సమీక్ష: “జాన్ విక్ 4” – ఆకట్టుకొనే గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్

సమీక్ష: “జాన్ విక్ 4” – ఆకట్టుకొనే గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్

Published on Mar 25, 2023 3:02 AM IST
John Wick 4 English Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 23, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు: కీను రీవ్స్, డోనీ యెన్, బిల్ స్కార్స్‌గార్డ్, లారెన్స్ ఫిష్‌బర్న్, హిరోయుకి సనాడ, షామియర్ ఆండర్సన్, లాన్స్ రెడ్డిక్, రినా సవయామా, స్కాట్ అడ్కిన్స్ మరియు ఇయాన్ మెక్‌షేన్

దర్శకుడు : చాడ్ స్టాహెల్స్కీ

నిర్మాతలు: బాసిల్ ఇవానిక్, ఎరికా లీ మరియు చాడ్ స్టాహెల్స్కీ

సంగీత దర్శకులు: టైలర్ బేట్స్ మరియు జోయెల్ J. రిచర్డ్

సినిమాటోగ్రఫీ: డాన్ లాస్ట్‌సెన్

ఎడిటర్: నాథన్ ఓర్లోఫ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

దాదాపు నాలుగేళ్ల తర్వాత, చాడ్ స్టాహెల్స్కీ దర్శకత్వం వహించిన జాన్ విక్ నాల్గవ భాగం ఈ రోజు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల అయ్యింది. విడుదలకు ముందే మంచి బజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం అందుకు అనుగుణంగా ఉందా లేదా అనేది సమీక్ష లోకి వెళ్లి చేద్దాం.

 

కథ:

రిటైర్డ్ హిట్‌మ్యాన్ జోనాథన్ అయిన జాన్ విక్ (కీను రీవ్స్) సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. హంతకుల ముఠా అయిన హై టేబుల్ నుండి స్వేచ్ఛ ను కోరుకుంటాడు. జాన్ విక్ తీసుకున్న నిర్ణయం కారణం గా హంతకుల ముఠా అయిన హై టేబుల్ అతనిని చంపాలని నిర్ణయం తీసుకుంటుంది. హై టేబుల్‌ లోని సీనియర్ సభ్యులలో ఒకరైన మార్క్విస్ డి గ్రామోంట్ (బిల్ స్కార్స్‌గార్డ్) దీనిని సీరియస్ గా తీసుకుంటాడు. అతను విన్స్టన్ స్కాట్ (ఇయాన్ మెక్‌షేన్)ని న్యూయార్క్ కాంటినెంటల్ మేనేజర్‌గా తొలగిస్తాడు. అతను జాన్ విక్‌ని చంపడానికి రిటైర్డ్ హై టేబుల్ హంతకుడు కైన్ (డోనీ యెన్)ని తీసుకుంటాడు. కెయిన్ ది మాక్విస్‌తో ఎందుకు చేతులు కలిపాడు? జాన్ విక్ ను చంపాలని అనుకొనే హై టేబుల్ సభ్యుడిని జాన్ విక్ చంపాడా? అతను కోరుకున్న స్వేచ్ఛ అతనికి లభించిందా? ఆ తరువాత ఏం జరిగింది? సినిమాలో అన్నింటికి సమాధానాలు ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్:

జాన్ విక్ చెప్పినట్లుగా, అతను హంతకుల ముఠా ను చంపడానికి వివిధ పాతకాలపు మరియు అధునాతనమైన గన్స్ ను ఉపయోగిస్తాడు. జాన్ విక్ 3వ భాగం ముగిసిన చోటునుండే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. జాన్ విక్ సన్నివేశాలు చాలా సూపర్ గా ఉన్నాయి. జాన్ విక్‌గా కీను రీవ్స్ అత్యుత్తమ ప్రదర్శనను అందించాడు. మునుపటి భాగాలలో వలె, పాత్ర తక్కువగా మాట్లాడుతుంది మరియు ఎక్కువగా చంపుతుంది. యాక్షన్ సీక్వెన్స్‌లలో రీవ్స్ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు.

డోనీ యెన్ పోషించిన కెయిన్ పాత్ర చాలా బాగుంది. ఇతని నటన అద్భుతం గా ఉంది. జాన్ విక్ మరియు ఇతరులతో పోరాడటానికి అతను పన్నే వ్యూహాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా జాన్ విక్‌తో అతని డైలాగ్స్, సన్నివేశాలు చాలా బాగున్నాయి.

బిల్ స్కార్స్‌గార్డ్ పోషించిన మార్క్విస్ డి గ్రామోంట్ ఒక స్టైలిష్ మరియు క్రూరమైన విలన్ పాత్ర. హై టేబుల్‌ సీనియర్‌ మెంబర్‌గా, జాన్‌ మరణాన్ని కోరుకొనే వ్యక్తిగా అతని నటన చూడడానికి చాలా బాగుంది. జాన్‌తో ఉన్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మొదటి నుండి చివరి వరకు ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. యాక్షన్ లవర్స్ కి ఇది మంచి ట్రీట్ అని చెప్పాలి. జాన్ విక్ ఫ్రాంచైజీని ఇష్టపడే వారికి, యాక్షన్ లవర్స్ కి చివరి గంట అద్భుతమైన ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది నాన్‌స్టాప్ యాక్షన్ సీక్వెన్స్‌లతో నిండి ఉంది. పారిస్, న్యూయార్క్ మరియు బెర్లిన్‌లలో చిత్రీకరించిన అద్భుతమైన విజువల్స్ చాలా బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్:

ప్రారంభం నుండి చివరి వరకు, జాన్ విక్ 4 తీసిన విధానం బాగుంది, అయితే మేకర్స్ అనేక పాత్రల బ్యాక్ గ్రౌండ్ ను చూపించి ఉంటే బాగుండేది. ఉదాహరణకు, కెయిన్, జాన్ విక్ తో అతని సోదరత్వం పై కొంత చూపించి ఉంటే బాగుండేది.

క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు టెన్షన్ క్రియేట్ చేయడానికి బాగా ప్రదర్శించి ఉంటే బాగుండేది. డైరెక్టర్ మరియు రైటర్స్ జాన్ విక్, కెయిన్ మరియు విన్‌స్టన్ మధ్య కొన్ని భావోద్వేగ సన్నివేశాలను ఇంజెక్ట్ చేసి ఉండవచ్చు. క్లైమాక్స్ జాన్ విక్ ఫ్రాంచైజీ అభిమానులను కాస్త నిరాశపరిచింది అని చెప్పాలి.

జాన్ విక్ 3 లో విలన్ పాత్రను పోషించిన ది అడ్జుడికేటర్ (ఆసియా కేట్ డిల్లాన్) గురించి ఈ చిత్రంలో ఎలాంటి రిఫరెన్స్ లు లేవు. మేకర్స్‌ ఆ పాత్రను మళ్లీ పరిచయం చేయాలనే ఆలోచన ఉంటే దాని గురించి ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంది.

 

సాంకేతిక విభాగం:

జాన్ విక్ 4 డైరెక్షన్, స్క్రీన్‌ప్లే, కెమెరావర్క్, ఎడిటింగ్ మరియు మ్యూజిక్‌ చాలా బాగున్నాయి. యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు చేసిన పోరాట సన్నివేశాలను రూపొందించినందుకు ప్రత్యేక ప్రశంసలు అవసరం. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్‌లను మెరుగ్గా చూపించడం లో చాలా సహాయపడింది. ఎడిటింగ్ చాలా బాగుంది. సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉన్నప్పటికీ, సినిమా మొత్తం మీద ఒక్క డల్ మూమెంట్ కూడా లేదు.

 

తీర్పు:

మొత్తం మీద, జాన్ విక్ 4 యాక్షన్ లవర్స్ కి, ముఖ్యంగా జాన్ విక్ ఫ్యాన్స్ కి గొప్ప ట్రీట్ అవుతుంది. ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్‌లు, అద్భుతమైన విజువల్స్ సినిమాను ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా మార్చాయి. సినిమా రన్ టైమ్ ను మినహాయిస్తే, చాలా బాగా ఆస్వాదించవచ్చు. ఈ వారాంతంలో థియేటర్ల లో ఈ సినిమా చూడవచ్చు.

PS: ఎండ్ టైటిల్స్ వచ్చే వరకు వేచి ఉండండి.

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు