సమీక్ష – “జీ – జాంబీ” – ఆకట్టుకోని జాంబీ డ్రామా

Release date : February 05, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.25/5

నటీనటులు : ఆర్యన్ గౌరా, దివ్య పాండే

దర్శకత్వం : ఆర్యన్ మరియు దీపు

నిర్మాత‌లు : సూర్య

సంగీతం : వినోద్ కుమార్ (విన్ను)

సినిమాటోగ్రఫీ : ఎస్ ఆర్ శేఖర్

ఎడిటింగ్ : పవన్ కుమార్

 

ఈ రోజే మన తెలుగులో ఎప్పుడు తెలుగులో టచ్ చెయ్యని జాంబీ జానర్ లో రెండు సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో ఒకటే ఈ జీ జాంబీ చిత్రం. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయతే కొన్ని వ్యాధులను అరికట్టడానికి మెడికల్ స్టూడెంట్ అయినటువంటి సారా(దివ్యా పాండే) తన సహా స్టూడెంట్స్ తో ఒక పవర్ ఫుల్ వాక్సిన్ ను తయారు చెయ్యాలని ప్లాన్ చేస్తారు. మరి దానికి క్లినికల్ ట్రైల్స్ చెయ్యడానికి ఓ డాక్టర్ రుద్ర(ఆర్యన్ గౌర) హెల్ప్ చెయ్యడానికి ముందుకొస్తాడు. మరి ఈ ప్రయోగం ఎలా వికటించి జాంబీల వరకు దారీ తీస్తుంది? ఆ ప్రమాదకర పరిస్థితులను వారు ఎలా అడ్డుకున్నారు? అసలు చివరికి ఈ కథ ఏమయ్యింది అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర మీద చూడాల్సిందే.

 
ప్లస్ పాయింట్స్ :

మన తెలుగు నుంచి జాంబీ కాన్సెప్ట్ అంటే ఆ మాత్రం ఆసక్తి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మంచి థ్రిల్లింగ్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇక అలాగే నటీనటుల విషయానికి వస్తే హీరో ఆర్యన్ లుక్స్ బాగున్నాయి అంతే కాకుండా తన రోల్ వరకు మంచి అవుట్ ఫుట్ నే ఇచ్చాడు.

 

అలాగే హీరోయిన్ దివ్య పాండే కూడా ఈ చిత్రంలో మంచి నటనను కనబరిచింది. కొన్ని కీలక సన్నివేశాల్లో మంచి హావభావాలను చూపించడంతో పాటుగా కొన్ని గ్లామరస్ ఎపిసోడ్స్ లో కూడా బాగా కనిపించి ఆకట్టుకుంది. అలాగే మరికొన్ని సీన్స్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇవన్నీ ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలే.

 

మైనస్ పాయింట్స్ :

మొదటగా ఈ జాంబీ కాన్సెప్ట్ అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపించినా దాన్ని ఎస్టాబ్లిస్ష్ చెయ్యడంలో అవకతవకలు క్లియర్ గా కనిపిస్తాయి. వీలు ఎంచుకున్న లైన్ కి దానిని డెవలప్ చేసే సన్నివేశాలకు అంతగా పొంతన అనిపించదు. అలాగే కొన్ని ఎపిపోడ్స్ లోని లాజిక్స్ అయితే మరీ ఓవర్ గా ఉన్నట్టు అనిపిస్తాయి.

 

మరి ఇంకా అలాగే మెయిన్ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా చూపించడంలో కూడా వైఫల్యం కనిపిస్తుంది. ఇంకా హీరో హీరోయిన్స్ మధ్య సరైన ఎపిసోడ్స్, ఎమోషన్స్ కూడా ఏమీ లేవు ఉన్నా కొన్ని ఫీల్ తెప్పించవు. అలాగే వీరి ట్రాక్స్ ఓ ఫ్లో లో వెళ్తున్న సినిమా నరేషన్ ను కూడా దెబ్బ తీసినట్టు ఉంటుంది.

 

సాంకేతిక విభాగం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కోసం మాట్లాడుకుంటే ఈ కథకు అవసరమైన సెటప్ అంతా నీట్ గా అనిపిస్తుంది. అలాగే జాంబీల మేకప్ వర్క్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే సినిమా నిడివి తక్కువే కాబట్టి ఎడిటింగ్ వర్క్ కూడా డీసెంట్ గా ఉంది. అలాగే సంగీతానికి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి సినిమా అంతటిలో సంగీతం కీ రోల్ పోషించింది.

 

ఇక సినిమా దర్శకత్వం విషయానికి వస్తే హీరో ఆర్యన్ గౌర, దీపు అనే ఆమెతో కలిసి సినిమాను తీశారు. వీరు ఎంచుకున్న లైన్ బాగుంది కానీ దానిని ఆసక్తిగా రాసుకోవడంలో విఫలం అయ్యారని చెప్పాలి. సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ రాసుకోకపోవడం లోపంగా కనిపిస్తాయి.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టు అయితే ఈ జీ- జాంబీ చిత్రంలో లైన్ బాగుంటుంది. కొన్ని ఎపిసోడ్స్ నటీనటుల పెర్ఫామెన్స్ ఓకే అనిపిస్తాయి. కానీ సరైన నరేషన్, ఎమోషన్స్ లేకపోవడం ఇతర కొన్ని అంశాలు నిరాశ పరుస్తాయి. వీటి మూలాన మంచి థాట్ ఓవరాల్ గా బిలో యావరేజ్ ఫ్లిక్ గా నిలుస్తుంది.

 

123telugu.com Rating :  2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :