సమీక్ష : “సిఎస్ఐ సనాతన్” – అక్కడక్కడా ఆకట్టుకునే థ్రిల్లర్

CSI Sanatan Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 10, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ఆది సాయి కుమార్, మిషా నారంగ్, నందిని రాయ్, తారక్ పొన్నప్ప, వాసంతి, సంజయ్ రెడ్డి, మధుసూధన్ రావు, అలీ రెజా, ఖయ్యూమ్, శివ కార్తీక్, వికాస్, రవి ప్రకాష్, భూపాల్ రాజు.

దర్శకుడు : శివశంకర్ దేవ్

నిర్మాతలు: అజయ్ శ్రీనివాస్

సంగీత దర్శకులు: అనీష్ సోలమన్

సినిమాటోగ్రఫీ: గంగన్మోని శేఖర్

ఎడిటర్: అమర్ రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి పలు చిత్రాలు వచ్చాయి. మరి ఈ చిత్రాల్లో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన మరో థ్రిల్లర్ చిత్రం “సిఎస్ఐ సనాతన్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం అయితే ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వస్తే..విక్రమ్ చక్రవర్తి(తారక్ పొన్నప్ప) అనే పేరు మోసిన ఫైనాన్స్ కంపెనీ సీఈఓ అనుమానాస్పదంగా హత్య చెయ్యబడతాడు. అయితే ఈ ప్రముఖ వ్యక్తిని చంపింది ఎవరు? అనే కేసు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వెళ్తుంది. అయితే ఈ కేసును సనాతన్(ఆది సాయి కుమార్) క్రైమ్ సీన్ ఇవెస్టిగేషన్(సిఎస్ఐ) లో వర్క్ చేస్తున్న స్పెషలిస్ట్ అయిన తన దగ్గరకి వెళ్తుంది. మరి తాను ఈ మర్డర్ మిస్టరీని తాను సాల్వ్ చేశాడా లేదా? ఈ ఇన్వెస్టిగేషన్ లో హీరోయిన్ పాత్ర ఏంటి? ఇంతకీ ఆ విక్రమ్ చక్రవర్తి ఎవరు అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

తన కెరీర్ లో ఆది చిత్రాలకి ఫలితం పక్కన పెడితే నటుడుగా మాత్రం తన సినిమా సినిమాకి చాలా బెటర్ అవుతున్నాడని చెప్పాలి. ఇదే రకంగా ఈ చిత్రంలో కూడా ఆది నుంచి సరికొత్త వెర్షన్ ని మనం చూడొచ్చు. చాలా డిఫరెంట్ గా ఓ సీరియస్ రోల్ లో ఈ సినిమాలో తాను కనిపించి ఆకట్టుకుంటాడు. పలు ఎమోషన్స్ ని సీరియస్ సన్నివేశాల్లో తాను సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు.

అలాగే నటుడు బిగ్ బాస్ ఫేమ్ ఆలీ రెజా కి ఈ చిత్రంలో మంచి పాత్ర దక్కింది అని చెప్పొచ్చు. అలాగే నందిని రాయ్, రవి ప్రకాష్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. ఇక అలాగే ఈ సినిమాలో కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే ఆసక్తిగా అనిపిస్తాయి అలాగే పలు ట్విస్ట్ లు ఇంప్రెస్ చేస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఈ తరహా థ్రిల్లర్ చిత్రాలకి మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తప్పనిసరి. కానీ ఈ సినిమాలో ఇది పూర్తి స్థాయిలో కనిపించదు దీనితో ఈ సినిమా పూర్తి స్థాయి థ్రిల్లర్ గా అనిపించిందని చెప్పాలి. ఇంకా కొన్ని సీన్స్ ని మరింత ఆసక్తిగా మలిచేందుకు ఛాన్స్ ఉన్నా వాటిని సరిగ్గా డెవలప్ చెయ్యలేదు. అలాగే సినిమాలో చాలా సీన్స్ లో సిల్లీ నరేషన్ మరియు డైలాగ్స్ కూడా కనిపిస్తాయి వీటితో ఈ సినిమా విషయంలో మరింత చికాకు అనిపిస్తుంది.

అలాగే చాలా చోట్ల లాజిక్స్ పొంతన ఉండదు. వీటితో పాటుగా కొందరి నటులకి అయితే అంత ప్రాధాన్యత కూడా కనిపించదు. ఇక వారిలో హీరోయిన్ కూడా ఉంది. ఇలా చాలా అంశాల్లో అయితే ఈ సినిమా ఏమంత మెప్పించే విధంగా అనిపించదు. దీనితో సగం వండి వార్చిన అన్నంలా ఈ థ్రిల్లర్ అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రానికి నిర్మాణ విలువలు పర్లేదని చెప్పొచ్చు. అలాగే టెక్నీకల్ టీం లో అయితే ఎవరూ కూడా ఈ తరహా థ్రిల్లర్ కి తగ్గ రేంజ్ వర్క్ అయితే అందివ్వలేదు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఏవీ ఇంప్రెసివ్ గా ఉండవు. అలాగే డైలాగ్స్, ఎడిటింగ్ కూడా బాగాలేవు.

ఇక దర్శకుడు శివశంకర్ దేవ్ విషయానికి వస్తే తాను మంచి కథనే తీసుకున్నారు కానీ సినిమా సరైన స్క్రీన్ ప్లే ని రాసుకోలేదు. కొన్ని సీన్స్ మినహా సినిమాలో ఆసక్తికర నరేషన్ పెద్దగా కనిపించలేదు. పైగా డైలాగ్స్ లాంటి విషయాల్లో తమ అజాగ్రత్తలు కనిపిస్తాయి. దీనితో డైరెక్షన్ పరంగా తన వర్క్ మాత్రం బిలో యావరేజ్ అని చెప్పక తప్పదు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూస్తే ఈ చిత్రం “సిఎస్ఐ సనాతన్” అక్కడక్కడా పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే ఆది సాయి కుమార్ తన ప్రామిసింగ్ నటనతో సిన్సియర్ అటెంప్ట్ ని మరోసారి అందించాడు. కానీ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో లోపాలు సినిమాపై ఆసక్తిని తగ్గించేస్తాయి. దీనితో ఈ వారాంతానికి ఈ థ్రిల్లర్ యావరేజ్ నుంచి బిలో యావరేజ్ ట్రీట్ ని అందిస్తుంది. అలాగే థ్రిల్లర్ మూవీ లవర్స్ కి అయితే ఓ మోస్తరుగా ఆకట్టుకోవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :