సమీక్ష : దేశం కోసం పోరాడే దునియా

సమీక్ష : దేశం కోసం పోరాడే దునియా

Published on Dec 16, 2011 5:09 PM IST
విడుదల తేది :16 డిశంబర్ 2011
123 తెలుగు .కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : ఎల్ కే. రావు
నిర్మాత : కే. గీతా శ్రీ
సంగిత డైరెక్టర్ : రమన్ రాథోడ్
తారాగణం : క్రాంతి, నిశాంత్ , డిక్కు, రీనా, ఆలీషా బైగ్ మరియు అనూహ్య రెడ్డి

క్రాంతి. నిశాంత్ మరియు డిక్కు హీరోలుగా రీనా, ఆలీషా బైగ్ మరియు అనూహ్య రెడ్డి హీరోయిన్లుగా ఎల్ కే. రావు దర్శకత్వంలో కే. గీతా శ్రీ నిర్మించిన చిత్రం ‘దునియా’. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

అజార్, వివేక్ మరియు అభి ముగ్గురూ ప్రాణ స్నేహితులు. హైదరాబాదులో ఒకే రూములో ఉంటూ ఉద్యోగం చేస్తూ ఉంటారు. పాకిస్తాన్లో ఉండే మత గురువు నూర్షా ఇండియాలోని హైదరాబాదులో 6 చోట్ల బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నుతాడు. ఈ ప్లాన్ కోసం పాకిస్తాన్ నుండి ఇండియాకి ముగ్గురిని పంపిస్తాడు. అనుకోకుండా ఈ ప్లాన్ లో అజార్ ఇరుక్కుంటాడు. తీవ్రవాదులు అజార్ ను మతం పేరు చెప్పి జిహాద్ కోసం పోరాటం చేయమని ప్రేరేపిస్తారు. అజార్ వినకపోవడంతో అతని స్నేహితులు వివేక్, అభి లను చంపేస్తామని అతనిని బెదిరించి తమ పని చేయించుకోవాలనుకుంటారు. ఇంతకు అజార్ ఆ పని చేసాడా? అతని స్నేహితులు ఏమయ్యారు? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

అజార్ గా నటించిన క్రాంతి బాగా చేసాడు. కొన్ని సన్నివేశాల్లో మాత్రం తేలిపోయాడు. సినిమా ఇతని చుట్టూ తిరుగుతుంది. దునియా చిత్ర కథ బావుంది. అజార్ ప్రియురాలు సునీతగా నటించిన అమ్మాయి బాగానే చేసింది. నూర్షా గా చేసిన అతను మరియు పాకిస్తాన్లో ఉండే ఇండియన్ జర్నలిస్ట్ అశ్రిన్ బాగా నటించారు.సినిమా చివర్లో సూర్య పర్వాలేదనిపించాడు.

మైనస్ పాయింట్స్:

అజార్ స్నేహితులుగా నటించిన నిశాంత్ మరియు డిక్కు నటన బాగాలేదు. అభి ప్రియురాలు సహన గా నటించిన అమ్మాయి కొంతలో కొంత పర్వాలేదనిపించగా నిశాంత్ మరదలు గాయత్రి గా చేసిన అమ్మాయి నటన మాత్రం బాగాలేదు. మిగతా నటీనటులందరూ అంతంత మాత్రంగానే చేసారు.స్క్రీన్ప్లే లో చాలా లోపాలున్నాయి.

సాంకేతిక విభాగం:
గౌతంరాజు గారి ఎడిటింగ్ మాత్రం ఆయన గత చిత్రాలతో పోలిస్తే నాసి రకంగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా అదే స్థాయిలో ఉంది. రమన్ రాథోడ్ అందించిన సంగీతంలో 1 పాట పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. దర్శకుడు రొటీన్ దేశ భక్తి కథను బాగానే రాసుకున్నప్పటికీ అది తెరకెక్కించడంలో కొంతవరకు మాత్రమే సఫలమయ్యాడు. కొన్ని డైలాగులు బావున్నాయి. మాస్ ప్రేక్షకుల నుండి ఈలలు వేసేలా దేశ భక్తి గురించి బాగానే పలికించారు.

తీర్పు: దేశ భక్తి సినిమాలు నచ్చే వాళ్ళకి పర్వాలేదనిపిస్తుంది. రెగ్యులర్ సినిమాలు కాకుండా వెరైటీ సినిమాలు కోరుకునే వారు కూడా ఒక సారి చూడవచ్చు.

Ashok Reddy M

123తెలుగు.కాం రేటింగ్: 2 .5/5

Duniya Review English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు