సమీక్ష 2 : బాడీగార్డ్ – ఎమోషనల్ లవ్ స్టొరీ

విడుదల తేది :14 జనవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5
దర్శకుడు : గోపీచంద్ మలినేని
నిర్మాత :బెల్లంకొండ సురేష్
సంగిత డైరెక్టర్ : తమన్ యస్
తారాగణం : వెంకటేష్ , త్రిష కృష్ణన్ , సలో

వెంకటేష్ సినిమా అంటే కుటుంబ సభ్యులందరితో కలిసి చూడొచ్చు అనే బ్రాండ్ ఉంది. తనదైన శైలి సెంటిమెంట్ కామెడీ ఉండేలా అందరిని అలరిస్తూ ఉంటాడు. వెంకీ నటించిన బాడీగార్డ్ ఈ రోజే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

ఒక కారు ప్రమాదంలో పెద్దయ్య (ప్రకాష్ రాజ్) వెంకటాద్రి (వెంకటేష్) కుటుంబాన్ని కాపాడతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దయ్య కూతురు (కీర్తి)కి బాడీగార్డ్ గా వెంకటాద్రి ని నియమిస్తారు. పెద్ధయ్యకి ఉన్న శత్రువుల వల్ల కీర్తికి ప్రమాదం పొంచి ఉండటంతో ఈ బాడీగార్డ్ ని నియమిస్తారు. వెంకటాద్రి కీర్తిని అనుక్షణం ఫాలో కావడం కాలేజ్ కి వస్తుండటంతో కీర్తికి మరియు తన స్నేహితురాలు స్వాతి (సలోని)కి ఇబ్బందిగా మారుతుంది. తను సరిగా చదవలేక ఇబ్బంది పడుతుండటంతో వెంకటాద్రి నుండి తప్పించుకునేందుకు వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. ఒక ప్రైవేట్ నంబర్ నుండి ఫోన్ చేసి వెంకటాద్రిని ప్రేమిస్తున్నట్లు నమ్మిస్తారు. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఆ ఫోన్ చేసేది తానే అని కీర్తి చెప్పాలనుకుంటుంది. పెద్దయ్య కీర్తికి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ గందరగోళంలో కీర్తి వెంకటాద్రికి నిజం చెప్పిందా? అన్నది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రం మలయాళంలో వచ్చిన బాడీగార్డ్ కి రిమేక్. తమిళ్ మరియు హిందీ భాషల్లో రిమేక్ చేయగా అక్కడకూడా విజయవంతమైంది. వెంకటేష్ ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఫ్యాన్స్ ని అలరిస్తాడు. త్రిషా కూడా బాగా నటించింది ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో బాగా నటించింది. ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో నటించాడు. కోట శ్రీనివాస రావు విలన్ గా బాగానే చేసాడు. సలోని క్లైమాక్స్ సన్నివేశాల్లో బాగా నటించింది. అలీ, సుబ్బరాజు పర్వాలేదనిపించారు. వేణుమాధవ్ బాగానే నవ్వించాడు. జయప్రకాశ్ రెడ్డి కొన్ని సన్నివేశాల్లోనే ఉన్నా బాగా నవ్వించాడు.

మైనస్ పాయింట్స్:

చిత్ర మొదటి భాగం పర్వలేధనిపించినప్పటికీ రెండవ భాగం కొంత బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. వెంకటేష్ మాస్ డైలాగులు చెప్పడం మరియు ఫైట్ సన్నివేశాలు ఆయన ఫ్యాన్స్ ని మాత్రమే అలరించాయి. హేరో హీరోయిన్ మధ్య లవ్ సన్నివేశాలు ఇంకా బాగా తీయాల్సింది.

సాంకేతిక విభాగం:

డైలాగులు బావున్నాయి. తమన్ సంగీతంలో 2 పాటలు బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అందమైన లొకేషన్లు ఇంకా అందంగా చూపించాడు. ఈ కథ ఇప్పటికే మూడు భాషల్లో రూపొందినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చిత్రీకరించడానికి సినిమాటోగ్రఫీ మరియు సంగీతం దర్శకుడికి బాగా హెల్ప్ అయ్యాయి. ఎడిటింగ్ పర్వాలేదు.

తీర్పు:

బాడీగార్డ్ సింపుల్ స్టొరీ కానీ ఎమోషనల్ లవ్ స్టొరీ. కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా చూడండి.

అశోక్ రెడ్డి. ఎమ్

123తెలుగు.కాం రేటింగ్: 3.25/5

Clicke Here For Bodyguard English Review 2

సంబంధిత సమాచారం :