ఆడియో రివ్యూ : అలియాస్ జానకి – మెలోడియస్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో ‘పంజా’ సినిమా నిర్మించిన నీలిమ తిరుమలశెట్టి, సంఘ మిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై అందరూ కొత్తవారితో చేసిన ద్వితీయ ప్రయత్నమే ‘అలియాస్ జానకి’. వెంకట్ రాహుల్, అనీష హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ద్వారా దయా.కె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోని ఆదిత్య మ్యూజిక్ ద్వారా నిన్న విడుదల చేసారు. ఈ ఆల్బంలో మొత్తం ఆరు పాటలున్నాయి. ఆ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : కాదల్ ప్రేమ

గాయకుడు : శ్రవణ్

సాహిత్యం : స్వేచ్చ

‘కాదల్ ప్రేమ’ సాంగ్ అందరినీ వెంటనే ఆకట్టుకొని మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చాలా శ్రావ్యంగా సాగే మెలోడీ. శ్రవణ్ పాటకి తన వాయిస్ ఇవ్వడంలో, మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతను ట్యూన్ కి, పాటకి అతని వాయిస్ పర్ఫెక్ట్ గా సరిపోయింది. స్వేచ్చ సాహిత్యం చాలా నీట్ గా ఉంది. ‘కాదల్ ప్రేమ’ సాంగ్ నిదానంగా మంచి హిట్ అవుతుంది. ఈ పాటకి థంబ్స్ అప్.

 

 

2. పాట : మారిందే

గాయకుడు : హరిచరణ్

సాహిత్యం : కార్తీక్ కోడకద

శ్రవణ్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తో ‘మారిందే’ పాట మొదలవుతుంది. ఈ పాటలో ఫ్లూట్ ని చాలా తెలివిగా వినియోగించారు. దానికి హరిచరణ్ తన వాయిస్ ని జోడించి ఇంకో లెవల్ కి తీసుకెళ్ళాడు. ఈ పాట చాలా ప్రశాంతమైన ఫీల్ ని ఇస్తుంది. సాహిత్యం, మ్యూజిక్ విషయంలో ఈ పాట చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ పాటలో మన స్వదేశీ వాయిద్యాల సౌండ్స్ ని ఎక్కువగా వినొచ్చు. ఈ పాటని ఒకటికి నాలుగుసార్లు వింటూ ఉంటే చాలా బాగా నచ్చుతుంది.

3. పాట : కొంచెం కొంచెం

గాయనీ గాయకులు : శ్రవణ్, కావ్య

సాహిత్యం : స్వేచ్చ

ఆల్బంలోని రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ‘కొంచెం కొంచెం’ . శ్రవణ్, కావ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పాటకి సరిపోయే విధంగా చక్కగా తమ గాత్రాన్ని అందించారు. ముఖ్యంగా కావ్య వాయిస్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది, అలాగే ఆమె వాయిస్ వల్ల పాటలో చాలా రొమాంటిక్ ఫీల్ వచ్చింది. స్వేచ్చ సాహిత్యం బాగుంది. ఈ పాటలో గిటార్ ని చాలా బాగా ఉపయోగించారు. ‘కొంచెం కొంచెం’ చాలా ప్రశాంతంగా, స్లోగా సాగే మెలోడీ సాంగ్. పాట వినగానే నచ్చేలా ఉంది. ఈ ఆల్బంలోని మొదటి మూడు పాటలు చాలా బాగున్నాయి.

 

4. పాట : అరణ్యమంతా

గాయకుడు : బలరాం అయ్యర్

సాహిత్యం : కృష్ణకాంత్

‘ఆరణ్యమంతా’ పాట చాలా బాధాకరంగా సాగే సోలో నెంబర్. బలరాం అయ్యర్ ఎంతో జాగ్రత్తగా ఆలపించి తన వాయిస్ తో పాటకి పూర్తి న్యాయం చేసాడు. కృష్ణ కాంత్ సాహిత్యం ఎంతో లోతుగా మరియు పవర్ఫుల్ గా ఉంది. ఈ పాటలో రివెంజ్, కోపం, బాధ మొదలైన పవర్ఫుల్ ఎమోషన్స్ ని చూపించే అవకాశం ఉంది. పాట ఫీల్ కి కరెక్ట్ గా సరిపోయేలా మ్యూజిక్ ఉంది. ఈ పాటకి మంచి విజువల్స్ తోడైతే స్క్రీన్ పై చూడటానికి చాలా బాగుంటుంది.

 

5. పాట : సంతలో పెరిగిన సుందరి

గాయని : శ్రావణి భార్గవి

సాహిత్యం : సురేంద్ర కృష్ణ

‘సంతలో పెరిగిన సుందరి’ పాట సినిమాలోని ఐటెం సాంగ్. రామ్ నారాయణ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటని శ్రావణ భార్గవి పాడింది. మ్యూజిక్ లో మాస్ టచ్ ఉంది. సురేంద్ర కృష్ణ సాహిత్యం అన్ని ఐటెం సాంగ్స్ లానే ప్రేరేపించే విధంగా ఉంది. ఇది కేవలం ముందు బెంచ్ వారి కోసం మాత్రమే చేసిన యావరేజ్ సాంగ్.

 

 

6. పాట : కాటుక కనుల

గాయకుడు : సాయి చరణ్

సాహిత్యం : కార్తీక్ కోడకద, అశ్విన్

కార్తీక్ కోడకద, అశ్విన్ కలిసి రచించిన ‘కాటుక కనుల’ పాత ఆల్బంలోని మరో సోలో సాంగ్. ఈ పాటకి సాయి చరణ్ గాత్రాన్ని అందించాడు. ఇండియన్ – వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ ని కలిపి ఈ పాటకి మ్యూజిక్ అందించాడు కానీ మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. ఈ పాటలోని సాహిత్యం పాటకి మంచి మూడ్ ని తెచ్చింది. మొత్తంగా ఆల్బంలో వినడానికి ఓకే అనిపించే పాట. కానీ ఈ ఆల్బంలోని మొదటి మూడు పాటలకంటే బెటర్ సాంగ్ మాత్రం కాదు.

తీర్పు :

అందరినీ ఆశ్చర్య పరిచేలా ‘అలియాస్ జానకి’ మంచి మెలోడియస్ ఆల్బం అయ్యింది. శ్రవణ్ చాలా రిఫ్రెష్ అయ్యేలాంటి ట్యూన్స్ తో ఆల్బం చేసాడు. అలాగే సాంగ్స్ చాలా చాలా ప్రశాంతంగా, మంచి క్వాలిటీతో వినసొంపుగా ఉన్నాయి. నా వరకూ ‘కాదల్ ప్రేమ’, ‘మారినదే’, ‘కొంచెం కొంచెం’ పాటలు ఆల్బంలో బెస్ట్ సాంగ్స్. ఇప్పటికీ మీరు ఈ సినిమా సాంగ్స్ విని ఉండకపోతే ఇప్పుడే వినండి. ‘అలియాస్ జానకి’ సినిమాకి మంచి మ్యూజిక్ ఆల్బం తోడవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి హిట్ సాధించే చాన్స్ ఉంది.

రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు

అనువాదం : రాఘవ

Click here for English Review

సంబంధిత సమాచారం :

More