సమీక్ష: “అనుకోని ప్రయాణం” – రాజేంద్ర ప్రసాద్ కోసం మాత్రమే

సమీక్ష: “అనుకోని ప్రయాణం” – రాజేంద్ర ప్రసాద్ కోసం మాత్రమే

Published on Oct 29, 2022 3:03 AM IST
Jhansi Movie-Review-In-Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 28, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: డా. రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజు, ప్రేమ, తులసి, రవిబాబు, శుభలేక సుధాకర్ తదితరులు

దర్శకుడు : వెంకటేష్ పెదిరెడ్ల

నిర్మాత: డా. జగన్ మోహన్ డి.వై

సంగీతం: ఎస్ శివ దినవహి

సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ నరగాని

ఎడిటర్: రామ్ తుము

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అనుకోని ప్రయాణం. ఈ చిత్రం నేడు థియేటర్ల లో విడుదల అయ్యింది. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు నరసింహరాజు కీలక పాత్రలో నటించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

 

రాజేంద్ర ప్రసాద్ మరియు నరసింహ రాజు లు ఇద్దరు స్నేహితులు. వీరు భువనేశ్వర్ లోని ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో రోజువారీ కూలీలుగా పని చేసేవారు. రాజేంద్ర ప్రసాద్ కి రిలేషన్స్ పై ఎలాంటి నమ్మకం ఉండదు. తన పని ఏంటో తను చూసుకొనే వాడు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణం గా వారి పని నిలిచి పోతుంది. ఈ క్రమం లో తమ సొంతూరు కి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రయాణం కో అతని స్నేహితుడు నరసింహ రాజు మరణిస్తాడు. అతని మరణం పట్ల రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ కు గురి అవుతాడు. ఎలాగైనా తన స్నేహితుడి శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటాడు రాజేంద్ర ప్రసాద్. ఈ క్రమంలో అతనికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? అతనికి మానవ సంబంధాల విలువ ఎలా తెలిసింది లాంటి అంశాలు తెలియాలంటే వెండితెర పై సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

అనుకోని ప్రయాణం సినిమా థీమ్ చాలా బాగుంది. మనిషికి ఉండే ఎమోషన్స్ మీద ఈ చిత్రం ఉంది. ఆ ఎమోషన్స్ కి గల ఇంపార్టెన్స్ అనేది బాగా నొక్కి చెప్పడం జరిగింది ఈ చిత్రం లో. సినిమా స్టార్ట్ అయిన గంటలో కథ బాగా సెట్ అయ్యింది. ఈ చిత్రం లో ఎమోషన్స్ చూపించిన విధానం బాగుంది. మనిషి జీవితంలోని ఒడి దుడుకులను పాము నిచ్చెన ల ఆటతో పోల్చడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

నటకిరీటి అనే ట్యాగ్ కి రాజేంద్ర ప్రసాద్ జస్టిఫై చేశారు. తెలుగు సినీ పరిశ్రమ లో తను ఒక జెమ్ అని ఈ చిత్రం తో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు అని చెప్పాలి. ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. ఇలాంటి సబ్జెక్టును ఎంచుకున్నందుకు రాజేంద్ర ప్రసాద్ ను ప్రత్యేకం గా అభినందించాలి. చాలాకాలం తర్వాత అతనికి స్కోప్ ఉన్న పాత్రను చేశారు.

రాజేంద్రప్రసాద్‌కి స్నేహితుడు గా నటించిన నరసింహరాజుకు మంచి పాత్ర లభించడంతో ఆయన కూడా బాగా నటించారు. తులసి, రవిబాబు వంటి వారు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. సినిమాలోని కొన్ని చోట్ల ఫన్ పార్ట్ డీసెంట్‌గా, సింపుల్ గా చూపించడం జరిగింది. పరుచూరి బ్రదర్స్ రాసిన కొన్ని డైలాగులు చాలా డెప్త్ ను కలిగి ఉన్నాయి.

 

మైనస్ పాయింట్స్:

 

స్లో గా సాగే కథనం ఈ సినిమాకి మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాలో మంచి సీన్స్ ఉన్నప్పటికీ అవి చాలా తక్కువగా కనిపిస్తాయి. ఈ చిత్రం లో చాలా లాగ్ ఉంది. ఎడిటింగ్ టీమ్ సినిమా పై కాస్త శ్రద్ద వహించి ఇంకా ట్రిమ్ చేసి ఉండాల్సింది. కొన్ని రిపీట్ సన్నివేశాలు ఉన్నాయి.

ఈ చిత్రం లో కొన్ని బలవంతపు సన్నివేశాలు ఉన్నాయి. సినిమాలో ఫైట్ సీక్వెన్స్, దాన్ని చూపించిన విధానం చాలా ఇబ్బందికరం గా ఉంటుంది. ప్రేమ పాత్ర చాలా ఆర్టిఫీషియల్ గా ఉంది. ఈ అంశం పై టీమ్ కొంచెం వర్క్ చేసి ఉండాల్సింది. చాలా రియలిస్తిక్ గా, బాగున్న కథ ఇలాంటి వాటి కారణం గా స్పాయిల్ అయింది అని చెప్పాలి.

సినిమాలోని క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోలేదు. సినిమా స్టార్ట్ చాలా బాగుండటం తో ఎండింగ్ బాగుంటుంది అని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు, కానీ అలా జరగలేదు. కొన్ని పాత్రలు ఇంకా బాగా చేసే అవకాశం ఉన్నా, అలా లేదు. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్‌ లకు డిఫెరెంట్ గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించకపోవచ్చు.

 

సాంకేతిక విభాగం:

 

శివ దినవహి అందించిన రెండు పాటలు మీనింగ్ ఫుల్ గా, చిత్రం థీమ్ కి తగినట్లు గా ఉన్నాయి. మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు, లొకేషన్స్ ని చాలా బాగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి, మేకర్స్ ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చు చేశారు.

ఎడిటింగ్ టీమ్ గురించి చెప్పినట్లుగా, కొన్ని లాగ్ సన్నివేశాలను కత్తిరించాలి. దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల విషయానికి వస్తే, అతను తన కథనంతో ఆకట్టుకున్నాడు. నిర్మాత జగన్ మోహన్ రాసిన బేసిక్ ప్లాట్ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది, అయితే మరింత డ్రామాకు స్కోప్ ఉంది. కానీ, దర్శకుడు సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించడంలో సక్సెస్ కాలేకపోయాడు. రాజేంద్ర ప్రసాద్ నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను రాబట్టడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి.

 

తీర్పు:

 

అనుకోని ప్రయాణం అంటూ థియేటర్ల లోకి వచ్చిన ఈ చిత్రం మంచి కాన్సెప్ట్ తో పాటుగా రాజేంద్ర ప్రసాద్ పెర్ఫార్మెన్స్, ఎమోషన్ సీన్స్, కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి. అయితే లాంగ్ రన్‌టైమ్, స్లోగా సాగే కథనం, ఫోర్స్డ్ సన్నివేశాలతో పాటుగా ఆర్టిఫీషియల్ సీన్స్ సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. ఈ వారాంతం ఒకేసారి ఈ చిత్రాన్ని చూడవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు