ఆడియో సమీక్ష : ఇద్దరమ్మాయిలతో- మరోసారి మ్యూజిక్ తో మాజిక్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్

ఆడియో సమీక్ష : ఇద్దరమ్మాయిలతో- మరోసారి మ్యూజిక్ తో మాజిక్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్

Published on May 27, 2013 6:50 PM IST

Iddarammayilatho-Audio-Post
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. భారీగా తరలి వచ్చిన తారల నడుమ ఈ సినిమా ఆడియో నిన్న విడుదలయింది. దేవి శ్రీ ప్రసాద్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మ్యూజిక్ పై భారీ అంచనాలు అంచనాలు నెలకొన్నాయి. మరి ఇప్పుడు ఆ ఆల్బమ్ ఎలా వుందో చూద్దాం..

1. పాట: రన్ రన్
గాయనీ గాయకులు : అపాచే ఇండియన్, షర్మిల
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

Audio-Poster4

అపాచే ఇండియన్ చాలా కాలం తరువాత తెలుగు సంగీత ప్రపంచంలోకి తిరిగివచ్చాడు. మీకు అపాచే ఇండియన్ ఎవరో తెలియకపోతే ప్రభుదేవా ‘నో ప్రాబ్లెమ్’ ను చూడండి. విన్న వెంటనే ఎక్కే రీతిలో ఈ ‘రన్ రన్’ పాటను ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాకుగానూ దేవీ అందించాడు. అపాచే ఇండియన్ తన గళంతో అందరినీ విస్మయపరిచాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి అందరికీ విన్న ఒక్కసారికే నచ్చేసే పాట. ఈ పాటలో అల్లు అర్జున్ నుండి అద్బుతమైన స్టెప్పులు ఆశించవచ్చు.

 

2. పాట: శంకరాభరణంతో
గాయనీ గాయకులు : మనో, సుచిత్ర సురేశన్, రనినా రెడ్డి
సాహిత్యం : దేవి శ్రీ ప్రసాద్

Audio-Poster5‘శంకరాభరణంతో’ పాటను బ్రహ్మానందంతో చిత్రీకరించిన ఒక ఫన్నీ సాంగ్. దేవీ హాస్యభరితమైన సాహిత్యాన్ని అందించగా మనో దాన్ని అద్బుతంగా ఆలపించారు. ఇండియన్, వెస్ట్రన్ వాయిద్యాల నడుమ సంగీతం ఊగిసలాడుతుంది. ఈ పాటను కేవలం నవ్వించడానికే పెట్టారు కనుక చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 

3. పాట : వయోలిన్ సాంగ్
గాయనీ గాయకులు : డేవిడ్ సిమోన్, అనిత
సాహిత్యం : విశ్వ, డేవిడ్ సిమొన్

Audio-Poster3

ఈ సినిమా ఆడియో విడుదలకు ముందే ఈ వయోలిన్ ట్యూన్ చాలా పాపులర్ అయ్యింది. ఈ పాట వింటుంటే వినసొంపుగా సాగిపోయే రొమాంటిక్ డ్యూయెట్ అని తెలిసిపోతోంది. దీన్ని మెచ్చుకోకుండా ఉండలేము. అనిత, డేవిడ్ సిమోన్ సాహిత్యానికి తగ్గట్టుగా తమ గాత్రాన్ని అందించారు. ఈ పాట లోని ఫీల్ ని తెలియజేయడానికి అనిత గాత్రం ఎంతగానో తోడ్పడింది. దేవీ సంగీతం మెలోడియస్ గా సాగిపోతుంది. మొత్తానికి ఇదొక అందమైన పాట.

 

4. పాట : గణపతి బప్పా
గాయకుడు : సూరజ్ జగన్
సాహిత్యం : భాస్కర భట్ల

Audio-Poster1ఈ ‘ గణపతి బప్పా’ పాట చాలావరకూ హీరో ఇంట్రడక్షన్ పాట కావచ్చు. తన గళాన్ని సరైన రీతిలో వినియోగించుకున్నసూరజ్ జగన్ పాటను బాగా ఆలపించాడు. భాస్కర భట్ల సాహిత్యం విరామం లేకుండా సాఫీగా సాగిపోతుంది. దేవి ఈ పాటలో మాత్రం కొత్తగా ఏమి చెయ్యలేదనే చెప్పాలి. మొత్తానికి ‘ గణపతి బప్పా ‘ పాట యావరేజ్ గా సాగే ‘హీరో ఇంట్రడక్షన్’ సాంగ్.

 

5. పాట:టాప్ లేచిపోద్ది
గాయనీ గాయకులు : సాగర్, గీతా మాధురి
సాహిత్యం : భాస్కర భట్ల

Audio-Poster2‘టాప్ లేచిపోద్ది’ పాట కేవలం ముందు వరుస ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన పాట. అవుట్ అండ్ అవుట్ మాస్ లిరిక్స్, మాస్ ట్యూన్ తో సాగే ఈ పాట చాలా మందిని త్వర త్వరగా ఆకర్షిస్తుంది. సాగర్, గీతా మాధురిల ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గకుండా పాడారు. భాస్కర భట్ల సాహిత్యం పరవాలేదు అనిపిస్తుంది. బన్ని నుండి అదిరిపోయే స్టెప్పులు ఈ పాటనుండి ఆశించవచ్చు. మీకు మాస్ పాటలు నచ్చితే ఈ పాట చాలా నచ్చుతుంది, లేకపోతే సో సో గా అనిపిస్తుంది.

 

తీర్పు :

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాకుగాను దేవి శ్రీ ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన ట్యూన్స్ తో మన ముందుకు వచ్చాడు. ఈ ఆల్బంలో ‘రన్ రన్’ పాటకు మొదటి స్థానం ఇవ్వచ్చు. ఈ పాటను అపాచే ఇండియన్ పాడిన విధానం, శాస్త్రి గారి లిరిక్స్ మనల్ని కట్టిపడేస్తాయి. ఈ పాటేకాక ‘వయోలిన్ పాట’ , ‘శంకరాభరణంతో’ పాట ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. సి క్లాసు ప్రేక్షకులకు మాత్రం ‘టాప్ లేచిపోద్ది’ పాట బాగా నచ్చుతుంది. అల్లు అర్జున్ అద్బుతమైన డాన్సర్ కాబట్టి అతను ‘రన్ రన్’ పాటలో తన ప్రతిభనంతా చూపించి వుంటాడని ఆశతో ఎదురుచూస్తున్నా.

ఆడియో రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు

అనువాదం : వంశీ కృష్ణ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు