సమీక్ష : ‘భళా తందనాన’ – స్లోగా సాగే క్రైమ్ డ్రామా !

సమీక్ష : ‘భళా తందనాన’ – స్లోగా సాగే క్రైమ్ డ్రామా !

Published on May 7, 2022 3:02 AM IST
Bhala Thandhanana Movie Review

విడుదల తేదీ : మే 06, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: శ్రీవిష్ణు, కేథరిన్ త్రెసా, గరుడ రామ్, పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస రెడ్డి, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ

దర్శకత్వం : చైతన్య దంతులూరి

నిర్మాతలు: రజనీ కొర్రపాటి

సంగీత దర్శకుడు: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు

ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్

యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం నిర్మించిన కొత్త సినిమా ‘భళా తందనాన’. శ్రీవిష్ణు సరసన కేథరిన్‌ హీరోయిన్ గా నటించింది. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

 

శశి (కేథరిన్) చాలా మంది రాజకీయ నాయకుల చీకటి కోణాలను బహిర్గతం చేసే ఒక పవర్ ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్. చందు (శ్రీవిష్ణు) ఒక అమాయకుడు, అతను అనాథాశ్రమంలో అకౌంటెంట్‌గా పని చేస్తుంటాడు. అయితే, ఒక సంఘటన కారణంగా వీరిద్దరూ సన్నిహితంగా మారతారు. మరోపక్క హవాలా డబ్బుతో రాజకీయాలను సైతం శాసించే ఆనంద్ బాలి దగ్గర నుంచి రెండు వేల కోట్లు ఎవరో కొట్టేస్తారు. ఆ డబ్బుకి చందుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? అసలు చందు ఎవరు ? శశి – చందు జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన చందు పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ట్విస్ట్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘భళా తందనాన’ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ముఖ్యంగా కామెడీ టోన్ తో సాగే కొన్ని సస్పెన్స్ సీన్స్ అండ్ ట్విస్ట్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీ విష్ణు తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు.

అలాగే, కీలక పాత్రలో నటించిన కేథరిన్‌ కూడా చాలా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు చైతన్య దంతులూరి బాగా తీశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే సీన్స్ ను తెరకెక్కించడంలో అతను సక్సెస్ అయ్యాడు.

 

మైనస్ పాయింట్స్ :

 

కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు చందు క్యారెక్టర్ కి ఇచ్చిన ఓవర్ బిల్డప్ కూడా బాగాలేదు. అయితే దర్శకుడు చైతన్య దర్శకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడం కూడా బాగాలేదు.

ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ రెగ్యులర్ ఎమోషనల్ క్రైమ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. ఓవరాల్ గా అవసరానికి మించిన స్లో సన్నివేశాలు లేకుండా ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

 

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు సమకూర్చిన పాటలు బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. కెమెరామెన్ వాటిని తెరకెక్కించిన విధానం మాత్రం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

 

‘భళా తందనాన’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలో కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా… పూర్తి స్థాయిలో మాత్రం సినిమా మెప్పించలేకపోయింది. అయితే, శ్రీ విష్ణు నటన అండ్ కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బాగున్నాయి. కానీ, కథ కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ ఓ వర్గం ప్రేక్షకులకు కనెక్ట్ అయినా… ఈ సినిమా మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం నచ్చదు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు