లాక్ డౌన్ రివ్యూ: ఢిల్లీ క్రైమ్ హిందీ వెబ్ సిరీస్(నెట్ ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూ: ఢిల్లీ క్రైమ్ హిందీ వెబ్ సిరీస్(నెట్ ఫ్లిక్స్)

Published on May 20, 2020 5:09 PM IST

నటీనటులు : షెఫాలి షా, రసిక దుగల్, ఆదిల్ హుస్సేన్, రాజేష్ తైలాంగ్

దర్శకత్వం : రిచీ మెహతా

నిర్మాతలు : జెఫ్ సాగన్స్కీ, ఫ్లోరెన్స్ స్లోన్, అపూర్వా బక్షి

సంగీతంby : ఆండ్రూ లాకింగ్టన్

సినిమాటోగ్రఫీ : జోహన్ హ్యూర్లిన్ ఎయిడ్

 

 

లాక్ డౌన్ రివ్యూస్ లో హిందీ వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ ని తీసుకోవడం జరిగింది. రిచీ మెహతా దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలా ఉందో చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఓ అమ్మాయిని అతి క్రూరంగా మానభంగం చేసి, ఆమె చావుకు కారణమైన కొందరు దుర్మార్గులను పట్టుకొనే బాధ్యత పోలీస్ అధికారిణి వర్థిక చతుర్వేది(షెఫాలీ షా) తీసుకుంటారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో నిందితులను ఆమె ఎలా పట్టుకున్నారు అనేది మిగతా కథాంశం…

 

ఏమి బాగుంది?

ఈ కేసు ఛేదనలో సన్నివేశాల చిత్రీకరణ చాలా సహజంగా వాస్తవానికి దగ్గరా ఉంది. ఢిల్లీ వేదికగా జరిగే ఓ హై ప్రొఫైల్ కేసును పోలీసులు ఛేదించిన విధానం చక్కగా చూపించారు. ఇక లేడీ డి సి పి పాత్ర చేసిన ఫెశాలి షా నటన అద్భుతం. ఓ అమ్మాయి ధారుణమైన మరణానికి కారణమైన వారిని వెతికే క్రమంలో ఆమె ఎమోషనల్ యాక్టింగ్ కట్టిపడేస్తుంది. అలాగే ఈ వెబ్ సిరీస్ లో ప్రాముఖ్యం ఉన్న సుధీర్ కుమార్ రోల్ చేసిన గోపాల్ దత్ తివారి నటన ఆకట్టుకుంది.

అతి క్రూరమైన మానభంగం గురించి డాక్టర్ వివరించే సన్నివేశం షాక్ కి గురిచేస్తుంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కేసులలో ప్రజల ఆక్రోశం, మీడియా పాత్ర, రాజకీయ అవకాశవాదం వంటి విషయాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు.

 

ఏమి బాగోలేదు?

పోలీస్ ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో సాగే ఈ వెబ్ సిరీస్ కథనం నెమ్మదిగా సాగుతుంది. ఇక ప్రాధాన్యం ఉన్న కొన్ని పాత్రలకు కూడా సాదాసీదా నటులతో కానిచ్చేశారు. ఇక క్లిష్టతరంగా సాగే స్క్రీన్ ప్లే కొంచెం గందరగోళానికి గురి చేస్తుంది.

 

చివరి మాటగా

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసు గురించి క్షుణ్ణంగా తెలుకోవాలనుకొనే వారికి ఢిల్లీ క్రైమ్ మంచి ఛాయిస్. కట్టిపడేసే ఎమోషన్స్, ఆసక్తిరేపే సంఘటనలతో పాటు, ప్రధాన పాత్ర దారుల నటన మంచి అనుభూతిని పంచుతుంది. స్లో నెరేషన్, క్లిష్టమైన స్క్రీన్ ప్లే మినహా ఇస్తే ఢిల్లీ క్రైమ్ బెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు.

Rating: 3.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు