సమీక్ష : జీనియస్ – మంచి కాన్సెప్ట్ కానీ…

సమీక్ష : జీనియస్ – మంచి కాన్సెప్ట్ కానీ…

Published on Dec 28, 2012 5:53 PM IST
Genius Wallpapers (8) విడుదల తేదీ: 27 డిసెంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకుడు : ఓంకార్
నిర్మాత : దాసరి కిరణ్ కుమార్
సంగీతం : జోష్వా శ్రీధర్
నటీనటులు : హవీష్, సనూష, శరత్ కుమార్..


‘నువ్విలా’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన హవీష్ హీరోగా, ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ డైరెక్టర్ గా మారి చేసిన సినిమా ‘జీనియస్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకి ప్రముఖ కథా రచయిత చిన్నికృష్ణ కథని అందించారు. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో సనూష హీరోయిన్. తమిళ స్టార్ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి జోష్వా శ్రీధర్ సంగీతం అందించాడు. చిన్నికృష్ణ కథ, ఓంకార్ డైరెక్షన్, నటీనటుల నటన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

జీనియస్ సినిమా కథ ప్రస్తుతం సొసైటీలో యువత విపరీతంగా ఆకర్షితులవుతున్న పాలిటిక్స్, క్రికెట్, సినిమాల చుట్టూ తిరుగుతుంది. నివాస్(హవీష్) పూజారి అయిన సుమన్ కొడుకు. నివాస్ కి చిన్నప్పటి నుంచి ఎం.ఎల్.ఎ నానాజీని(ప్రదీప్ రావత్) స్ఫూర్తి గా తీసుకొని అతనిలాగే లీడర్ కావాలనుకుంటాడు. నివాస్ ఫ్రెండ్స్ యాసిర్, కోటి. యాసిర్ క్రికెట్ ప్లేయర్ అయిన నిజాముద్దీన్(ఆదర్శ్) కి పెద్ద ఫ్యాన్, అలాగే కోటి తెలుగు స్టార్ పెద్దాపురం పెదబాబు(ఆశిష్ విద్యార్ధి) కి పెద్ద ఫ్యాన్.

వీరు ముగ్గురూ అభిమానించే వారు వారి స్వార్థం కోసం నటిస్తున్నారు తప్ప జనం కోసం కాదు అని తెలుసుకుంటారు. నానాజీ, పెదబాబు ఇద్దరూ తమ స్వార్థం కోసం ఫాన్స్ ని వాడుకుంటూ ఉంటారు , అలాగే నిజాముద్దీన్ తన స్వార్థం కోసం దేశానీకే మోసం చేస్తాడు. నివాస్, యాసిర్, కోటి ఈ అన్యాయాల్ని ఆపాలని నిర్ణయించుకొని, కొంచెం హార్డ్ డెసిషన్ తీసుకుంటారు.

అలా జరుగుతున్న తరుణంలో ఈ వయోలెన్స్ ని ఆపడానికి హోం మంత్రి (జయప్రకాష్ రెడ్డి) స్పెషల్ ఆఫీసర్ శరత్ చంద్ర(శరత్ కుమార్) ని రంగంలోకి దింపుతాడు. నివాస్, యాసిర్, కోటి అనుకున్న పనిని పూర్తి చేసారా లేదా అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

శరత్ కుమార్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మంచి నటనను కనబరిచారు. పండు పాత్రలో అతిధిగా మెరిసిన బ్రహ్మానందం బాగా నవ్వించాడు, అలాగే డాన్సులు కూడా బాగా చేసారు. సీరియస్ ఎపిసోడ్స్ లో హవీష్ నటన చాలా బాగుంది, కానీ అదే హావ భావాల్ని సినిమా అంతా ఉండటం చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. శ్రీ పాత్రలో సనూష లుక్ బాగుంది, శ్రీ – హవీష్ లవ్ ట్రాక్ బాగుంది.

ఆశిష్ విద్యార్ధి, ప్రదీప్ రావత్ లు తమ పరిధి మేర నటించారు. హ్యాపీ డేస్ ఫేం ఆదర్శ్ క్రికెటర్ నిజాముద్దీన్ పాత్రలో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. సినిమాలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ , ఉద్దేశం సూపర్బ్ గా ఉంది అనిత హస్సానందిని, ఒక ఐటెం సాంగ్లో, స్కార్లెట్ విల్సన్ ఒక ఐటెం సాంగ్లో అందాలు ఆరబోశారు.

మైనస్ పాయింట్స్ :

పూర్ డైరెక్షన్, సాగదీసే స్క్రీన్ ప్లే, లాజిక్ లేని చాలా సీక్వెన్స్ లు సినిమాని చెడగొట్టాయి. సినిమాలో చాలా బొక్కలున్నాయి ఉదాహరణకి – సినిమాలో సెలెబ్రటీలను కిడ్నాప్ చేసే విధానం అంత నమ్మశక్యంగా లేదు. చాలా ఈజీగా సెలెబ్రటీలను కిడ్నాప్ చేసేస్తారు. సినిమాలోని పాటల్నీ ఎక్కువ భాగం ఫస్ట్ హాఫ్ లో వచ్చేస్తాయి, అదీకాక అవి సరైన సమయంలో రాక అప్పటి వరకు బాగా పోతున్న సినిమా ఫ్లోని చెడగొడతాయి.

ప్రముఖ నటులైన కె. విశ్వనాథ్, నాగబాబు, అన్నపూర్ణల పాత్రలను సరిగ్గా తీర్చిదిద్దలేదు. సినిమాలో లాజిక్ అస్సలు లేదు ఒకసారి అది ఫీల్ అయ్యారు అంటే డైరెక్టర్ అనుకున్న ప్లాట్ మిస్ అయ్యాడు అని అందరికీ తెలుస్తుంది. శ్రీ – నివాస్ మధ్య రొమాంటిక్ ట్రాక్ మీద కూడా ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. రివెంజ్ తీర్చుకునే సీన్స్ లో ఎమోషనల్ ఫీల్ అస్సలు కనిపించదు. ఓంకార్ చివరికి సినిమా టైటిల్ ‘జీనియస్’ కి న్యాయం చెయ్యాలని కొంత వరకూ ప్రయత్నించాడు కానీ దానిలో కూడా లాజిక్ లేదు.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ ఓకే, ఎడిటింగ్ ఇంకొంచెం బాగుండాల్సింది. జోష్వా శ్రీధర్ అందించిన పాటలు పరవాలేదనిపించాగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్బ్. డైరెక్టర్ గా ఓంకార్ ఫెయిల్ అయ్యాడు, అనుకున్న ప్లాట్ ని సరిగ్గా తీయలేకపోయాడు.

తీర్పు :

సినిమాని సరిగ్గా తీయలేక అనుకున్న ఫలితాన్ని రీచ్ కాని సినిమా జీనియస్. సినిమా కాన్సెప్ట్ మరియు మెసేజ్ ని చాలా బాగా చెప్పొచ్చు, కానీ ఆ విషయాన్ని చూపించడంలో పూర్తిగా విఫలమయ్యారు. శరత్ కుమార్ పెర్ఫార్మన్స్, ఫన్నీగా ఉండే బ్రహ్మానందం అతిధి పాత్ర తప్ప సినిమాలో చూడటానికి ఏమీ లేదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

Translated by Rag’s

CLICK HERE FOR English REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు