సమీక్ష: లవ్ డాట్ కామ్ – బ్రైన్ లెస్ బోరింగ్ చిత్రం

సమీక్ష: లవ్ డాట్ కామ్ – బ్రైన్ లెస్ బోరింగ్ చిత్రం

Published on Feb 16, 2014 3:30 AM IST
Love-dot-com విడుదల తేది : 15 ఫిబ్రవరి 2014
123123తెలుగు .కామ్ రేటింగ్ : 1/5
దర్శకత్వం : రాజావన్నంరెడ్డి
నిర్మాతలు : చిన్న శ్రీరామ చంద్ర రెడ్డి
సంగీతం: చక్రి
నటినటులు : నీతి టైలర్, ఆర్య సందీప్

‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి’ సినిమా అనగానే ఆపుకోలేని నవ్వులు, కడుపునొప్పి తెప్పించే కామెడీ గుర్తొస్తుంది. చిన్నాపెద్దా, ఆడమగా తేడా లేకుండా ఆ సినిమాను విజయవంతం చేసారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన రాజా వన్నెం రెడ్డి ఈసారి యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ తో నితి టైలర్(మేం వయసుకు వచ్చాం ఫేం), ఆర్య సందీప్ లను జంటగా పెట్టి ‘లవ్ డాట్ కామ్’ అనే సినిమా తీసాడు. మరి ఆ చిత్రం ఎలా వుందో చూద్దామా.

​కథ​ :

వచ్చిన పెళ్ళి సంబంధాల​న్ని​ చెడిపోతున్నందుకు ఆనందంతో పార్టీలు ఇస్తున్న రాకీ(ఆర్య సందీప్) ఒకానొక సందర్భంలో తన స్నేహితులకు భగ్నమైన తన ప్రేమక​థ​
ఫ్లాష్ బ్యాక్ గా చెప్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఒక పెళ్ళిలో మన హీరో మొదటిచూపులోనే శ్రావణి(నితి టైలర్) ను ప్రేమిస్తాడు. కానీ అది నచ్చని హీరొయిన్ తనకు అప్పటికే నిశ్చితార్ధం అయినట్టు చెప్పి వెళ్ళిపోతుంది. అందుకే ఇంక పెళ్ళే చేసుకోను అని పట్టుబట్టి కూర్చున్న రాకీకి వాళ్ళ నాన్న అర్ధాంతరంగా పెళ్లి కుదిరించి, పీటలమీదే అమ్మాయిని చూడాలి అని చెప్పడంతో అయిష్టంగానే పెళ్ళికి ఒప్పుకున్నా ఆఖరికి పెళ్ళికూతురు గతంలో తను ప్రేమించిన అమ్మాయనే తెలిసి, అప్పుడు తను అబద్దమాడిందని తెలుసుకుని ఆనందపడతాడు.

మొదటి భాగంతోనే ​కథ​ సుఖాంతమయినా, రెండో భాగాన్ని ఇంకో ట్విస్ట్ తో పొడిగించాడు దర్శకుడు . హీరోతో శోభనానికి హీరొయిన్ ఒప్పుకోదు. దానికి కారణమేమిటి? ఆఖరికి క​థ​ ఎలా సుఖాంతంయ్యింది అన్నది మిగిలిన స్టొరీ

ప్లస్ పాయింట్స్:

అంత ​కథ​ చెప్పాం కధా అనుకుని ఈ సినిమాలో చాలా ప్లస్ పాయింట్లు వున్నాయనుకుంటే అది మీ పొరపాటే. సినిమా పరంగా చెప్పుకునే అన్ని ప్లస్ పాయింట్లు మి లేవు. వున్నంతలో చక్రి సంగీతం సినిమాకు కాస్త ఫీల్ ను అందించింది. కమేడియన్ శ్రీనివాస్ రెడ్డి, స్వర్గీయ ధర్మవరపు సుభ్రమణ్యానికి చెప్పే క​థ​లలో హిట్ సినిమా ఫూటేజ్ లను వాడుకోవడం బాగుంది. తాగుబోతు రమేష్ కామెడీ ఒక్కటే కాస్త నవ్వు తెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇంక ఈ సినిమాలో అన్నిటికంటే ముఖ్యమైన ప్లస్ పాయింట్ 2గంటలలో(ఇంటర్వెల్ తో కలుపుకుని) సినిమా అయిపోవడం.

మైనస్ పాయింట్స్:

చెప్పుకుంటే చాంతాడంత లిస్టు వస్తుంది. హీరో హీరొయిన్ లకు నటనపై శ్రద్ధ, ఆశక్తి రెండూ లేవు. హీరోను ఆశ్చర్యపోమంటే ఆకాశంలోకి చూస్తాడు, హీరోయిన్ ను సిగ్గుపడమేంటే నేలవైపుకు చూస్తుంది. నిజానికి హీరో మేక్ అప్ వేసిన సైడ్ క్యారెక్టర్ లా, హీరోయిన్ లిప్ స్టిక్ పుసేసిన క్యారక్టర్ ఆర్టిస్ట్ లావున్నారు. వీరి పాత్రలు చాలవన్నట్టు ఒక వ్యాంపు పాత్రతో ​వుంది. ఆ పాత్ర చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉంది .

​ఈ మధ్య సినిమాలో డైలాగులలో బూతు తప్ప నీతి వెతుక్కోలేము.అలాంటి డైలాగ్స్ సినిమాలో చాలా వున్న అవి ప్రేక్షకుల నవ్వు తెప్పించకపోగా చిరాకు కలిగించాయి.​ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ స్క్రీన్ ప్లే ఎందుకంటే​ఎలిమెంటరీ పిల్లాడు​కూ​డా ఆలోచించగలిగే ట్విస్ట్ లతో ఇంటర్వెల్ ను, శుభం కార్డు​ వేసేస్తాడు​. ఇంకా మొదటి భాగంలో లవర్స్ డే రోజు రౌడీలకు పార్కులో యూత్ గొప్పతనం గురించి చెప్పే సీన్, సెకండ్ హాఫ్ లో జయప్రకాశ్ రెడ్డి, ఎం.ఎస్ నారాయణల కామెడీ టార్చర్ వర్ణనాతీతం.పాటలు అంతంతమాత్రంగా వున్నా​చూడటానికి మాత్రం బాగాలేవు. ఈ సినిమా టైటిల్ కి కథకి అసలు సంబంధం ఉండదు.

సాంకేతిక విభాగం:

ఈ విభాగంలో సంగీత దర్శకుడు చక్రి ఒక్కడే కాస్త పాస్ మార్కులు సంపాదించుకున్నాడు. మిగిలిన​విభాగాలకు చెందిన టెక్నిషయన్స్ అందరూ ఫెయిల్ అయ్యారు.
దీనికి భాద్యత దర్శకుడిదే. బూతు తీస్తే యూత్ ఈజీగా ఎట్రాక్ట్ అవుతారన్న పురుగు ఎప్పుడైతే మనలో పుట్టిందో అప్పట్నుంచే మనకిలాంటి సినిమాలు ​వస్తున్నాయి
.కంటెంట్ లేని కథలో బూతు వున్న లేకపోయిన పెద్దగా ఉపయోగంలేదు. కావున ఇకనుండాయిన ఇలాంటి ప్రయత్నాలు మానుకుంటే మంచింది.కెమెరా ​మెన్
పనితనం అంతంతమా​త్రంగానే ఉంది​.ఎడిటింగ్ అస్సలు బాగోలేదు.​కొన్ని పాటల సాహిత్యం బాగుంది​.

తీర్పు:

కధలో పట్టు లేదు, కధనంలో కిక్కు లేదు. ఎం చెయ్యాలో తెలియక సినిమాలో కుళ్ళు కామెడీ, పిచ్చి డ్యాన్సుల పేరుతో పావువంతు సినిమాను సూపర్ హిట్ మూవీ ఫూటేజ్ లతో నింపే​న సినిమా ‘లవ్ డాట్ కామ్​.​పరవాలేదనిప్పించె చక్రి సంగీతం తప్ప మరొక ప్లస్ పాయింట్ కూడా లేదు.ఇంత​ చెప్పిన​ మీకు సినిమాకు గనుక వెళ్ళాలనిపిస్తే మీతో పాటు ఒక జండూ బాంని కుడా తీస్కెళ్ళండి

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/ 5

123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు