సమీక్ష : హిట్ – మలుపులు లేకున్నా మనసుకు నచ్చే క్రైమ్ థ్రిల్లర్

HIT movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు :  విశ్వక్ సేన్, రుహని శర్మ, మురళి శర్మ, బ్రహ్మాజీ, తదితరులు…

దర్శకత్వం : డాక్టర్ శైలేష్ కొలను

నిర్మాత‌లు : ప్రశాంతి. టి

సంగీతం :  వివేక్ సాగర్

సినిమాటోగ్రఫర్ : ఎస్ మణి కందన్

ఎడిటర్ : గ్యారీ బి హెచ్

విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్. నాని నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా రుహాని శర్మ నటిస్తుండగా మంచి అంచనాలున్నాయి. హిట్ మూవీ నేడు విడుదలైన నేపథ్యంలో ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

కథ:

 

సిన్సియర్ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ విక్రమ్ (విశ్వక్)తన లవర్ నేహా (రుహాని శర్మ ) మిస్సింగ్ కేసుతో లింక్ ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అప్పాయింట్ అవుతాడు. ఈ మిస్సింగ్ కేసులో డీప్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన విక్రమ్ కి కొన్ని దిగ్బ్రాంతికర విషయాలు కనుగొంటారు. అసలు ప్రీతి, నేహా ఏమైయ్యారు? వారిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ క్రైమ్ వెనుక ఉన్న నిందితులను విక్రమ్ పట్టుకున్నాడా? అనేది తెరపైన చూడాలి.

 

ప్లస్ పాయింట్స్:

 

మంచి నటుడిగా పేరున్న విశ్వక్ సేన్ సీరియస్ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నారు. అగ్రెస్సివ్ పోలీస్ గా అతని డైలాగ్ డెలివరీ మేనరిజం చాలా సహజంగా అనిపిస్తాయి. ఎమోషనల్ మరియు సీరియస్ సన్నివేశాలలో ఆయన నటన బాగుంది.

కథ రీత్యా హీరోయిన్ రుహాని శర్మ పాత్రకు అంత పెద్దగా నిడివి లేకున్నప్పటికీ విశ్వక్ తో వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ లో మెప్పించింది.

హీరోకి ఇన్వెస్టిగేషన్ లో సహాయకుడు రోహిత్ రోల్ చేసిన నటుడు చైతన్య మరియు కానిస్టేబుల్ పాత్ర చేసిన మురళి శర్మ అలాగే బ్రహ్మజీ పాత్రల పరిధిలో చక్కగా నటించారు.

సినిమా నిర్మాణ విలువలు, బీజీఎమ్ చాలా బాగున్నాయి. సినిమాలో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా అనిపిస్తుంది.

ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలలో కొన్ని మంచి థ్రిల్ పంచాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందలేదు.

 

మైనస్ పాయింట్స్:

 

సినిమా నిడివి ఈ చిత్రానికి ప్రధానమైన మైనస్. క్రైం థ్రిల్లర్స్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తక్కువ నిడివి ఉన్నప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు అసలు కారకులు తెలియకుండా సాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం విసిగిస్తాయి.

హీరో తన లవర్ కేసు చేధించడానికి ప్రీతీ అనే అమ్మాయి కేసు తీసుకుంటాడు. ఐతే హీరో తన లవర్ కోసం తాపత్రయం పడుతున్నాడు అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగించ లేకపోయారు. సైకలాజికల్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న హీరో వెనుక ఉన్న అసలు గతం అస్పష్టంగా ముగించారు.

ఇక క్లైమాక్స్ లో సెంటిమెంట్ యాంగిల్ తీసుకొచ్చి సినిమాకు ప్రాపర్ విలన్ ని లేకుండా చేశారు. అప్పటి వరకు ఆ విలన్ ఎవరా అని కసిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు క్లైమాక్స్ ట్విస్ట్ థ్రిల్ ఇవ్వలేకపోయాయి.
 

సాంకేతిక విభాగం:

 

వివేక్ సాగర్ అందించిన పాటలు పర్వాలేదు.బీజీఎమ్ విషయం లో మాత్రం అతనికి మంచి మార్కులు పడ్డాయి. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పై ఇంకా కొంచెం శ్రద్ద పెట్టాల్సింది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు చాలా రిపీట్ అవుతునట్లుగా అనిపించాయి. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఇక దర్శకుడు శైలేష్ కొలను చాలా క్రైమ్ థ్రిల్లర్స్ కి ముడిసరుకైన కిడ్నాప్, మర్డర్ నేపధ్యాన్ని తీసుకున్నారు. ఐతే ఆయనదానికి బలమైన స్క్రీన్ ప్లే రాసుకొని ఉండాల్సింది.ఐతే కథలో ట్విస్ట్స్ లేకున్నా అలరించే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో నడిపించారు. ఐతే క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది అనిపించింది.
 

తీర్పు :

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ మూవీ చాలా వరకు ఆకట్టుకుంటుంది. . విశ్వక్ సేన్ నటన, రఫ్ ఆటిట్యూడ్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, విశ్వక్ పంచ్ డైలాగ్స్ అలరించే అంశాలు. ఐతే కథలో కొన్ని మలుపులు గట్టి స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకొంచెం మంచిగా రాసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. క్రైమ్ థ్రిల్లర్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మరియు మల్టీ ఫ్లెక్స్ ఆడియన్స్ కి ఈ చిత్రం నచ్చుతుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :