ మూవీస్ కి వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ విధంగా ఇటీవల అందరి నుండి మంచి క్రేజ్ ని సక్సెస్ ని సొంతం చేసుకున్న మర్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్ లో లేటెస్ట్ మూవీ యాంటీ మాన్ అండ్ ది వాస్ప్ క్వాంటుమానియా మూవీ నేడు వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలతో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

అవెంజర్స్ ఎండ్ గేమ్ లోని ఘటనల తరువాత స్కాట్ ల్యాంగ్ (పాల్ రూడ్) తన భార్య వాన్ డీన్ (ఈవెంజిలిన్ లిల్లి) కందిరీగ, కూతురు కాసి ల్యాంగ్ (క్యాథరిన్ న్యూటన్) లతో కలిసి హ్యాపీగా తన లైఫ్ గడుపుతూ ఉంటాడు. అయితే ఒకానొక సమయంలో తాతయ్య హాంక్ పిం (మైఖేల్ డగ్లస్) తో కలిసి కాసి, క్వాంటం రాజ్యంలోకి వెళ్లే ఒక చిన్న డివైస్ ని కనిపెడుతుంది. అయితే ఇది తెలుసుకున్న ఆమె నానమ్మ జానెట్ వాన్ డీన్ (మిచెల్లీ ఫెయిఫర్) భూమి కింద ఉన్న ఆ రాజ్యానికి సిగ్నల్స్ ని పంపడం ఆపమని కాసి ని కోరుతుంది. అయితే అప్పటికే అంతా ఆలస్యం అయిపోవడంతో వారందరూ క్వాంటం రాజ్యంలోకి వెళ్ళిపోతారు. అయితే ఆ రాజ్యంలోకి వెళ్లిన తరువాత వారికి ఏమి జరుగుతుంది, విజేత అయిన కాంగ్ కి జానెట్ ఎందుకు భయపడుతుంది, అసలు అతను ఎవరు, జానెట్ కి ఆమెకి ఏమిటి సంబంధం వంటి వాటికి సమాధానాలు కావాలంటే మూవీ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

నిజానికి మార్వెల్ వారి మూవీస్ అంటే అందరిలో ఎంతో మంచి అంచనాలు ఉంటాయి అనేది తెలిసిందే. ఇక మర్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ పై కూడా అదే విధమైన అంచనాలు ఉంటాయి. ఇక మిగతా ఇతర మార్వెల్ మూవీస్ మాదిరిగానే యాంట్ మ్యాన్ 3 లో కూడా ఎన్నో కొత్త అంశాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వంటివి ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఉదాహరణకు, వివిధ జీవులు, కదిలే భవనాలు వంటివి ఎన్నెన్నో ఉన్నాయి. ఇక పెర్ఫార్మన్స్ ల విషయానికి వస్తే కీలక పాత్ర చేసిన పాల్ రూడ్ గతంలో వచ్చిన యాంట్ మ్యాన్ రెండు సినిమాల మాదిరిగా ఇందులో కూడా తన ఆకట్టుకునే కామెడీ, యాక్షన్ సీన్స్ తో అలరిస్తారు. ఇక కందిరీగ గా కనిపించిన ఈవెంజిలిన్ లిల్లి క్యారెక్టర్ కి తక్కువ స్పేస్ ఉన్నా బాగానే ఆకట్టుకుంది. ఇక సినిమాలో సింహభాగం కలిగిన జానెట్, కాసి ఇద్దరూ కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా జానెట్ కి క్వాంటం రాజ్యం గురించి మొత్తం విషయాలు తెలియడం, అలానే ఆమె పెర్ఫార్మన్స్ ప్రతి సీన్ లో బాగుంది. ఇక కాసి కూడా తన పాత్రలో ఆకట్టుకునేలా నటించి ఈ మూవీకి ప్లస్ పాయింట్ గా నిలిచింది.

 

మైనస్ పాయింట్స్ :

ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీ పెద్దగా ఆసక్తికరంగా లేదు. ఇక జెఫ్ లవ్ నెస్ రాసుకున్న ఈ స్టోరీ చాలావరకు ఆడియన్స్ తేలికగా అంచనా వేయగల విధానంలో రాసుకున్నారు. సూపర్ హీరో మూవీ అయినప్పటికీ గతంలోని మార్వెల్ మూవీస్ మాదిరిగా ఇందులోని ఎమోషన్స్ పెద్దగా ఆకట్టుకోవు. ముఖ్యంగా తండ్రి, కూతురు అనుబంధం గురించిన ఎమోషనల్ సన్నివేశాలని రైటర్ మరింత బలంగా రాసుకుంటే ఉంటె బాగుండేదనిపిస్తుంది. ఇక నెగటివ్ రోల్ పాత్రధారి గురించి కూడా మరింత బాగా రాసుకోవాల్సింది, ఎందుకంటే అతని పాత్ర బాగున్నప్పటికీ లోకి సిరీస్ నుండి తీసుకున్న అతడి పాత్రని ఇక్కడ యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటుమేనియాలో దర్శకుడు కాంగ్ ది కాంకరర్ గురించి పెద్దగా ఏమీ వెల్లడించలేదు. నిజానికి ఆల్ట్రనేట్ యూనివర్స్ లో అవెంజర్స్ ని సైతం చంపిన కాంగ్ ని యాంట్ మాన్ 3లో మాత్రంపెద్దగా పవర్ఫుల్ గా చూపించలేదు. మర్వెల్ సినిమాలని ఇష్టపడే వారికి ఇది పెద్దగా రుచించదు. ఇక ఆ పాత్ర లో జోనాథన్ ఆకట్టునేలా నటించినప్పటికీ రాసుకున్న కథలో కాంగ్ అతడి రాజ్యం గురించిన కథనం పేలవంగా ఉండడంతో అది పండలేదు. యాంట్ మాన్ సిరీస్ గత సినిమాల్లో స్కాట్ లాంగ్‌ తో పాటు సైడ్‌కిక్ లూయిస్ (మైఖేల్ పెనా) ఉన్నాడు. కానీ ఈ మూడవ సినిమాలో మాత్రం అతడు లేకపోవడం ఆడియన్స్ కి నిరాశే. అలాగే బిల్ ముర్రే పోషించిన లార్డ్ క్రిలార్ గురించి సినిమాలో ఏమీ వెల్లడించలేదు.

 

సాంకేతిక వర్గం :

డైరెక్షన్ పరంగా చూస్తే యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటుమానియా బాగున్నప్పటికీ కథ రాసుకున్న విధానం మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాదు. విజువల్ గా మూవీ బాగున్నప్పటికీ పేలవమైన కథ, కథనాల వలన ఆడియన్స్ నిరాశకు గురవుతారు. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ వంటివి బాగున్నాయి. అయితే విఎఫ్ఎక్స్ మరింత బెటర్ గా ఉంటె బాగుండేది. రన్ టైం ని ఎడిటింగ్ విభాగం బాగానే కట్ చేసారు.

 

తీర్పు :

మొత్తంగా చూసుకుంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటుమానియా మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఇటువంటి ఫ్రాంచైజ్ సినిమాల నుండి ఆడియన్స్ ఆశించే థ్రిల్లింగ్ అంశాలు ఇందులో లేవు. కొన్ని ఆకట్టుకునే గ్రాండియర్ విజువల్స్ తప్ప సినిమాలో పెద్దగా ఏమి లేదు. నేను మర్వెల్ సిరీస్ సినిమాల అభిమానిని, అలానే నార్మల్ స్టోరీ అయినా పర్లేదు అనుకుంటే దీనిని ఈవారం చూడవచ్చు.

నోట్ : క్లైమాక్స్ తరువాత వచ్చే చివరి క్రెడిట్‌లు పూర్తి అయ్యేవరకు సినిమా థియేటర్‌ల నుండి బయటకు వెళ్లవద్దు, ఎందుకంటే సినిమా బృందం రాబోయే పెద్ద మార్వెల్ సినిమాకి సంబంధించి అద్భుతమైన పాత్ర యొక్క గ్లింప్స్ ని ఇస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :