సమీక్ష : హార్ట్ ఎటాక్ – యూత్ కి నచ్చే సినిమా..

Heart-attack విడుదల తేదీ : 31 జనవరి 2014
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : పూరి జగన్నాధ్
నిర్మాత : పూరి జగన్నాధ్
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : నితిన్, ఆద శర్మ…

‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకొని పూర్తి జోరు మీద ఉన్న యంగ్ హీరో నితిన్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హార్ట్ ఎటాక్’. బాలీవుడ్ భామ ఆద శర్మ హీరోయిన్ గా పరిచయమైన ఈ సినిమాలో బ్రహ్మానందం, అలీ కీలక పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. చాలా రోజుల తర్వాత పూరి జగన్నాధ్ తీసిన పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలా ఉందో? నితిన్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడో? లేదో? ఇప్పుడు చూద్దాం..

కథ :

వరుణ్(నితిన్) ఒక ట్రావెలర్. దేశ దేశాలు ఒంటరిగా తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. అలా వరుణ్ స్పెయిన్ కి వస్తాడు. తన ఫ్రెండ్ ప్రియ ప్రేమని తన తండ్రి ఇస్కాన్ రమణ(బ్రహ్మానందం)ని ఒప్పించడానికి వచ్చిన హయతి(ఆద శర్మ) స్పెయిన్ వస్తుంది. వరుణ్ కి హయతి చాలా బాగా నచ్చడంతో తనని ఒక డీప్ లిప్ లాక్ ఇమ్మని వెంటపడుతుంటాడు. కానీ హయతి వరుణ్ ని ఇష్టపడక పోయినా వరుణ్ రోజూ వెంటపడుతూ ఉంటాడు.

ఈ జర్నీలో హయతి వరుణ్ ప్రేమలో పడుతుంది. కానీ వరుణ్ కి ప్రేమ పెళ్లి అంటే ఇష్టం ఉండదు. హయతి చివరిగా వరుణ్ కి ఐ లవ్ యు చెప్పి గోవా వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకి హయతిని లవ్ చేస్తున్నానని తెలుసుకున్న వరుణ్ గోవా వెళ్తాడు? అప్పటికే హయతి ఒక సమస్యలో ఇరుక్కొని ఉంటుంది? ఆ సమస్య ఏమిటి? దాన్ని వరుణ్ సాల్వ్ చేసాడా? లేదా? చివరికి వరుణ్ – హయతి ఒకటయ్యారా? లేదా అనేది మీరు తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే హీరో నితిన్ మరియు హీరోయిన్ ఆద శర్మ. నితిన్ ఫస్ట్ హాఫ్ లో స్టైలిష్ లుక్ లో కనిపించడం, తను ఇప్పటి వరకూ పెద్దగా టచ్ లేని స్లాంగ్ లో మాస్ డైలాగ్స్ చెప్పండం యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ బాగా చేసాడు. ఇలా ఎమోషన్స్ ఉన్న పాత్ర నితిన్ ఈ మధ్య కాలంలో చేయలేదు. కానీ ఆ సీన్స్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఆద శర్మ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. తన లుక్స్ తో యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగా చేసింది. ఎమోషనల్ సీన్స్ లో నితిన్ తో పోటీపడి చేసింది. ఈ మూవీతో ఆద శర్మకి మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.

ఫస్ట్ హాఫ్ లో ఇస్కాన్ రమణగా బ్రహ్మానందం కామెడీ బాగుంది. ముఖ్యంగా ‘టైటానిక్’ మూవీ సీన్ లో బాగా నవ్వించాడు. చివర్లో ప్రకాష్ రాజ్ రెండు నిమిషాలే కనిపించినా అతని పాత్ర, అతని పాత్రకి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. సినిమాలో సాంగ్స్ ని చాలా స్టైలిష్ గా షూట్ చేసారు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగా డిజైన్ చేసుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ బాగా ఉంది అన్న ఫీలింగ్ తో సెకండాఫ్ ని మొదలు పెడతాం. కానీ సెకండాఫ్ లో వేగం మొత్తం పడిపోతుంది. బాగా స్లోగా అనిపిస్తుంది. ఎమోషన్స్ సీన్స్ అన్నీ బాగుంటాయి కానీ ఇంకా ఏదో ఉండాలి అది మిస్సవుతోంది అన్న ఫీలింగ్ ఆడియన్స్ కి వస్తుంది. మామూలుగా పూరి సినిమాలు ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంటుందనే పేరుంది. కానీ మూవీ సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే స్లోగా అనిపిస్తుంది. సెకండాఫ్ చాలా స్లోగా ఉంది అనుకుంటున్న టైంలో పాటలు ఇంకాస్త స్లో చేసినట్టు అనిపిస్తుంది.

అలాగే సెకండాఫ్ లో కామెడీ అనేది లేకపోవడం సినిమాకి మరో పెద్ద మైనస్. అలీ తమిళియన్ గా ప్రేక్షకులను పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోయాడు. సినిమాలో ఎలాంటి ట్విస్ట్ లు లేకపోవడం, చాలా రొటీన్ గా సాగడంతో ఆడియన్ థ్రిల్ ఫీలయ్యే సీన్స్ ఒక్కటి కూడా ఉండకపోవడం, విలన్ పాత్ర కూడా స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల కొన్ని చోట్ల హీరోయిజం పెద్దగా ఎలివేట్ అవ్వక పోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్.

సాంకేతిక విభాగం :

అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరో, హీరోయిన్ మరియు కొన్ని లోకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. స్కీన్ పైన విజువల్స్ అన్నీ చాలా గ్రాండ్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎస్ఆర్ శేఖర్ ఎడింగ్ ఫస్ట్ హాఫ్ లో బాగుంది, కానీ సెకండాఫ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.

ఇక కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – నిర్మాత – డైరెక్షన్ ఈ డిపార్ట్ మెంట్స్ అన్నిటినీ సింగల్ హ్యాండ్ తో డీల్ చేసింది మాత్రం పూరి జగన్నాధ్. చాలా సింపుల్ కాన్సెప్ట్ ని కథగా ఎంచుకొని స్క్రీన్ ప్లే తో లాగేద్దాం అనుకున్న పూరి ఫస్ట్ హాఫ్ లో సక్సెస్ అయినా సెకండాఫ్ లో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. డైరెక్టర్ గా మాత్రం మంచి మార్కులే కొట్టేసాడు. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

రెండు వరుస హిట్స్ అందుకున్న నితిన్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమా ప్రేక్షకుల హార్ట్ ని కొల్లగొట్టేలా లేకపోయినా ప్రేక్షకులు ఓకే అనేలా మాత్రం ఉంది. అలాగే నితిన్ హ్యాట్రిక్ హిట్ అందుకునే కంటెంట్ ఈ మూవీలో లేకపోయినా నటుడిగా మాత్రం తనని మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుంది. ఫస్ట్ హాఫ్, నితిన్, ఆద శర్మల పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి ప్లస్ అయితే స్లో మరియు ఏదో మిస్సింగ్ అన్నట్టు అనిపించే సెకండాఫ్ ఈ సినిమాకి మైనస్. ఓవరాల్ గా నితిన్ – పూరి కలిసి చేసిన ‘హార్ట్ ఎటాక్’ సినిమా యూత్ హార్ట్స్ ని ఆకట్టుకునే సినిమా అయ్యే అవకాశం ఉంది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :

More