ఓటిటి సమీక్ష : “లస్ట్ స్టోరీస్ 2” – హిందీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

ఓటిటి సమీక్ష : “లస్ట్ స్టోరీస్ 2” – హిందీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

Published on Jul 1, 2023 4:16 PM IST
Narayana & Co Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 29, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: తమన్నా భాటియా, విజయ్ వర్మ, నీనా గుప్తా, మృణాల్ ఠాకూర్, అంగన్ బేడీ, కాజోల్, కుముద్ మిశ్రా, అనుష్క కౌశిక్, జీషన్ నాద, అమృత సుభాష్, తిలోటమా షోమ్,

దర్శకుడు : బాల్కీ, కొంకణా సేన్ శర్మ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీందర్నాథ్ శర్మ

నిర్మాత: రోనీ స్క్రూవాలాఆషి దువా సారా,

సంగీతం: రాజా నారాయణ్ దేబ్, అమన్ పంత్, సాగర్ దేశాయ్, సుభజిత్ ముఖర్జీ

సినిమాటోగ్రఫీ: తపన్ తుసార్ బసు, పి.సి. శ్రీరామ్, ఆనంద్ బన్సాల్

ఎడిటర్ : ఊర్వశి సక్సేనా, నయన్ హెచ్‌కే భద్ర, సంయుక్త కాజా, చంద్రశేఖర్ ప్రజాపతి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

రీసెంట్ గా థియేటర్స్ సహా ఓటిటిలో కూడ పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కి వచ్చాయి. మరి వీటిలో దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అవైటెడ్ ఒరిజినల్ సీక్వెల్ ఆంథాలజీ చిత్రం “లస్ట్ స్టోరీస్ 2”. ఈసారి మరింత ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఈ ఆంథాలజీలో కూడా మొత్తం నాలుగు భిన్నమైన కథలు కనిపిస్తాయి. వీటిని సింపుల్ గా చెప్పుకున్నట్టు అయితే మొదటి స్టోరీ ఓ యంగ్ కపుల్ మృణాల్ ఠాకూర్, అంగన్ బేడీ తాము పెద్దల సమ్మతంతోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ నీనా గుప్త పెళ్ళికి కావాల్సింది ప్రేమతో పాటుగా ఓ బలమైన శారీరిక బంధం అని కూడా ఓపెన్ గా చెప్పడం షాకింగ్ గా మారుతుంది.

మరి అక్కడ నుంచి ఆ కుటుంబం, యంగ్ కపుల్ తీసుకున్న డెసిషన్ ఏంటి అనేది మెయిన్ థీమ్ కాగా ఇక రెండో కథ ఓ వర్కింగ్ విమెన్ అయినటువంటి తిలోత్తమ షోమ్ తన ఫ్లాట్ లో తన పని మనిషి తన భర్తని ఆమె లేనప్పుడు ఇంటికి రప్పించుకొని ఆమె శారీరిక ఆనందం పొందుతుంది. అయితే దీనిని ఓరోజు తిలోత్తమ సడెన్ గా వారికి తెలీకుండా చూసేస్తుంది. మరి అక్కడ నుంచి ఆమె ఏం చేస్తుంది అనేది అసలు కథ.

ఇక మూడో స్టోరీ అవైటెడ్ తమన్నా నటుడు విజయ్ వర్మ లపై కనిపిస్తుంది. విజయ్ ఓ కంపెనీ సీఈఓ కాగా తాను పదేళ్ల తర్వాత తన ఎక్స్ అయ్యిన తమన్నాని మీట్ అవుతాడు. మరి అన్నేళ్ల తర్వాత వీరు ఎలా మీట్ కావాల్సి వచ్చింది. మీట్ అయ్యాక విజయ్ తమన్నాను ఏం చేస్తాడు అనేది కథ.

ఇక ఫైనల్ గా అయితే మరో ప్రముఖ నటి కాజోల్ ఓ వ్యభిచారిణి కాగా ఆమెని ఓ రాజుల కుటుంబీకుడు పెళ్లి చేసుకొని తన ఇంట్లోనే బందీగా ఉంచి ఆమెని తన తోనే ఉంచెయ్యాలని అనుకుంటాడు. కానీ కాజోల్ తన కొడుకుని ఉన్నత చదువులు చదివించి విదేశాలకు వెళ్ళిపోవాలి అని చూస్తుంది. అలాగే కామోద్రేకుడు అయ్యిన తన భర్త విషయంలో ఆమె ఏం ప్లాన్ చేస్తుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ ఆంథాలజీలో కనిపించే నాలుగు స్టోరీ లలో కాస్త యూనిక్ గా అనిపించేది రెండో స్టోరీ అని చెప్పాలి. ఇందులో టేకింగ్ గాని ఎమోషనల్ డీలింగ్ గాని ఆసక్తిగా అనిపిస్తాయి. అలాగే ఈ స్టోరీలో తిలోత్తమ నటన గాని ఆమె హావభావాలు చాలా సహజంగా ఉంటాయి. ఇక సిరీస్ లో అందరు అవైటింగ్ గా ఎదురు చూస్తున్న తమన్నా ఎపిసోడ్ లో ఆమె నుంచి గ్లామ్ షో కోసం చూసేవారికి నచ్చవచ్చు.

అలాగే ఆ స్టోరీ లో ట్విస్ట్ కూడా కొందరికి ఒకింత ఆశ్చర్యం అనిపించవచ్చు. ఇక ఫైనల్ గా అయితే ఈ ఆంథాలజీలో ఒకో స్టోరీ తర్వాత మొదలయ్యే ఇంకో స్టోరీ కొద్దిగా బెటర్ గా అనిపిస్తుంది. అలా ఫైనల్ గా వచ్చే కాజోల్ ఎపిసోడ్ కాస్త బెటర్ ఫీల్ ఇస్తుంది. అందులోని ఎమోషన్స్ గాని నటుల పెర్ఫామెన్స్ లు కానీ చాలా బాగుంటాయి. ఇక ఇందులో కూడా లాస్ట్ ట్విస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా ఫస్ట్ స్టోరీలో మృణాల్ నానమ్మ చెప్పే కొన్ని జీవిత సత్యాలు కొందరి పర్శనల్ లైఫ్ కి కనెక్ట్ కావచ్చు.

 

మైనస్ పాయింట్స్ :

ఇందులో మైనస్ పాయింట్స్ కూడా బాగానే అనిపిస్తాయి. మొదటగా ఈ చిత్రానికి క్యాస్టింగ్ తో ఎలా అయితే హైప్ వచ్చిందో అదే ఈ ఆంథాలజీలో మైనస్ అని చెప్పొచ్చు. ఒక్క కాజల్ ఎపిసోడ్ మినహా మిగతా మృణాల్ ఠాకూర్ అలాగే తమన్నా భాటియా ఎపిసోడ్స్ సో సో గానే వ్యూవర్స్ కి అనిపించవచ్చు. మృణాల్ ఎపిసోడ్ లో అయితే పెద్దగా చెప్పుకోడానికి కూడా ఏమీ ఉండదు. జస్ట్ యావరేజ్ గా మాత్రమే అనిపిస్తుంది.

దీనితో ఈ ఎపిసోడ్ కోసం అసలు పెట్టుకున్న వారు నిరాశ చెంది ఉండవచ్చు. ఇక తమన్నా విజయ్ ఎపిసోడ్ అయితే ఆ సెటప్ ని బ్యాక్గ్రౌండ్ విజువల్స్ ఓ ఫాంటసీ వరల్డ్ లా డిజైన్ చేసారో ఏమో కానీ అది అంత నాచురల్ గా అనిపించదు. అలాగే ట్విస్ట్ కూడా కొంతమంది ఊహించగలిగి ఉండొచ్చు. ఇంకా ఈ ఒక్క ఎపిసోడ్ ని ఇంకా ఎక్కువసేపు డిజైన్ ఉంటే బాగుండేది. అలాగే మొదటి రెండు ఎపిసోడ్స్ కూడా కాస్త స్లోగా సాగినట్టు అనిపిస్తాయి.

 

సాంకేతిక వర్గం :

మొత్తం నాలుగు ఎపిసోడ్స్ కి సంబంధించి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఏ ఎపిసోడ్ లో ఎంత చూపించాలో ఎవరెవరి లివింగ్ స్టైల్ కి తగ్గట్టుగా నాచురల్ ప్రొడక్షన్ డిజైన్ కనిపిస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ లు కూడా ఒకో థీమ్ కి తగ్గట్టుగా బాగున్నాయి. మొదటి ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకత్వం విషయానికి వస్తే మొత్తం నలుగురు దర్శకులు బాల్కీ, కొంకణా సేన్ శర్మ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీందర్నాథ్ శర్మ లు ఒకో ఎపిసోడ్ ని డిజైన్ చేసుకున్నారు. అయితే వీటిలో సుజోయ్ క్రియేట్ చేసింది బాగా వీక్ అని చెప్పాలి. అలాగే ఆర్ బల్కి స్టోరీ కూడా ఇలానే ఉంటుంది. ఇక మిగతా ఇద్దరి కథ కథనాలు బాగుంటాయి.

 

తీర్పు :

ఇక ఫైనల్ గా చూసినట్టు అయితే అవైటెడ్ సీక్వెల్ గా వచ్చిన ఈ “లస్ట్ స్టోరీస్ 2” ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. స్టార్ క్యాస్టింగ్ కోసం చూసేవారు అయితే కాస్త డిజప్పాయింట్ అవ్వొచ్చు కానీ కొన్ని ఎమోషన్స్, ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. మరి వీటితో అయితే ఈ వారాంతానికి ఒక్కసారి ఈ ఆంథాలజీని ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు