సమీక్ష : ‘నరసింహపురం’ – బోర్ గా సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా !

Narasimhapuram movie review

విడుదల తేదీ : జూలై 30, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2/5

నటీనటులు :  నందకిషోర్, సిరి హనుమంతు, విజయ్ కుమార్, ఉషశ్రీ మరియు రంగధం

దర్శకుడు:  శ్రీరాజ్ బళ్ళా

నిర్మాతలు : శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల
సంగీత దర్శకుడు :  ఫ్రాంక్లిన్ సుకుమార్

ఎడిటర్: శివ వై.ప్రసాద్


నందకిషోర్ కథానాయకుడిగా దర్శకుడు శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘నరసింహపురం’. ఈ సినిమాకి నిర్మాత ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్. కాగా కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్, స్వామి ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ ఆయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

నంద (నందకిషోర్) గతం మర్చిపోయి పిచ్చివాడైపోతాడు. అయితే అతన్ని కంటికి రెప్పలా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది సిరి (సిరి). అసలు ఈ సిరి ఎవరు ? నందాని ఎందుకు అంతగా ప్రేమిస్తోంది ? నంద ఎందుకు పిచ్చివాడు అయిపోయాడు ? అతని జీవితం అలా మారడానికి కారణం ఎవరు ? నంద ప్రాణంగా ప్రేమించే అతని చెల్లికి ఏమైంది ? చివరకు నంద జీవితం ఏమైంది ? లాంటి అంశాలు తెలియాలంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ అండ్ నిజమైన ప్రేమకు సంబంధించిన కొన్ని అంశాలు సినిమాలో కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన నందకిశోర్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. తానూ ప్రేమించిన అమ్మాయిలో నిజమైన ప్రేమను వెతుకుంటూ.. చివరికీ తను ప్రేమ కోసం జీవితంలో ఎన్నో బాధలు పడతాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాల్లో నందకిశోర్ చాల బాగా నటించాడు.

అలాగే మరో కీలక పాత్రలో నటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్ కొన్ని కామెడీ అండ్ సీరియస్ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరి పర్వాలేదనిపించింది. అయితే ఉన్నంతలో తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక కీలక పాత్రల్లో నటించిన అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్ తమ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్ తో బాగానే అలరిస్తారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో అక్కడక్కడా కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్, నందకిషోర్ క్యారెక్టర్ ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం, ఏ మాత్రం ఇంట్రస్ట్ కలిగించలేని సన్నివేశాలతో ప్లే బాగా బోర్ గా సాగుతూ మొత్తానికి సినిమా విసిగిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ కథలో మిళితమయి సాగవు. పైగా కథనంలో సరైన ప్లో కూడా లేదు. ఇక కొన్ని సీన్స్ లో నవ్వించే ప్రయత్నం చేసారు గాని, అది ఎంతో కష్టపడి నవ్వించటానికి చేసినట్లే ఉంటుందిగాని, సహజంగా ఉండదు.

ముఖ్యంగా దర్శకుడు కథలోని మెయిన్ కాన్ ఫ్లిట్ ను వదిలేసి, అనవసరమైన ట్రాక్ లతో సినిమాని నింపడం సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. సెకెండ్ హాఫ్ లో కూడా కథనం అసలు బాగాలేదు. దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద కలిగే ఆ కాస్త ఇంట్రస్ట్ ని కూడా దర్శకుడు నీరుగార్చాడు. సినిమాలో స్టోరీతో పాటు డైరెక్షన్ కూడా చాలా వీక్ గా ఉంది.

అలాగే కథకు బలం పెంచలేని లవ్ అండ్ కామెడీ సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ కూడా లాజిక్ లేకుండా సాగడం.. అలాగే కొన్ని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం కూడా సినిమాకి మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు రాసుకున్న స్క్రిప్ట్ లో ఏ మాత్రం విషయం లేదు. సంగీత దర్శకుడు అందించిన పాటలు కూడా బాగాలేదు. అయితే ఓ సాంగ్ ఆకట్టుకుంటుంది. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని పెల్లెటూరు విజువల్స్ ను అందంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు:

ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ వచ్చిన ఈ ‘నరసింహపురం’ ఆకట్టుకునే విధంగా సాగలేదు. కథకథనాలు ఆకట్టుకోకపోవడం, ఆసక్తిగా సాగని ప్రేమ సన్నివేశాలు మరియు సంఘర్షణ లేని ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. ఓవరాల్ గా ఈ సినిమా బాగాలేదు.

123telugu.com Rating :  2/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం :