సమీక్ష : ‘గుడ్ లక్ సఖి’ – స్లోగా సాగే బోరింగ్ స్పోర్ట్స్ డ్రామా !

సమీక్ష : ‘గుడ్ లక్ సఖి’ – స్లోగా సాగే బోరింగ్ స్పోర్ట్స్ డ్రామా !

Published on Jan 29, 2022 3:01 AM IST
Good Luck Sakhi Review In Telugu

విడుదల తేదీ : జనవరి 28, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ, రఘుబాబు

దర్శకత్వం : నగేష్ కుకునూర్

నిర్మాత: సుధీర్ చంద్ర ప‌దిరి

సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: చిరంతాన్ దాస్

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్


కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన సినిమా ‘గుడ్ లక్ సఖి’. ఈ సినిమాలో జగపతి బాబు, ఆది పినిశెట్టి ఇతర కీలక పాత్రల్లో నటించారు. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మించారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కాగా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం

కథ :

సఖి (కీర్తి సురేష్) ఆర్ధికంగా దిగువస్థాయి కుటుంబానికి చెందిన ఒక సాదారణమైన అమ్మాయి. అయినా చిన్నప్పటి నుండి మంచి గురి చూసి కొట్టగొలదు. సఖి స్నేహితుడు గోళీ రాజు ( ఆది పినిశెట్టి) చిన్నతనం నుంచే సఖి టాలెంట్ ను గుర్తించి ఆమెలో నమకాన్ని పెంచుతాడు. ఈ క్రమంలో దేశం గర్వపడేలా షూటర్స్ ను రెడీ చేయడానికి ఆ ఊరు వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సఖి టాలెంట్ ను గుర్తించి ఆమెకు ట్రైనింగ్ ఇస్తాడు. ఈ క్రమంలో ఆమె తన ప్రత్యర్థులను తట్టుకుని ఎలా నిలబడింది ? చివరకు నిలబడి విజేతగా ఎలా నిలిచింది ? మొత్తంగా అతి సాధారణ అమ్మాయి షూటర్ గా ఎలా ఎదిగింది ? ఈ మధ్యలో ఆమె జర్నీ ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఒక హీరోయిన్ ఇలాంటి లేడీ ఓరియెంటెడ్‌ స్పోర్ట్స్ సినిమాలు చేసేటప్పుడు మరింత పర్‌ఫెక్షన్‌తో నటించాలి. తన పాత్ర పై ఎంతో తపన ఉండాలి. కీర్తి సురేష్ అంతే తపనతో ఈ సినిమా చేసింది. నటిగా ఈ సినిమాకి పూర్తి న్యాయం చేసింది. పైగా సఖి పాత్ర కోసం కీర్తి సురేష్ స్లిమ్‌ అయింది. ఆమె కొన్ని సన్నివేశాల్లో కొత్తగా కనిపిస్తోంది. కల్నల్ లాంటి ప్రత్యేకపాత్రలో కనిపించిన జగపతిబాబు కూడా తన నటనతో ఎప్పటిలాగే మెప్పించారు.

అలాగే మెయిన్ లీడ్ గా నటించిన ఆది పినిశెట్టి కూడా నాటకాలు వేసుకునే రామారావుగా చాలా బాగా నటించాడు. ఆది, జగపతిబాబులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక షూటర్ గా ఎదగాలనుకునే అమ్మాయికి ఎలాంటి సమస్యలు వస్తాయి. అన్నిటినీ ఎదిరించి ఆ సాధారణ అమ్మాయి ఎలా విజయం సాధించింది ? ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రఘుబాబు, రాహుల్ రామకృష్ణ కామెడీ డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్వించాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా మెయిన్ కథాంశం బాగున్నా.. సినిమాలో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చెయ్యకుండా పూర్తి రొటీన్ ప్లే పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. దర్శకుడు నగేష్ కథకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ కథనాన్ని రాసుకోలేదు.

కొన్ని సన్నివేశాలు మరీ బోర్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా సెకెండాఫ్ లో చాలా సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి. నిజానికి సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి చాలా స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, తను అనుకున్న ల్యాగ్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపించాడు. దాంతో కొన్ని సీన్స్ ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా సాగాయి. దీనికి తోడు సినిమాలో ఎక్కడా సరైనా ఇన్ వాల్వ్ చేసే కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం కూడా.. సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమా క్వాలిటీ పరంగా చూసుకుంటే.. సినిమాని విజువల్ గా ఆకట్టుకునేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం పర్వాలేదు. అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆయన స్థాయి అవుట్ ఫుట్ కాదు. ఎడిటర్ ల్యాగ్ సీన్స్ ను ఇంకా ఎడిట్ చేయాల్సింది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

‘గుడ్ లక్ సఖి’ అంటూ మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు జగపతిబాబు, అది పినిశెట్టి కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే కొన్ని ఎలిమెంట్స్ తో పాటు ఫ్యూ ఎమోషనల్ సీన్స్ మరియు కొన్ని కీలక సన్నివేశాలు కూడా పర్వాలేదు. అయితే, ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు బోర్ గా సాగే కథనం, అలాగే మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఆ కారణంగా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.

 

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

 

Click Here English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు