సమీక్ష : “దాస్ కా ధమ్కీ” – అక్కడక్కడా పర్వాలేదనిపిస్తుంది

సమీక్ష : “దాస్ కా ధమ్కీ” – అక్కడక్కడా పర్వాలేదనిపిస్తుంది

Published on Mar 23, 2023 3:03 AM IST
Das Ka Dhamki Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 22, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: విశ్వక్ సేన్, నివేతా పెత్తురాజ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, అజయ్, హైపర్ ఆది, అక్షర గౌడ, శౌర్య కరే, జబర్దస్త్ మహేష్

దర్శకుడు : విశ్వక్ సేన్

నిర్మాతలు: కరాటే రాజు

సంగీత దర్శకులు: లియోన్ జేమ్స్

సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు

ఎడిటర్: అన్వర్ అలీ

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

చాలా వారాల తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ప్రమోషన్స్ నడుమ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేతా పెత్తురాజ్ హీరోయిన్ గా నటించిన “దాస్ కా ధమ్కీ” అయితే రిలీజ్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఎంతవరకు అలరించిందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వస్తే..కృష్ణ దాస్(విశ్వక్ సేన్) ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్ గా పని చేస్తూ ఉంటాడు కానీ తనకి మాత్రం లైఫ్ లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అలాగే మరో పక్క ఎస్ ఆర్ ఫార్మా చైర్మన్ గా డాక్టర్ సంజయ్ రుద్ర(మరో విశ్వక్ సేన్) తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి ఈ ఇద్దరూ ఒకరికి ఒకరు లింక్ ఉంటుందా? లేక వేరే వేరేనా? కథలో సంజయ్ రుద్ర కి ఏమవుతుంది? తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తీ(నివేతా పెత్తురాజ్) ఎవరితో లింక్ ఉంటుంది? ఇలా అనేక ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమలో మొదటగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుంచి మొదలు పెడితే తాను రెండు షేడ్స్ లో ఈ సినిమాలో సాలిడ్ పెర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేస్తాడు. ఇది వరకు కూడా ఇలాంటి యూత్ ఫుల్ అగ్రెసివ్ రోల్స్ లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్ లో అయితే మంచి సెటిల్డ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్ లో కూడా మంచి వేరియేషన్స్ ని ఎమోషన్స్ ని బాగా చేసాడు.

ఇక హీరోయిన్ నివేతా తన గత సినిమాలు తెలుగు లేదా ఇతర భాషల్లో కూడా చాలా సెటిల్డ్ గా కనిపించింది కానీ ఈ సినిమాలో తన గ్లామ్ షో అయితే మాస్ ఆడియెన్స్ కి ట్రీట్ ఇస్తుంది అని చెప్పాలి. అలాగే నటన పరంగా కూడా మంచి పెర్ఫామెన్స్ ని విశ్వక్ తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీని “పాగల్” తర్వాత చూపించింది.

ఇక సినిమాలో మరో హైలైట్ అంశం ఏదన్నా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికీ మంచి ట్రీట్ ఇస్తుంది. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్ లతో విశ్వక్ ల పలు కామెడీ సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ఆకట్టుకునే ఎంటర్టైనింగ్ నరేషన్ అక్కడక్కడా ఉన్నప్పటికీ కథ పరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. ఆల్రెడీ మనం గత కొన్నేళ్ల కాలంలో చూసిన డ్యూయల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్ లో సినిమా కనిపిస్తుంది. దీనితో అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఈ సినిమా కథ పరంగా మెప్పించకపోవచ్చు. ఇక సినిమా సెకండాఫ్ కోసం బాగా హైలైట్ చేస్తూ ఓ టాక్ నడిచింది.

కానీ సినిమాలో అంత హైప్ ఇచ్చిన రేంజ్ లో సెకండాఫ్ అనిపించదు. ట్విస్ట్ లు ఉన్నాయి కానీ అవి అమితంగా ఉన్నాయి పైగా ఇన్ని ట్విస్టులు ఆడియెన్స్ కి విసుగు కూడా తెప్పించవచ్చు. అలాగే సెకండాఫ్ లో చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది. అంతే కాకుండా రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేదు.

ఇంకా పలు బోరింగ్ సన్నివేశాలు తీసేయాల్సింది. ఎంతో కీలకమైన సెకండాఫ్ ఇంకా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వీటితో పాటుగా సినిమాలో మెయిన్ పాయింట్ అయ్యిన సోషల్ ఎలిమెంట్ ని ఇంకా బాగా హ్యాండిల్ చేయాల్సింది. దాని రిలేటెడ్ సన్నివేశాలు అంత వర్కౌట్ అయ్యినట్టుగా అనిపించవు.

 

సాంకేతిక వర్గం :

ఈ సినిమాలో నిర్మాణ విలువలు అయితే రిచ్ గా ఉన్నాయి. సినిమాలో పాత్రలు డిమాండ్ మేరకు కావాల్సిన అన్ని హంగుల్లో మంచి నిర్మాణ విలువలు కనిపిస్తాయి. అలాగే లియోన్ జేమ్స్ సంగీతం సినిమాలో ట్రీట్ ఇస్తుంది. అలాగే దినేష్ కే బాబు సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ ఎడిటింగ్ మాత్రం ఇంకా బెటర్ గా చేయాల్సింది. కాస్ట్యూమ్స్, డైలాగ్స్ టీం వర్క్స్ బాగున్నాయి.

ఇక సినిమాలో చాలా వరకు విశ్వక్ సేన్ నే డైరెక్షన్ చేసిన సంగతి తెలిసిందే. ఇది వరకు కూడా తాను డైరెక్టర్ గా చేసాడు కానీ ఈ సినిమాకి మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకునే రేంజ్ లో తన పనితనం లేదనే చెప్పాలి. సెకండాఫ్ లో ఇంకా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండు. ట్విస్ట్ లు చాలా వరకు ముందే తెలిసిపోయేలా ఉంటాయి పైగా ఇలాంటివి ఎక్కువ ఉండడంతో ఆడియెన్స్ అంతగా థ్రిల్ అవ్వకపోవచ్చు. విశ్వక్ అయితే తన సాధ్యమైనంత వరకు ట్రై చేసాడు కానీ అవి కంప్లీట్ గా ఎంటర్టైన్ చేయవని చెప్పక తప్పదు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూస్తే ఈ “దాస్ కా ధమ్కీ” విశ్వక్ నుంచి గాని నివేతా నుంచి కూడా ఆశించే అన్ని అంశాలు కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు పైగా చాలా ఇంప్రెస్ చెయ్యని ట్విస్ట్ లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఈ పండుగకి లేదా వారాంతానికి ఒక్కసారి చూడొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు