సమీక్ష : ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ – స్లోగా సాగుతూ చివర్లో ఆకట్టుకుంది !

సమీక్ష : ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ – స్లోగా సాగుతూ చివర్లో ఆకట్టుకుంది !

Published on Aug 28, 2021 3:03 AM IST
Ichata Vahanamulu Nilupa Radu movie review

విడుదల తేదీ : ఆగస్టు 27, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సుశాంత్, మీనాక్షి చౌదరి, వెన్నెల కిషోర్, ప్రియదర్శి & ఇతరులు
దర్శకుడు: ఎస్ దర్శన్
నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, ఏక శాస్త్రి , హరీష్ కోయల గుండ్ల
సంగీత దర్శకుడు: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: బృందా, రాజ్ కృష్ణ
ఎడిటర్: గ్యారీ బి హెచ్


యువ కథానాయకుడు సుశాంత్ హీరోగా ఎస్.దర్శన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ చిత్రం ద్వారా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయం అయింది. వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం కీలక పాత్రలలో నటించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :

అరుణ్ (సుశాంత్) ఒక ఆర్కిటెక్ట్. అతను పని చేసే అఫీస్ లోనే మీనాక్షి (మీనాక్షి చౌదరి) కూడా ఎంప్లాయ్ గా జాయిన్ అవుతుంది. అరుణ్ మీనాక్షితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మీనాక్షి ఇంటిలో ఆమె ఒక్కత్తే ఉంది అని అరుణ్ ఆమె ఇంటికి వెళ్తాడు. ఆ ఏరియాలో జరుగుతున్న పొలిటికల్ వార్ లో అనుకోకుండా ఓ చిన్న మిస్టేక్ కారణంగా అరుణ్ ఓ మర్డర్ అటెంప్ట్ లో ఇరుక్కుంటాడు. దాంతో ఆ ఏరియా జనం అరుణ్ వెంట పడతారు ? అరుణ్ వారి నుండి ఎలా తప్పించుకున్నాడు ? ఈ మధ్యలో సుక్కు (వెన్నెల కిశోర్) అతనికి ఎలా ఉపయోగపడ్డాడు ? మీనాక్షి, అరుణ్ కోసం ఏమి చేసింది ? ఇంతకీ పులి (ప్రియదర్శి)కి అరుణ్ కి మధ్య ఉన్న బంధం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సుశాంత్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక కథానాయకిగా నటించిన మీనాక్షి చౌదరి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. ఒక ఏరియాకి లీడర్ గా నటించిన వెంకట్  తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు.

అలాగే వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం కూడా తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో ఉన్నంతలో బాగానే నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేసారు. దర్శకుడు ఎస్.దర్శన్ మంచి ప్రయత్నమే చేసారు. మెయిన్ గా సెకండాఫ్ ను ఎస్.దర్శన్ కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

అసలు సినిమాలో మెయిన్ పాయింట్‌ ఏంటనేది ఇంటర్వెల్‌ సీన్‌ దగ్గర కానీ రివీల్‌ అవ్వదు. పైగా కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించినట్లు అనిపిస్తుంది.

వెన్నెల కిశోర్, ప్రియదర్శి లాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ లు ఉన్నా వారి టాలెంట్‌ని వాడుకునేంతగా సన్నివేశాలు లేకపోవడంతో వాళ్ళు కూడా చాలా సేపు చేష్టలుడిగి చూస్తుండిపోయారు.

మంచి స్టోరీ లైన్ ఉన్నా, సినిమాలో విలువైన భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలకి స్కోప్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లో ప్రతి సన్నివేశం సినిమాటిక్ గానే బోర్ గానే సాగుతుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రెడిక్టుబుల్ గా (ముఖ్యంగా ఫస్ట్ హాఫ్) నడుస్తుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఎస్.దర్శన్ రాసుకున్న కథను స్క్రీన్ మీద బాగానే ఎగ్జిక్యూట్ చేశారు. అయితే, మొదటి భాగం పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ఈ చిత్రంలోని పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ బాగున్నా, ఫస్ట్ హాఫ్ లోని సాగతీత సన్నివేశాలను ఇంకా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

దర్శకుడు ఎస్.దర్శన్ స్క్రిప్ట్ పగడ్బందీగా రాసుకొని ఉండి ఉంటే… ఈ చిత్రం ఓ ఫీల్ గుడ్ లవ్ థ్రిల్లర్ అయి ఉండేది. కానీ స్క్రిప్ట్ లో లోపాలు వల్ల అలా జరగలేదు. సుశాంత్ – మీనాక్షి మ‌ధ్య ప్రేమ కథ, సెకెండ్ హాఫ్ డ్రామా సన్నివేశాలు బాగున్నప్పటికీ, కొన్ని సన్నివేశాలను సాగదీశారు. వాటికి తోడు చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా సాగుతాయి. అయితే, లవ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. కానీ, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రం సంతృప్తికరంగా అనిపించదు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు