ఓటిటి రివ్యూ: క్యాబ్ స్టోరీస్ – తెలుగు చిత్రం స్పార్క్‌లో

Cab-Stories movie review

విడుదల తేదీ : మే 28,2021

123telugu.com Rating : 2.25/5

నటీనటులు : దివి వడ్త్య, షిహాన్, ధన్‌రాజ్, గిరిధర్, ప్రవీణ్, సిరి మరియు నందిని

దర్శకుడు : కె వి ఎన్ రాజేశ్

నిర్మాణం : ఎస్ క్రిష్ణ

సంగీతం : సాయి కార్తీక్

సినిమాటోగ్రఫీ : సుజాత సిద్ధార్థ్

ఎడిటింగ్ : తమ్మిరాజు

ప్రస్తుతం కొనసాగుతున్న పలు ఓటిటి చిత్రాలు మరియు వెబ్ సిరీస్ ల రివ్యూల క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం “క్యాబ్ స్టోరీస్”. ఈ మూవీ స్పార్క్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ:

 

గిరి(గిరిధర్) ఓ క్యాబ్ డ్రైవర్. అతని క్యాబ్‌ను కొందరు హైర్ చేసుకుంటారు. అయితే వారు ఆ క్యాబ్‌లో ఓ డ్రగ్ పదార్థాన్ని మరిచిపోతారు. ఆ తర్వాత అదే క్యాబ్‌ను తాగిన మైకంలో ఉన్న దివి అనే అమ్మాయి హైర్ చేసుకుంటుంది. అయితే కొన్ని క్రేజీ పరిణామాల నేపధ్యంలో ఆ డ్రగ్ ప్యాకెట్ దివి పర్సులోకి వెళుతుంది. ఆ తర్వాత డ్రగ్ మాఫియా డ్రగ్ ప్యాకెట్ కోసం క్యాబ్ డ్రైవర్‌ను వెంబడించడం మరియు ఆ డ్రగ్ ప్యాకెట్ చాలా చేతులు మారినప్పుడు క్రేజీ విషయాలు చోటు చేసుకుంటాయి. మరీ గిరి మరియు దివి ఈ పరిస్థితుల నుంచి ఎలా తప్పించుకుంటారన్నదై తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

 

ఏమి బాగుంది.?

 

ఈ చిత్రంతో దివి పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా కనిపించింది. ఆమె తన డ్యాన్స్ నైపుణ్యాలను, ఎమోషన్స్‌ను చక్కగా కనబరిచింది. ఆమె మంచి స్క్రీన్ ఉనికిని కలిగి ఉంది కానీ ఆమె బాడీ లాంగ్వేజ్ కాస్త మెరుగుపరుచుకోవాలేమో అనిపించింది.

ఇకపోతే ప్రఖ్యాత నటుడు, గిరిధర్ మంచి పాత్రను పోశించాడు మరియు అతను క్యాబ్ డ్రైవర్‌గా చాలా బాగా చేస్తాడు. ఇక ధన్‌రాజ్ కూడా తన పాత్రను చక్కగా పోశించాడు. కథ చాలా చక్కగా సెట్ చేయబడినందున ఈ చిత్రం మొదటి అరగంట చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

 

ఏమి బాగాలేదు.?

 

మంచి ఆరంభం తరువాత, కథనంలో సీరియస్‌నెస్ మిస్ అయినట్టు అనిపించింది. ఈ సినిమాలో చెడ్డవారిగా నటించిన నటులు కొత్తవారు ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఈ సినిమా మొత్తం డ్రగ్స్ ప్యాకెట్‌ని కనుగొనే గూండాల గురించి ఉంటుంది మరియు వారు ఎలాంటి నేరానికి కూడా భయపడరు.

ఈ చిత్రం యొక్క చివరి భాగంలో దివి పాత్ర పెద్దగా ఏమీ లేదు. సినిమా కేవలం గంటన్నర మాత్రమే అయినప్పటికీ పదిహేను నిమిషాలు ముందుగానే ముగించేశినట్టు అనిపిస్తుంది. ఇక చివర్లో హీరోయిన్ స్నేహితుడు తన కామంతో యజమానితో వ్యవహరించే ఎపిసోడ్ విసుగు తెప్పిస్తుంది.

ఒక థ్రిల్ మూవీగా కథనాన్ని రాసుకున్న సినిమా ఎక్కడ కూడా థ్రిల్‌గా ఉన్నట్టు అనిపించదు. చివరకు ఈ చిత్రం ఎటువంటి స్పష్టత లేకుండానే ముగుస్తుంది.

 

సాంకేతిక విభాగం :

 

ఈ చిత్రం యొక్క నిర్మాణ విలువలు బాగున్నాయి. బీజీఎం కూడా చాలా బాగుంది మరియు చాలా సన్నివేశాలను ఎలివేట్ చేస్తుంది. రాత్రి దృశ్యాలను ప్రదర్శించే కెమెరా పని కూడా బాగుంది. అలాగే సినిమాలో డైలాగులు బాగున్నాయి. అయితే స్క్రీన్ ప్లే మరియు ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా మందకొడిగా అనిపించడమే కాకుండా ప్రేక్షకులకు విసుగు తెప్పించేలా అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ కూడా బాగాలేదనే చెప్పాలి.

 

తీర్పు :

 

ఇక మొత్తం మీద క్యాబ్ స్టోరీస్ ఒక ఆసక్తికరమైన కథాంశాన్ని కలిగి ఉన్న చిత్రం కానీ కొన్ని చెడు కథనాలతో చెడిపోయింది. దివి తన పాత్రలో బాగా నటించింది కానీ అసహ్యమైన రచన, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మరియు నిస్తేజమైన క్లైమాక్స్ కలిగి ఉండడంతో ఈ సినిమా చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఈ చిత్రాన్ని సిల్లీగా చూసేయొచ్చు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :