సమీక్ష : “మాలికాపురం” – పర్వాలేదనిపించే డివోషనల్ డ్రామా

సమీక్ష : “మాలికాపురం” – పర్వాలేదనిపించే డివోషనల్ డ్రామా

Published on Jan 27, 2023 3:03 AM IST
Malikappuram Movie-Review-In-Telugu

విడుదల తేదీ : జనవరి 26, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ఉన్ని ముకుందన్, దేవా నంద, శ్రీపత్, సైజు కురుప్

దర్శకుడు : విష్ణు శశి శంకర్

నిర్మాతలు: ప్రియా వేణు, నీతా పింటో

సంగీత దర్శకులు: రంజిన్ రాజ్

సినిమాటోగ్రఫీ: విష్ణు నారాయణన్

ఎడిటర్: షమీర్ మహమ్మద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

రీసెంట్ గా మళయాళంలో వచ్చి భారీ హిట్ గా నిలిచిన చిత్రమే “మాలికాపురం”. టాలెంటెడ్ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ చిత్రం “కాంతారా” ని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగులో వచ్చింది. మరి ఈ చిత్రం కూడా సక్సెస్ అందుకుందో లేదో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథ లోకి వస్తే.. ఓ ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను(దేవ నంద) ఆ వయసు నుంచే అయ్యప్ప స్వామిని తాను భక్తితో కొలుచుకుంటుంది. దీనితో ఎలా అయినా శబరిమల వెళ్లి అయ్యప్ప దర్శనం చేసుకోవాలని తన తండ్రిని అడుగుతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో తన ఆ చిన్నారి కుటుంబంలో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుంటాయి. వీటి తర్వాత షన్ను తన సోదరుడు బుజ్జి(శ్రీపతి) తో శబరిమల వెళ్లాలని నిశ్చయించుకుంటుంది. కానీ మరోపక్క ఓ చిన్న పిల్లలని కిడ్నాప్ చేసే గ్యాంగ్ కూడా ఉంటుంది. మరి వాళ్ళు ఈ పిల్లల దగ్గరకి వస్తారా ఈ చిత్రంలో అయ్యప్పన్(ఉన్ని ముకుందన్) పాత్ర ఏంటి? ఏం చేస్తుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో ముఖ్యంగా కనిపించే అన్ని పాత్రలు కూడా సినిమా ఆద్యంతం కనిపించి ఆకట్టుకుంటాయి. మరి వాటిలో మాస్టర్ దేవ నంద సినిమాలో మంచి హైలైట్ అని చెప్పొచ్చు. షన్ను అనే ఇనోసెంట్ పాత్రలో ఈ చిన్నారి అద్భుతమైన నటనను కనబర్చి ఆశ్చర్యపరుస్తుంది. సినిమా అంతా మెయిన్ గా తన పాత్ర చుట్టూతే కనిపిస్తుంది. అంత ముఖ్య పాత్రలో ఈ చిన్నారి మెస్మరైజ్ చేస్తుంది. పలు ఎమోషన్స్ సీన్స్ లో తన చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ చిన్నారికి నటిగా మంచి భవిష్యత్తు ఉంటుంది.

ఇక ఈ చిత్రంలో షన్ను పాత్రతో ట్రావెల్ అయ్యే రోల్ శ్రీపత్ పాత్ర బుజ్జి కోసం చెప్పుకోవాలి. తన రోల్ మంచి హిలేరియస్ గా సినిమాలో కనిపిస్తుంది. తన కామెడీ టైమింగ్ మంచి నవ్వు తెప్పిస్తుంది. అలాగే ఓ బాధ్యతగల అన్నయ్యగా కూడా తాను మంచి పెర్ఫామెన్స్ ని అందించాడు.

ఇక వీరితో పాటుగా మళయాళ టాలెంటెడ్ నటుడు ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకుంటాడు. అయ్యప్పన్ గా తన పెర్ఫామెన్స్ సినిమాలో ఓ సాలిడ్ హైలైట్ గా కనిపిస్తుంది. తన లాస్ట్ లాయర్ డ్రామాలో సెటిల్డ్ రోల్ లో కనిపించిన తాను ఈ చిత్రంలో పూర్తి డిఫరెంట్ గా కనిపిస్తాడు. ఇంకా ఈ సినిమాలో ఇచ్చిన సందేశం డీసెంట్ గా ఉంటుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రం అయితే అనుకున్న స్థాయిలో మంచి డివోషనల్ ట్రీట్ ఇస్తుంది అనుకునేవారు కాస్త ఆలోచించాలి. కాస్త లిమిటెడ్ అంచనాలు పెట్టుకుంటే తప్ప ఈ చిత్రం పూర్తి స్థాయిలో మెప్పించదు. కొన్ని పాత్రలపై నడిచే సన్నివేశాలు మినహా ఈ చిత్రంలో పెద్దగా స్టోరీ కనిపించదు. కొన్ని సీన్స్ మినహా సినిమా కాస్త డల్ గానే కనిపిస్తుంది.

అలాగే నరేషన్ కూడా అంత ఎంగేజింగ్ గా కనిపించదు. సినిమాలో దైవత్వానికి సంబంధించి కొన్ని సీన్స్ బాగుంటాయి కానీ వాటిని మరింత మెరుగ్గా డెవలప్ చేసి ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అలాగే చిన్న పిల్లలు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్లడం అనే ఈ చిన్న లైన్ మన టాలీవుడ్ చిత్రం ‘దేవుళ్ళు’ ని గుర్తు చేస్తుంది.

ఆ రకంగా సినిమా ప్లాట్ లో కొత్తదనం కనిపించదు. అలాగే వీరి ప్రయాణంలో సన్నివేశాలు మరింత ఆసక్తిగా మలచి ఉంటే బాగుండేది. అలాగే చాలా సీన్స్ అనవసరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటి వాటిని అయితే తగ్గించాల్సింది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి అలాగే తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇక టెక్నికల్ టీం లో రంజిన్ రాజ్ సంగీతం బాగుంది. విష్ణు నారాయణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సి ఉంది.

ఇక దర్శకుడు విష్ణు శశి శంకర్ విషయానికి వస్తే..తన వర్క్ సినిమాకి బాగానే అనిపిస్తుంది కానీ కాస్త కొత్త లైన్ తీసుకొని ఉంటే బాగుండేది. అలాగని మరీ అంత డిజప్పాయింటింగ్ నరేషన్ అయితే సినిమాలో కనిపించదు. కొన్ని చోట్ల నరేషన్ బాగుంటుంది. అలాగే నటులు నుంచి మంచి అయితే తాను రాబట్టారు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మాలికాపురం” చిత్రం లో చిన్నపిల్లల నటన నిజంగా మెస్మరైజింగ్ గా ఉంటుంది. అలాగే కీలక పాత్రలో కనిపించిన ఉన్ని ముకుందన్ ఆకట్టుకుంటారు. అయితే అక్కడక్కడా కొన్ని సీన్స్ బాగుంటాయి తప్ప ఇంకా పలు సీన్స్ ని మరింత ఆసక్తిగా ఎలివేట్ చేసి ఉంటే ఈ చిత్రం మరింత ఆకట్టుకునేది. వీటిని మినహా ఈ వారాంతానికి ఈ చిత్రం డీసెంట్ ట్రీట్ ఇస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు