సమీక్ష : కెజియఫ్ – ఎక్కువ‌ హైప్.. త‌క్కువ కంటెంట్

సమీక్ష : కెజియఫ్ – ఎక్కువ‌ హైప్.. త‌క్కువ కంటెంట్

Published on Dec 22, 2018 3:51 PM IST
KGF Story movie review

విడుదల తేదీ : డిసెంబర్ 21, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : యష్, శ్రీనిధి శెట్టి, అచ్యుత్ కుమార్, మళవికా అవినాష్

దర్శకత్వం : ప్రశాంత్ నీల్

నిర్మాత : విజయ్ కిరగంధూరు

సంగీతం : రవి బసూర్

సినిమాటోగ్రఫర్ : భువన్ గౌడ

ఎడిటర్ : శ్రీకాంత్ గౌడ

 

విడుదలకు ముందే ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న చిత్రం కెజియఫ్. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

కథ :

కోలార్ బంగారు గనుల్లో పనిచేసిన కార్మికుల జీవితాల ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. ప‌వ‌న్ (య‌ష్‌) త‌న త‌ల్లికి ఇచ్చిన మాట కోసం ఎలాగైనా త‌న‌కంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవ‌డం కోసం ముంబై వ‌చ్చి నేర సామ్రాజ్యంలో రాకీగా త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటాడు. ఈ క్ర‌మంలో కోలార్ గ‌నుల్లో నియంత‌గా అధిప‌త్యం చ‌లాయిస్తున్న గ‌రుడ‌ను చంపితే ముంబై త‌న‌దే అని.. య‌ష్‌కు ఒక పెద్ద ఆఫ‌ర్ వస్తుంది. దీంతో అత‌న్ని చంప‌డానికి బెంగుళూరు వ‌చ్చిన రాకీ, గ‌రుడ‌ను చంపే అవ‌కాశం వ‌చ్చినా చంప‌కుండా, కోలార్ గ‌నుల్లోకి ఎంట‌ర్ అవుతాడు. అస‌లు రాకీ టార్గెట్ ఏంటి ? త‌న త‌ల్లిక ఇచ్చిన మాట ను నెరవేర్చడా ? చివ‌రికి గ‌రుడ‌ ఏమయ్యాడు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

హీరో యష్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. స్టైలిష్ లుక్ తో సినిమా అంత వన్ మ్యాన్ షో చేశాడు. ఇక హీరో ఇంట్రో సీన్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు యాక్షన్ సీక్వెన్స్ లు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన పాత్ర పరిధి మేర నటించింది.

ఇక స్పెషల్ సాంగ్ లో మెరిసిన మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామరస్ గా కనిపించింది. ఇక ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ఈ కథ రాసుకోవడం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :

ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ కోలార్ గోల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో నేప‌ధ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ప‌క్కాగా స్క్రిప్ట్ రాసుకోలేదు. హీరోను ఎలివేట్ చేయ‌డం మీదనే శ్రద్ధ పెట్టు క‌థ‌నం గురించి మర్చిపోయాడు. హీరో ఇమేజ్ కు తగ్గట్లు యాక్ష‌న్ స‌న్నివేశాలతో నింపేసిని ద‌ర్శ‌కుడు, ఎమోషనల్ స‌న్నివేశాలను పట్టించుకోలేదు .

ఇంట‌ర్వెల్‌లో వచ్చిన ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని రేపిన ఆది ఎక్కువ సేపు ఉండేలా చూసుకోలేదు. దాంతో సెకండ్ హాఫ్ కూడా ప్రేక్ష‌కుల‌ను నిరాశకు గురిచేస్తుంది.

సాంకేతిక వర్గం :

దర్శకుడు ప్రశాంతి నీల్, యష్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేక పోయాడు . ఒక స్టార్ హీరో తో సినిమా చేస్తున్నప్పుడు అతనికి వున్నా ఫాలోయింగ్ ను ద్రుష్టి లో పెట్టుకొని అద్భుతాలను చేసి ఉండవలసి ఉంది, కానీ అతను దానిని కొన్ని సీన్లకే పరిమితం చేశాడు. స్క్రిప్ట్ మరియు కథనంలో విషయంలో మరింత గా శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా ఫలితంగా మెరుగైనదిగా ఉండేది.

శ్రీకాంత్ ఎడిటింగ్ ఓకే కానీ అతను సెకండ్ హాఫ్ లో పదిహేను నిమిషాలుట్రిమ్ చేయాల్సింది. భువన్ గౌడ యొక్క సినిమాటోగ్రఫీ బాగుంది . ఇక సంగీతం సోసో గా వుంది . సినిమాలోని ఒక్క పాటకు కూడా సరైన ట్యూన్ ను ఇవ్వలేకపోయాడు సంగీత దర్శకుడు. అయితే నేపధ్యం సంగీతం విషయంలో పర్వాలేదనిపించాడు. ఖర్చు కు వెనుకాడకుండా సినిమా ని ఉన్నతంగా నిర్మించారు నిర్మాతలు.

తీర్పు :

భారీ హైప్ తో వచ్చిన ఈ కె జి యఫ్ అంచనాలను అందుకోలేకపోయింది. యష్ లుక్స్ అలాగే ఆయన నటన సినిమాకు హైలైట్ అవ్వగా వీక్ స్టోరీ , స్లో నరేషన్ సినిమా ఫలితాన్ని దెబ్బతిశాయి. చివరగా ఈ చిత్రం ఏ వర్గాన్ని కూడా మెప్పించలేకపోయింది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు