సమీక్ష : “కడువా” – జస్ట్ ఓకే అనిపించే మాస్ డ్రామా

సమీక్ష : “కడువా” – జస్ట్ ఓకే అనిపించే మాస్ డ్రామా

Published on Jul 8, 2022 4:09 PM IST
Kaduva Movie Review

విడుదల తేదీ : జులై 8, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, వివేక్ ఒబెరాయ్, సంయుక్త మీనన్ మరియు ఇతరులు

దర్శకత్వం : షాజీ కైలాస్

నిర్మాతలు: సుప్రియా మీనన్ మరియు లిస్టిన్ స్టీఫెన్

సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం

ఎడిటర్: షమీర్ మహమ్మద్

 

మళయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మన తెలుగులో కూడా మంచి ప్రమోషన్స్ జరుపుకొని రిలీజ్ కి వచ్చిన చిత్రం “కడువా”. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఎంతమేర ప్రేక్షకులని మెప్పిస్తుందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

కథలోకి వచ్చినట్టు అయితే.. కడువాకునేల్ కురియచెన్ చేతన్(పృథ్వీ రాజ్) తాను ఉండే ప్రాంతంలో ఒక గౌరవంగా లైఫ్ ని లీడ్ చేసే పెద్ద వ్యక్తిగా కనిపిస్తాడు. మరి ఇలాంటి కడువా జీవితంలోకి ఒక ఊహించని మలుపుతో ఐజీ థామస్ చండీ(వివేక్ ఒబెరాయ్) ఎంటర్ అవుతాడు. దీనితో అంతా పోలీస్ డిపార్ట్మెంట్ వర్సెస్ కడువా లా మారిపోతుంది. అయితే ఈ ఇద్దరు ఎందుకు ఇంతలా వైరం పెంచుకోవాల్సి వస్తుంది.? మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కడువా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా? ఇంతకీ వీరి మధ్య గొడవ ఏంటి అదెలా సాల్వ్ అయ్యింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

మన దగ్గర కూడా చాలా మందికి పృథ్వీ రాజ్ నటన ఎలా ఉంటుందో బాగా తెలుసు. ఇప్పుడు ఈ సినిమాతో అది మరింత చేరువ అవుతుందని చెప్పాలి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో కూడా పృథ్వీ అదరగొట్టాడు. తన మార్క్ పంచ్ డైలాగ్స్ గాని తన లుక్స్ తో గాని అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటాడు.

అలాగే మరో పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్ అయితే మళ్ళీ విలన్ గా సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. తనలోని ఇంటెన్సిటీ తో మంచి పవర్ ఫుల్ గా సినిమాలో కనిపించి మెప్పించాడు.

ఇంకా సినిమాలో పలు చోట్ల స్క్రీన్ ప్లే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే మెయిన్ లీడ్ మధ్య పెట్టిన కాన్ ఫ్లిక్ట్ కూడా మంచి మెప్పించే రకంగా ఉంటుంది. ఇక భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమలో కాస్త నిరాశ పరిచే అంశం ఏదన్నా ఉంది అంటే అది సినిమా సెకండాఫ్ అని చెప్పాలి. సెకండాఫ్ లో ఈ చిత్రం అంతా చాలా సింపుల్ గా ఫ్లాట్ గా అనిపిస్తుంది. దీనితో సినిమా డల్ గా మారిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే ఈ చిత్రంలో సంయుక్త సహా కొందరు నటులకి అంత స్కోప్ ఇచ్చినట్టు కూడా కనిపించదు. ఉన్నంతవరకు బాగానే నటిస్తారు.

ఇంకా ఈ సినిమాలో నరేషన్ కూడా అంత ఆకట్టుకునేలా కనిపించదు. చాలా వరకు తెలిసినట్టుగా ఉండే నరేషన్ సెకండాఫ్ లో కనిపిస్తుంది. అలాగే సినిమా స్టార్ట్ అయ్యి మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి కూడా కాస్త సమయం ఎక్కువ పడుతుంది. దీనితో చాలా చోట్ల సినిమా బోర్ కలిగిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో డీసెంట్ నిర్మాణ విలువలు కనిపిస్తాయి అలాగే తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇక టెక్నీకల్ టీం లోకి వస్తే అభినందన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అలాగే జేక్స్ బిజోయ్ ఇచ్చిన సంగీతం ముఖ్యంగా కొన్ని మాస్ సీన్స్ లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాలిడ్ గా అనిపిస్తుంది.

ఇంకా ఎడిటింగ్ లో చాలా వరకు ట్రిమ్ చేసి ఉండాల్సింది. ఇక దర్శకుడు షాజీ కైలాష్ విషయానికి వస్తే తన వర్క్ ఓకే అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు సినిమాని బాగానే చూపించాడు కానీ సెకండాఫ్ లో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఇంట్రెస్టింగ్ గా నరేషన్ ని నడిపి ఉంటే బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కడువా” చిత్రం లో హీరో మరియు విలన్ మధ్య కనిపించే మాస్ ట్రీట్మెంట్ బాగుంటుంది, కానీ సెకండాఫ్ లో ఎలాంటి పొంతన లేకపోవడం, అంతగా ఆకట్టుకునే కథనం కనిపించకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఇవి పక్కన పెడితే మాస్ ఆడియెన్స్ వరకు ఈ చిత్రం మెప్పించొచ్చు తప్ప కొత్త స్టోరీ కోరుకునేవారిని అయితే మెప్పించదు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు