సమీక్ష : లైవ్ టెలికాస్ట్ – తెలుగు సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం

సమీక్ష : లైవ్ టెలికాస్ట్ – తెలుగు సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం

Published on Feb 16, 2021 5:00 PM IST

నటీనటులు: కాజల్ అగర్వాల్, వైభవ్ రెడ్డి, ఆనంది, డేనియల్ అన్నీ పోప్, సెల్వా

దర్శకత్వం: వెంకట్ ప్రభు

నిర్మాతలు: వి రాజలక్ష్మి

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ “లైవ్ టెలికాస్ట్”.దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టు అయితే జెన్నిఫర్(కాజల్ అగర్వాల్) ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో “డార్క్ టేల్స్” అనే రియాలిటీ హార్రర్ షోను చేస్తుంది. కానీ కొన్ని కారణాల చేత ఆ షోను ఆ ఛానల్ వారు నిలిపేస్తారు. దీనితో జెన్నీ దానిని రీప్లేస్ చేస్తూ మరో ఆసక్తికర షోను ప్లాన్ చేస్తుంది. నిజమైన దయ్యంను చూపిస్తా అని ఒక ఇంటిని అందులో కుటుంబంపై లైవ్ టెలికాస్ట్ లోనే దయ్యాన్ని చూపిస్తానని ప్రోగ్రాం స్టార్ట్ చేస్తుంది. మరి వీరి టీం ఆ ఇంటికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది? నిజంగానే అక్కడ దయ్యం ఉందా? లైవ్ లో ఏం జరుగుతుంది అన్నదే అసలు కథ.

ప్లస్ పాయింట్స్ :

ఇక ఈ సిరీస్ లో ప్లస్ పాయింట్స్ కు వస్తే మెయిన్ లీడ్ లో కనిపించే కాజల్ మంచి పెర్ఫామెన్స్ ను కనబరిచింది. బోల్డ్ మాటలతో పాటుగా మంచి గ్లామరస్ లుక్స్ తో ప్రతీ ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అలాగే ఈ సిరీస్ లో కీలక పాత్ర చేసినటువంటి వైభవ్ కూడా మంచి నటనను ఇచ్చాడు.

మొదటి నుంచి చివరి వరకు కూడా డీసెంట్ వర్క్ అతని నుంచి కనిపిస్తుంది. ఇక అలాగే ఈ సిరీస్ లో కొన్ని ఎపిసోడ్స్ హార్రర్ ఎఫెక్ట్స్ కెమెరా వర్క్ అంతా బాగుంటుంది. వీటితో పాటుగా అక్కడక్కడా వచ్చే కామెడీ నటీనటుల టైమింగ్ భలే అనిపిస్తుంది. వీటన్నటిని దర్శకుడు వెంకట్ ప్రభు బాగా హ్యాండిల్ చేశారు.

మైనస్ పాయింట్స్ :

టాలెంటెడ్ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సిరీస్ ను సినిమాగా తెరకెక్కిస్తారని టాక్ వచ్చింది. ఒకవేళ కనుక దీనినే సినిమాగా తీసి ఉంటే ఖచ్చితంగా అది ఒక విఫల ప్రయోగమే అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ సిరీస్ మొత్తం చూసాక పెద్ద గొప్పగా ఉన్నట్టు అనిపించదు.

చాలా పరమ రొటీన్ లైన్ ను తీసుకోవడం పెద్ద మైనస్ దీనికి పైగా మొదటి ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగానే స్టార్ట్ అయినా తర్వాత రెండు మూడు ఎపిసోడ్స్ ఏమంత ఎఫెక్టీవ్ గా అనిపించవు. పైగా కాస్త బోరింగ్ గా అనిపిస్తాయి. ఎడిటింగ్ వర్క్ ఇంకా బాగుంటే బాగుండేది. అలాగే కొన్ని లాజిక్స్ తెరకెక్కించిన విధానం చాలా పేలవంగా అనిపిస్తాయి.

తీర్పు :

ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టు అయితే విడుదలకు ముందు మంచి హైప్ తో వచ్చిన ఈ “లైవ్ టెలికాస్ట్” వెబ్ సిరీస్ ఓ విఫల యత్నమే అని చెప్పాలి. కాజల్, వైభవ్ అలాగే ఇతర క్యాస్టింగ్ నటన, నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి అలాగే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓకే అనిపిస్తాయి. కానీ అవుట్ డేటెడ్ హర్రర్ కథ దానిని తెరకెక్కించిన విధానం మాత్రం అంతగా ఆకట్టుకోదు. కాస్త కథ పాతదే అయినా పర్వాలేదు అనుకుంటే ఒక్కసారికి మించి ఈ సిరీస్ చూడడం లేదా స్కిప్ చేసేయడం బెటర్.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు