Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఇగో – ఎమోషన్స్ లేని ప్రేమ కథ

Ego movie review

విడుదల తేదీ : జనవరి 19, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : ఆశిష్ రాజ్, సిమ్రన్

దర్శకత్వం : సుబ్రహ్మణ్యం

నిర్మాత : విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్

సంగీతం : సాయి కార్తిక్

సినిమాటోగ్రఫర్ : జికె.ప్రసాద్

ఎడిటర్ : శివ.వై.ప్రసాద్

స్టోరీ, స్క్రీన్ ప్లే : సుబ్రహ్మణ్యం

‘ఆకతాయి’ చిత్ర తర్వాత హీరో ఆశిష్ రాజ్ చేస్తున్న రెండవ చిత్రం ‘ఇగో’. సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

అమలాపురం అనే ఊళ్ళో ఉండే గోపి ( ఆశిష్ రాజ్) కి అక్కడే ఉండే ఇందు (సిమ్రన్) అంటే అస్సలు పడదు. ఎప్పుడూ ఆమెను ఏడిపిస్తూ ఉంటాడు. ఇందుకు కూడా గోపి అంటే చాలా కోపం ఉంటుంది. గోపి నుండి కొన్ని అవమానాలు ఎదుర్కున్న తర్వాత ఇందుకు ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

దాంతో గోపి కూడా ఇందు కన్నా అందమైన మ్మాయిని ప్రేమించాలని హైదరాబాద్ కు వస్తాడు. కానీ గోపి, ఇందు ఇద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడని ఆ ఇద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఫస్టాఫ్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి చేసిన కామెడీ కొంత పండింది. హీరో, పృథ్వి గ్యాంగ్ నడుమ నడిచే ఫన్నీ సన్నివేశాలు జోక్స్ నవ్వించాయి. పల్లెటూరి అమ్మాయిగా సిమ్రన్ అందంగా కనిపిస్తూనే మంచి పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. దీక్షా సేథ్ కూడా మంచి పాత్రలోనే కనబడింది.

లుక్స్, పెర్ఫార్మెన్స్ పరంగా హీరో ఆశిష్ రాజ్ మొదటి సినిమా కంటే బెటర్ గానే అనిపించాడు. అయితే డైలాగ్స్ చెప్పే విధానాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకుంటే బాగుంటుంది. సినిమా చివరి 15 నిముషాలపాటు రావురమేష్ పాత్ర బాగుంది. అక్కడే సినిమాలో కొంత సస్పెన్స్ కూడా ఏర్పడింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ఖచ్చితంగా ఒక ప్లేట్ అనేది లేకపోవడమే పెద్ద డ్రాబ్యాక్. ఆరంభంలో విలేజ్ డ్రామాగా చూపించి మధ్యలో లవ్ స్టోరీగా మార్చి ఆఖరులో మర్డర్ మిస్టరీ అని చెప్పడం, వాటిని కూడా సాగేదీసి చూపించడంతో కొంత అసహనం రేకెత్తుతుంది.

అంతేగాక సినిమాలి చాలా లాజిక్ లేని సిల్లీ సన్నివేశాలు చాలానే ఉంటాయి. కామెడీ పాత్రలు కూడా తరచూ వస్తూ పోతూ సినిమాను ప్రధాన కథ నుండి ట్రాక్ తప్పేలా చేశాయి. అప్పటివరకు కొట్టుకున్న హీరోహీరోయిన్లు ప్రేమలో పడే సన్నివేశం అస్సలు ఆమోదించలేని విధంగా ఉంది.

అంతేగాక దర్శకుడు హీరో హీరోయిన్ల మధ్యన ఉండే ప్రేమ అనే కోణాన్ని సరిగా ఎలివేట్ చేయలేకపోయారు. దాంతో ఉన్నట్టుండి వారిద్దరూ ప్రేమలో పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

సాంకేతిక విభాగం :

సినిమా నిర్మాణ విలువలు పర్వాలేదనే స్థాయిలో ఉన్నాయి. ఎక్కువ బడ్జెట్ ను సినిమాకు అంతగా అవసరంలేని నటీ నటులపై వెచ్చించారు. సంగీతం బాగానే ఉంది. రెండు పాటలు వినడానికి, స్క్రీన్ పై చూడటానికి బాగున్నాయి. కెమెరా వర్క్ పర్వాలేదు. విలేజ్ విజువల్స్ ని బాగానే చూపించారు.

ఇక దర్సకుడు సుబ్రహ్మణ్యం విషయానికొస్తే ఆయన పనితీరు నిరుత్సాహకరంగా ఉంది. ఆయన ఎంచుకున్న కథాశం బాగానే ఉన్నా దాన్ని సరైన కథనం, సన్నివేశాలు, రొమాన్స్, ఇతర ఎమోషన్స్ లేకుండా చూపడంతో సినిమా ఫలితం తారుమారైంది.

తీర్పు :

మొత్తం మీద ఈ ‘ఇగో’ చిత్రం ఆసక్తికరమైన అంశాలు లేక నిరుత్సాహాపరిచే రొమాంటిక్ డ్రామాగా ఉంది. ఒక పర్టిక్యులర్ కథంటూ లేకుండా అనేక సబ్ ప్లాట్స్ ఉండటంతో సినిమా గాడితప్పింది. చివరి 15 నిముషాల క్లైమాక్స్, అక్కడక్కడా నవ్వించే కామెడీ మినహాయిస్తే ఈ ఎమోషన్స్ లేని ప్రేమ కథలో ఎంజాయ్ చేయడానికి ఏమీ దొరకదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :