సమీక్ష : నటన – విసిగించే నటన ఇది

విడుదల తేదీ : జనవరి 04, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.25/5

నటీనటులు : మహీదార్, శ్రావ్య రావు, బానుచందర్, రఘుబాబు, ప్రభాస్ శీను, జబర్దస్త్ ఫణి తదితరులు

దర్శకత్వం : భారతి బాబు

నిర్మాత : కుబేర ప్రసాద్

సంగీతం : ప్రభాకర్ ప్రవీణ్ లంక

సినిమాటోగ్రఫర్ : వాసు

ఎడిటర్ : వి.నాగేశ్వర్ రెడ్డి

భారతి బాబు దర్శకత్వంలో మహీదార్, శ్రావ్య రావు జంటగా కుబేర ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘నటన’. ఈ చిత్రంలో బానుచందర్, రఘుబాబు, ప్రభాస్ శీను, జబర్దస్త్ ఫణి తదితరులు నటించారు. ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

మహీదార్ (శ్రీ రామ్) హీరో అవ్వాలనే గోల్ తో, డైరెక్షన్ డిపార్ట్ మెంట్ అయిన తన ఫ్రెండ్స్ తో కలిసి సినిమాల్లో ట్రై చేస్తుంటాడు. అయితే వీరికి జానికి (శ్రావ్య రావు) మంచి కామన్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్ లోనే మహీదార్ కి శ్రావ్య రావ్ కి ఒకరి పై ఒకరికి ఇష్టం కలుగుతుంది. వీరి ప్రేమ ఇలా కొనసాగుతుండగానే.. మరో పక్క మహీధర్ అండ్ అతని ఫ్రెండ్స్ సినిమా వేటలో వేగవంతం చేస్తారు. ఆ క్రమంలో ఆర్కే(రఘు బాబు) చేతిలో మోసపోతారు. అలాగే శంకరన్న (ప్రభాస్ శ్రీను) కూడా డబ్బులు కోసం వీరిని వాడుకొవాలని చూస్తాడు.

కాగా భూపతి (బానుచందర్)ని చంపి అతని ఉంటున్న బంగ్లా, ఆ బంగ్లాలోని డబ్బును కాజేయటానికి శంకరన్న మహీధర్ అండ్ అతని ఫ్రెండ్స్ ను ఆ బంగ్లాకి తీసుకువెళ్తారు. అక్కడ జరిగే కొన్ని నాటకీయ పరిమాణాల మధ్య భూపతి శంకరన్నను, మహీధర్ ఫ్రెండ్ ని చంపేసి.. మహీధర్ ని అతని ఫ్రెండ్ ని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. మరి భూపతి నుండి మహీధర్ అతని ఫ్రండ్స్ ఎలా తప్పించుకున్నారు ? అసలు తప్పించుకున్నారా ? లేక భూపతి చేతిలో చనిపోయారా ? అయినా భూపతి వీళ్ళనే ఎందుకు చంపుతున్నాడు ? దేని కోసం చంపుతున్నాడు ? అసలు భూపతి ఎవరు ? అతనికి ఆ బంగ్లాకి ఉన్న సంబంధం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన మహీదార్ కొన్ని కీలక సన్నివేశాల్లో కొంత తడబాటు పడ్డా.. చాలా వరకు కాన్ఫిడెంట్ గా నటించాడు. తన నటనతో పాటు తన డైలాగ్ మాడ్యులేషన్ తోనూ మహీదార్ ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్ గా చేసిన శ్రావ్య రావు తన గ్లామర్ తోనే కాకుండా.. తన లుక్స్ పరంగా, తన నటన పరంగా కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో శ్రావ్య రావు నటన చాలా బాగుంది.

సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సీనియర్ హీరో బానుచందర్ తన నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రూరత్వమైన పాత్రలో ఆయన హావభావాలతోనే విలనిజాన్ని చాలా చక్కగా పండించారు. ఇక కమెడియన్స్ రఘుబాబు, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ ఫణి తమ కామెడీ టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

చాలా సినిమాలకు రైటింగ్ డిపార్ట్ మెంట్ లో పని చేసిన భారతి బాబు ఈ సినిమాతో తొలిసారిగా దర్శకత్వ బాధ్యతను వహించారు. అయితే ఆయన అనుకున్న కథను తెర మీదకు ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా సంబంధం లేని సీన్లతో నవ్వు రాని కామెడీతో టార్చర్ పెడితే, సెకెండ్ హాఫ్ ప్లో లేని సన్నివేశాలతో, ఎలివేట్ కాని ఎమోషన్ తో సినిమాని చాలా బోరింగ్ గా నడిపారు.

సినిమాలో చెప్పుకోవడానికి క్యారెక్టర్స్, ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి కానీ.. ఏది ఆసక్తికరంగా సాగదు. కొన్ని సన్నివేశాల్లో అయితే దర్శకుడు తనకు తోచినట్లు రాసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది.

పైగా కన్విన్స్ కానీ, లాజిక్ లేని సీన్స్ తో దర్శకుడు ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రేక్షకులు మాత్రం సినిమాకి ఎక్కడా కనెక్ట్ కారు. పైగా క్లైమాక్స్ లో బానుచందర్ – హీరో అండ్ ఫ్రెండ్స్ మధ్య వచ్చే ఇంట్రస్టింగ్ కంటెంట్ కూడా ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. అది కూడా సరిగ్గా ఎలివేట్ చెయ్యలేదు దర్శకుడు.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు భారతి బాబు పేపర్ మీద రాసిన స్క్రిప్ట్, స్క్రీన్ మీద ఆయన విజన్ కి తగ్గట్లు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. పైగా ఆయన రాసుకున్న కథకథనాల్లో సహజత్వం కూడా లోపించింది. వాసు కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది.

ప్రభాకర్ ప్రవీణ్ లంక అందించిన పాటల్లో ఒక పాట ఆకట్టుకుంటుంది. ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లు సాగింది. ఎడిటర్, దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. కథకు తగ్గట్లుగానే నిర్మాణ విలువలు ఉన్నాయి.

 

తీర్పు :

భారతి బాబు దర్శకత్వంలో మహీదార్, శ్రావ్య రావు జంటగా కుబేర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. దర్శకుడు పేపర్ మీద రాసిన స్క్రిప్ట్ ను స్క్రీన్ మీదకు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. పైగా ఆకట్టుకోని కథనం, ఆసక్తికరంగా సాగని సన్నివేశాలు, క్లారిటీ లేని పాత్రలు, నవ్వు రాని కామెడీ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని బాగా దెబ్బతీశాయి. ఓవరాల్ గా ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని కూడా నిరుత్సాహ పరుస్తోంది.

123telugu.com Rating : 1.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :