ఆడియో రివ్యూ : ఎవడు – రామ్ చరణ్ మరో మాస్ ఎంటర్టైనర్

yevadu-audio-review

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని ఆశిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి డైరెక్టర్. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోని నిన్న మెగాస్టార్ చేతులమీదుగా రిలీజ్ చేసారు. మన దేవీశ్రీ మొదటిసారిగా చరణ్ కి అందించిన పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : ఫ్రీడం
గాయకుడు : సుచిత్ సురేసన్
సాహిత్యం : కృష్ణ చైతన్య

‘ఫ్రీడం’ సాంగ్ సినిమాలో మొదటగా హీరో పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కృష్ణ చైతన్య ఈ పాటకి సాహిత్యం అందించాడు. అతని సాహిత్యం బాగుంది. ఈ పాటలో ప్రస్తుతం ఉన్న యంగ్ జెనరేషన్ యొక్క ఫ్రీడం గురించి చెప్పారు. సుచిత్ సురేసన్ పాటకి తన గాత్రంతో తనవంతు న్యాయం చేసాడు. దేవీశ్రీ మ్యూజిక్ చాలా వేగంగా ఉంది. అలాగే ఈ పాటలో వెస్ట్రన్ వాయిద్యాలను ఉపయోగించారు, అవి సౌండ్ సౌండ్ ట్రాక్ ని కాస్త డామినేట్ చేస్తాయి. మొత్తంగా చూసుకుంటే వినడానికి డీసెంట్ గా ఉండే సాంగ్ ‘ఫ్రీడం’.

2. పాట : నీ జతగా
గాయనీ గాయకులు : కార్తీక్, శ్రేయా ఘోషల్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

‘నీ జతగా’ పాట ఎంతో మెలోడియస్ గా సాగే డ్యూయెట్ సాంగ్. కార్తీక్, శ్రేయ ఘోషల్ తమ వాయిస్ పరంగా ఎంతో జాగ్రత్త తీసుకొని చాలా బాగా పాడారు. ఈ పాటకి శ్రేయ ఘోషల్ వాయిస్ పెద్ద ప్లస్ గా చెప్పుకోవాలి. సిరివెన్నెల గారి సాహిత్యం ఓ ప్రేమ కవితలా ఉంది. దేవీశ్రీ మ్యూజిక్ వినడానికి చాలా బాగుంది. ఈ పాట మొదట్లో గిటార్ సౌండ్స్ తో మొదలవుతుంది ఆ తర్వాత సింథసైజర్ ని ఉపయోగించారు. ఈ పాట వినగానే ప్రతి ఒక్కరికీ నచ్చేస్తుంది, అలాగే ఈ పాట బాగా పాపులర్ అవుతుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

 

3. పాట : అయ్యో పాపం
గాయనీ గాయకులు : రంజిత్, మమత శర్మ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

‘అయ్యో పాపం’ సినిమాలో వచ్చే ఐటెం సాంగ్. ఈ పాత బి,సి సెంటర్లలో బాగా పాపులర్ అవుతుంది. ఈ పాట కూడా చాలా వేగంగా ఉంటుంది అలాగే ఈ పాటలో దేవీశ్రీ మంచి బీట్స్ తో వినే వారికి మంచి ఎనర్జీ ఫీల్ ని క్రియేట్ చేసాడు. ఒక ఐటెం సాంగ్ కి సాహిత్యం ఎలా ఉండాలో అదే రీతిలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఉంది. మమతా శర్మ తన వాయిస్ కి ఎంతో ఎనర్జీని నింపి ఈ పాటని చాలా బాగా పాడింది. రజిత్ కూడా తన గాత్రంతో తన వంతు న్యాయం చేసాడు.

4. పాట : చెలియా
గాయకుడు : కె.కె
సాహిత్యం : చంద్రబోస్

‘చెలియా చెలియా’ పాట సింగర్ కెకె పాడిన సోలో సాంగ్. ఈ పాట కొంత వరకూ ‘ఊసరవెళ్లి’ సినిమాలోని ‘బ్రతకాలి’ పాటని పోలి ఉంది. చంద్రబోస్ ఈ పాటకి సాహిత్యం అందించాడు. ఈ పాటలో భాదాకరమైన ఫీలింగ్స్ ని చూపించారు, అలాగే తన ప్రేమికురాలి నుండి హీరో విడిపోయినప్పుడు వచ్చే భావాన్ని కూడా ఇందులో వినిపించారు. ఈ పాటలోని సాహిత్యం వల్ల వినడానికి డీసెంట్ గా ఉంది. ఈ పాట సినిమాలో చాలా కీలకమైన సమయంలో వస్తుందని ఆశించవచ్చు.

 

 

5. పాట : ఓయే ఓయే
గాయనీ గాయకులు : డేవిడ్ సిమోన్, ఆండ్రియా
సాహిత్యం : శ్రీ మని

‘ఓయే ఓయే’ మూవీలో వచ్చే రొమాంటిక్ డ్యూయెట్. డేవిడ్ సిమోన్ – ఆండ్రియాలు ఈ పాటకి తమ చక్కని గాత్రాన్ని అందించారు. శ్రీ మని అందించిన సాహిత్యం యావరేజ్ గా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఓకే అనేలా ఉంది, అలాగని తప్పుగా చెప్పటానికి కూడా ఏమీ లేదు. ఈ పాట విజువల్స్ బాగుండి దానికి రామ్ చరణ్ స్టెప్పులు తోడైతే మొత్తంగా యావరేజ్ పాటవుతుంది.

 

 

6. పాట : పింపుల్ డింపుల్
గాయనీ గాయకులు : సాగర్, రనిన రెడ్డి
సాహిత్యం : రామ్ జోగయ్య శాస్త్రి

‘పింపుల్ డింపుల్’ ఈ ఆల్బంలోని మరో మాస్ సాంగ్. ఈ సాంగ్ మంచి బీట్స్ తో వేగంగా ఉంది. ముఖ్యంగా ముందు బెంచ్ వారిని టార్గెట్ చేసిన పాట ఇది. సాగర్ – రనిన రెడ్డిలు తమ వాయిస్ లతో పాటని బాగా పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఓకే అనేలా ఉంది. దేవీశ్రీ ఈ పాటకి మాస్ బీట్స్ తో ఊపు తెచ్చే మ్యూజిక్ ఇచ్చాడు. ‘పింపుల్ డింపుల్’ సాంగ్ మాస్ ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది.

తీర్పు :

ఇప్పటి వరకూ వచ్చిన రామ్ చరణ్ పలు సినిమాల్లాగానే ‘ఎవడు’ ఆడియో కూడా మాస్ ఎంటర్టైనింగ్ ఆల్బం. దేవీ శ్రీ ప్రసాద్ చాలా సేఫ్ సైడ్ గా డీసెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ఆల్బంని మీరు టొయోటతో పోల్చవచ్చు. ఈ ఆల్బంలోని పాటలు అందరినీ షాక్ కి గురిచేసేలా ఉండవు అలాగని నిరుత్సాహపరిచేలా కూడా ఉండవు. ఎవడు సాంగ్స్ ఫ్యాన్స్ కి నచ్చుతాయి మరియు రామ్ చరణ్ లోని డాన్సింగ్ స్కిల్స్ ని మరో చూపించడానికి చక్కని అవకాశం ఉంది. ఈ ఆల్బంలో నుంచి నా చాయిస్ అయితే ‘నీ జతగా’, ‘అయ్యో పాపం’, చెలియా చెలియా’ సాంగ్స్ బెస్ట్.

రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు

అనువాదం : రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :