సమీక్ష: “గమనం” – కొన్ని సన్నివేశాలకు మాత్రమే!

Gamanam Movie Review In Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 10, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: శ్రియ శరణ్, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, సుహస్, బిత్తిరి సత్తి, రవి ప్రకాష్ తదితరులు

దర్శకత్వం : సుజనా రావు

నిర్మాతలు: రమేష్ కరటూరి, వెంకీ పుషడపు, జ్ఞాన శేఖర్ వి.ఎస్

సంగీత దర్శకుడు: ఇళయరాజా

సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వి.ఎస్

ఎడిటింగ్: రామకృష్ణ అర్రం

శ్రియ శరణ్, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, సుహస్, బిత్తిరి సత్తి, రవి ప్రకాష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అంతాలజీ చిత్రం “గమనం”. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరీ ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ:

 

మూడు విభిన్నమైన కథల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటి కథలో శ్రియా శరణ్ తన భర్త దుబాయ్ నుండి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న చెవిటి తల్లిగా నటించింది. రెండవ కథలో అలీగా నటించిన శివ కందుకూరి క్రికెట్ ఫీల్డ్‌లో మంచి స్థాయిలో ఉండాలని కలలు కంటుంటాడు. చివరి కథలో ఇద్దరు నిరాశ్రయులైన పిల్లలు ఉంటారు. వారి లక్ష్యం ఒక కేక్ కొని వారి పుట్టినరోజును జరుపుకోవాలని అనుకుంటారు. హైదరాబాద్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్న సమయం కూడా ఇదే. ఈ వైవిధ్యమైన కథలన్నీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాయి అనేదే గమనం యొక్క కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

గమనం శ్రియకు కమ్ బ్యాక్ సినిమా. ఇందులో ఆమె చెవిటి మరియు నిస్సహాయ తల్లిగా తన పాత్రలో చాలా బాగా చేసింది. శ్రియ పాత్ర ఎదుర్కొనే అంతర్గత గందరగోళాన్ని ఈ స్టార్ హీరోయిన్ బాగా ప్రదర్శించింది. ప్రియాంక జవాల్కర్ జారాగా బాగుంది కానీ స్క్రీన్ ప్రెజెన్స్ పరిమితంగానే అనిపించింది.

యువ నటుడు శివ కందుకూరి ఔత్సాహిక క్రికెటర్‌గా చాలా బాగా నటించాడు. శివ అన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా మంచి నటన కనబరిచాడు. సీనియర్ నటుడు చారు హాసన్ తన ఎమోషనల్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించాడు. నిరాశ్రయులైన పిల్లలను పోషించిన యువ నటులు చాలా బాగా నటించారు.

సెకండాఫ్ వరదలకు సంబంధించిన సన్నివేశాలతో కూడుకుని ఉంటుంది. ఈ సమయంలో ప్రతి పాత్ర పోషించే భావోద్వేగాలను చక్కగా ప్రదర్శించారు. ప్రొడక్షన్ డిజైన్‌, వరదల్లో చిక్కుకున్న శ్రియ ఎపిసోడ్‌ బాగా పండాయి.

 

మైనస్ పాయింట్స్:

 

ప్రోమోలు చూస్తే దర్శకుడు ఈ మూడు కథలను ఎలాగైనా కనెక్ట్ చేస్తాడని చాలా మంది భావించి ఉంటారు. కానీ అలా జరగదు. మొదటి సగం చాలా డల్‌గా ఉంది మరియు కథనం ప్రదర్శించిన తీరు బాగాలేదు.

అలాగే ఈ సినిమా యొక్క అతి పెద్ద లోపం ఏమిటంటే నెమ్మదిగా సాగడం. ప్రధాన సంఘర్షణ పాయింట్‌లోకి ప్రవేశించడానికి సినిమాకి సమయం పడుతుంది. అలాగే కీలక పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు.

క్లైమాక్స్‌లో అనవసరమైన థ్రిల్స్‌తో నిండిపోవడంతో సినిమా కథనం మందకొడిగా ఉంది. అలాగే నిత్యామీనన్ లాంటి ప్రముఖ నటి ఈ సినిమాలో ఎందుకు ఉందో అర్థం కావడం లేదు. కథాంశానికి మంచి స్కోప్ ఉన్నప్పటికీ సినిమా మిమ్మల్ని ఎమోషనల్‌గా కదిలించలేదు.

 

సాంకేతిక విభాగం:

 

సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మరియు మూడు విభిన్న కథలను అద్భుతమైన రీతిలో ప్రదర్శించాయి. పాతబస్తీ విజువల్స్ ఆకట్టుకునేలా ఉండడంతో కెమెరా వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డైలాగ్స్ బాగున్నాయి మరియు దిగ్గజ ఇళయరాజా సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. అయితే ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది.

దర్శకుడు సుజునరావు విషయానికి వస్తే ఆమె కథ ఐడియా, బ్యాక్‌డ్రాప్ మరియు క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి కానీ ఆమె కథనం డల్‌గా ఉంది. అవసరమైన సంఘర్షణ సరిగ్గా స్థాపించబడలేదు. ప్రదర్శించబడిన సమస్యలు ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపవు.

 

తీర్పు:

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే అంతాలజీ చిత్రంగా వచ్చిన ‘గమనం’ మంచి బ్యాక్‌డ్రాప్‌ను కలిగి ఉంది. కానీ నిస్తేజమైన కథనం మరియు స్లో పేస్‌ ప్రధాన డ్రా బ్యాక్స్ అని చెప్పాలి. శ్రియా శరణ్ పాత్ర ఆకట్టుకునేలా ఉండడం కాస్త ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. ఈ వారంతంలో ఈ సినిమా పెద్దగా మెప్పించందనే చెప్పాలి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :