సమీక్ష: లోకల్ బాయ్- కొత్తదనం లేని ఎమోషనల్ యాక్షన్ డ్రామా

సమీక్ష: లోకల్ బాయ్- కొత్తదనం లేని ఎమోషనల్ యాక్షన్ డ్రామా

Published on Feb 28, 2020 7:21 PM IST
Local Boy movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు :  నటీనటులు : ధనుష్, స్నేహ, మెహ్రీన్, నవీన్ చంద్ర తదితరులు

దర్శకత్వం : ఆర్ ఎస్ దురై సెంథిల్ స్వామి

నిర్మాత‌లు : సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్

సంగీతం :  వివేక్-మెర్విన్

సినిమాటోగ్రఫర్ : ఓం ప్రకాష్

ఎడిటర్ : ప్రకాష్ మబ్బు

తమిళంలో ఈ సంక్రాంతికి విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న చిత్రం పటాస్ తెలుగులో లోకల్ బాయ్ గా నేడు విడుదలైంది. ధనుష్ డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రంలో మెహ్రీన్, స్నేహ హీరోయిన్స్ గా నటించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

కథ:

చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటే బ్రతికే శక్తి(ధనుష్) ఎప్పుడూ చెడ్డవాడైన లోకల్ బాక్సింగ్ ఇన్స్టిట్యూట్ యజమాని అయిన నీలకంఠం(నవీన్ చంద్ర)తో గొడవలు పడుతూ ఉంటాడు. అలాగే 16ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి విడుదలైన కన్యాకుమారి(స్నేహ) సైతం నీలకంఠం ని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అసలు ఎవరు ఈ కన్యాకుమారి? శక్తితో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటీ? ఆమె నీలకంఠం ను ఎందుకు చంపాలని అనుకుంటుంది? అనేది మిగతా కథ…

ప్లస్ పాయింట్స్:

రెండు భిన్నమైన పాత్రలను పోషించిన ధనుష్ నటన పరంగా ఆకట్టుకున్నారు. అలాగే శక్తి పాత్రలో ఆయన కామెడీ టైమింగ్ మరియు ఫస్ట్ సాంగ్ లో గ్రేసీ స్టెప్స్ అలరిస్తాయి. ఇక పురాతన యుద్ధ విద్య అయిన ఆది మురై అనే కళను వివరించి చూపించిన విధానం బాగుంది.

విజయ్ భూపతిగా ఊరి పెద్ద పాత్రలో ఆయన చక్కగా నటించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గా వచ్చే ఈ పాత్ర మంచి ఎమోషన్స్ ని తెరపై పంచింది. ఇక ఆ పాత్రకు భార్య రోల్ చేసిన స్నేహ తనదైన నటనతో కట్టిపడేసింది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ సన్నివేశాలలో ఎమోషన్స్ బాగా పలికించింది.

ఈ మధ్య వరుసగా మంచి రోల్స్ దక్కించుకుంటున్న తెలుగు నటుడు నవీన్ చంద్ర లోకల్ బాయ్ చిత్రంలో మంచి విలన్ పాత్ర చేశారు. ఈ పాత్రలో ఆయన నటన సినిమాకు ఆకర్షణగా నిలిచింది. ఇక మెహ్రీన్ పాత్ర పరిధిలో పర్వాలేదు. హీరో మిత్రుడు పాత్ర చేసిన నటుడు మంచి కామెడీ పండించారు.

మైనస్ పాయింట్స్:

ఎటువంటి మలుపులు లేని స్క్రీన్ ప్లే కారణంగా మూవీలో రాబోయే సన్నివేశాలు ప్రేక్షకులకు ముందుగానే అవగాహన అవుతూ ఉంటాయి. ఓల్డ్ ఫార్మాట్ లో తీసిన ఈ చిత్రంలో కొత్తదనం ఎక్కడా కనిపించదు.

పదహారేళ్ళ క్రితం కొడుకుని కోల్పోయిన తల్లి కన్యాకుమారి శక్తిని కనుగొనడం అనే సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగాయి. సినిమా క్లైమాక్స్ సైతం ఎటువంటి ఘర్షణ లేకుండా త్వర త్వరగా ముగిసిన భావన కలుగుతుంది. జాతీయ స్థాయిలో బాక్సింగ్ లో హీరో దూసుకుపోవడం వాస్తవానికి దూరంగా ఉంది.

ఎప్పుడో పాతకాలపు కథకు దర్శకుడు కొంచెం కొత్త హంగులు దిద్ది ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఉంది. హీరోయిన్ మెహ్రీన్ కి ఈ మూవీలో కనీస ప్రాధాన్యత లేదు. ఆమె పాత్ర కేవలం పాటలకు పరిమితం అయ్యింది.

సాంకేతిక విభాగం:

ప్రొడక్షన్ వాల్యూస్ చాల బాగున్నాయి. ఇక వివేక్ మెర్విన్ అందించిన సంగీతం బాగుంది. మొత్తం మూడు పాటల వరకు అలరిస్తాయి. ఇక ఎడిటింగ్ ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది.
పురాతన యుద్ధ విద్యలు ఇప్పటికీ ఎంత ప్రభావం చూపగలవు, వాటి ప్రాధాన్యత ఏమిటీ అనే ఓ మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ ఆయన స్క్రీన్ ప్లే అంతా ఓల్డ్ ఫార్మాట్ లో సాగింది. కొత్తదనం లేని స్క్రీన్ ప్లే వలన ప్రేక్షకులకు మూవీ మంచి అనుభూతిని ఇవ్వలేక పోయింది.

తీర్పు:

తమిళ మూవీ పటాస్ కి తెలుగు రీమేక్ గా వచ్చిన లోకల్ బాయ్ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎటువంటి మలుపులులేని ఓల్డ్ ఫార్మాట్ స్క్రీన్ ప్లే, మరియు సినిమాలో నాటకీయత ఎక్కువైపోవడం, కథలో అంత బలం లేకపోవడం వలన ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచలేకపోయింది. ధనుష్ నటన, సాంగ్స్ మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో కొంచెం ఉపశమనం కలిగించే అంశాలు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు