సమీక్ష : మంచి మనసున్న బాడీగార్డ్

విడుదల తేది :14 జనవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5
దర్శకుడు : గోపీచంద్ మలినేని
నిర్మాత :బెల్లంకొండ సురేష్
సంగిత డైరెక్టర్ : తమన్ యస్
తారాగణం : వెంకటేష్ , త్రిష కృష్ణన్ , సలో

విక్టరీ వెంకటేష్ నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బాడీగార్డ్’ ఈ రోజే విడుదలైంది. త్రిషా మెయిన్ హీరోయిన్ గా నటించగా సలోని మరో హీరోయిన్ గా నటించారు. ‘బాడీగార్డ్’ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

వెంకటాద్రి (వెంకటేష్) ని వరదరాజుల నాయుడు (ప్రకాష్ రాజ్) కూతురికి కీర్తి (త్రిషా)కి ‘బాడీగార్డ్’ గా నియమిస్తాడు. కాలేజ్ కి వెళ్ళే కీర్తికి తన శత్రువుల నుండి అపాయం రాకుండా సెక్యురిటీగా వెంకటాద్రి ఉంటాడు. వెంకటాద్రి కూడా కాలేజ్ కి వెళ్తాడు. వెంకటాద్రి సెక్యూరిటీ ఎక్కువగా ఉండటంతో కీర్తి మరియు తన స్నేహితురాలు స్వాతి (సలోని) కలిసి ఒక ప్లాన్ వేస్తారు. కీర్తి వెంకటాద్రి ఒక తెలియని అమ్మాయిలాగా ఫోన్ చేసి లవర్ అని నమ్మిస్తారు. ఈ గేమ్ అటు ఇటు తిరిగి సీరియస్ గా మారుతుంది. వరదరాజులు నాయుడు కీర్తిని తన బావకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తర్వాత ఎమ్ జరిగింది, వెంకటాద్రికి ఫోన్ చేస్తున్న అమ్మాయి ఎవరు? అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

వెంకటాద్రి పాత్రలో వెంకటేష్ చాలా బాగా నటించారు. ఇలాంటి పాత్రలు వెంకీకి కొట్టిన పిండి. ఆయన వెంకటాద్రి పాత్రలో చాలా వైవిధ్యాలు చూపించారు. బాడీగార్డ్ నుండి ప్రేమికుడిగా మారే సన్నివేశాలు వైవిధ్యం చూపించాడు. ఆయన చేసిన ఫైట్స్ ఫ్యాన్స్ ని బాగా అలరిస్తాయి. కీర్తి పాత్రలో త్రిషా కూడా బాగా చేసింది. ప్రేమ మరియు కుటుంబం మధ్య నలిగిపోయే యువతిగా బాగా నటించింది. సలోని చాలా బాగా చేసింది. ఇంత మంచి నటిని చాలా వరకు సరిగా చూపించలేకపోయారు కాని ఈ సినిమాలో మాత్రం బాగా చేసింది. ప్రకాష్ రాజ్ తన పాత్రకి న్యాయం చేసారు. అలీ మరియు ధర్మవరపు సుబ్రహ్మణ్యం పర్వాలేదనిపించాడు. జయప్రకాశ్ రెడ్డి బాగా నవ్వించాడు. సెంటిమెంట్ మరియు కామెడీ రెండూ బాలన్స్ గా చూపించారు. క్లైమాక్స్ సన్నివేశాలు చాల బాగా తీసారు. కొందరికి కళ్ళల్లో నీరు తిరుగుతాయి.

మైనస్ పాయింట్స్:

ఈ కథ దాదాపుగా అందరు ప్రేక్షకులకు తెలిసిందే. చాలా వరకు హిందీ మరియు తమిళ భాషల్లో చూసి ఉండటం. తరువాత ఏం సన్నివేశాలు వస్తాయో ముందే ఊహిస్తారు. సినిమా రెండవ భాగంలో కొన్ని బోర్ కొట్టే సన్నివేశాలు ఉండటం. కోట శ్రీనివాస రావు పాత్ర సినిమాకి పెద్దగా ఉపయోగపడలేకపోయింది. సుబ్బరాజు తన గత చిత్రాల్లాగే చేసాడు. పెద్దగా తేడా చూపించలేకపోయాడు. కొన్ని పాటలు బాగానే ఉన్నప్పటికీ కీలక సన్నివేశాల సమయాల్లో వచ్చి ఇబ్బందిగా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం:

సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ పర్వాలేదు. కోన వెంకట్ డైలాగ్స్ చాలా బావున్నాయి. కొన్ని సన్నివేశాలకు అవి బాగా ఉపయోగపడ్డాయి. తమన్ మ్యూజిక్ రొటీన్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. కొన్ని ఫైట్ సన్నివేశాలు బి సి సెంటర్ ప్రేక్షకులను అలరిస్తాయి. డాన్సులు వెంకీ స్టైల్లో ఉన్నాయి.

తీర్పు:

బాడీగార్డ్ కుటుంబ సభ్యులందరితో కలిసి చూడదగ్గ చిత్రం. కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్వించగా కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు ఏడిపిస్తాయి. రెండవ భాగంలో కొన్ని సన్నివేశాలు వదిలేస్తే క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది.

అశోక్ రెడ్డి. ఎమ్

123తెలుగు.కాం రేటింగ్: 3.25/5

Clicke Here For Bodyguard English Review1

సంబంధిత సమాచారం :