సమీక్ష : “నేను స్టూడెంట్ సర్” – అక్కడక్కడా ఆకట్టుకునే థ్రిల్లర్

సమీక్ష : “నేను స్టూడెంట్ సర్” – అక్కడక్కడా ఆకట్టుకునే థ్రిల్లర్

Published on Jun 3, 2023 3:05 AM IST
Nenu Student Sir ! Movie Review In Telugu

విడుదల తేదీ : జూన్ 02, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: గణేష్ బెల్లంకొండ, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్

దర్శకులు : రాఖీ ఉప్పలపాటి

నిర్మాతలు: నంది సతీష్ వర్మ

సంగీత దర్శకులు: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

బెల్లంకొండ యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన మొదటి సినిమా స్వాతి ముత్యం తో మంచి డెబ్యూ ని అందుకోగా నెక్స్ట్ తాను చేసిన ఇంట్రెస్టింగ్ చిత్రం “నేను స్టూడెంట్ సర్”. మరి పలు మార్లు వాయిదా తర్వాత ఫైనల్ గా ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

 

ఇక కథ లోకి వస్తే..సుబ్బు(గణేష్ బెల్లంకొండ) ఓ కాలేజ్ స్టూడెంట్ కాగా తాను ఎప్పుడు నుంచో ఓ మంచి ఐఫోన్ కొనుకోవాలని అనుకుంటాడు. అలా ఫైనల్ గా తాను కస్టపడి సంపాదించిన డబ్బుతో అయితే ఐఫోన్ 12ని కొనుకోగా ఈ ఫోన్ కొన్నాక దాని వల్ల ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అంతే కాకుండా తన బ్యాంక్ అకౌంట్ లో భారీ అమౌంట్ కూడా పడడం తో తన చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తుంది. మరి ఇలాంటి సమస్య నుంచి తాను ఎలా బయట పడతాడు? ఇంతకీ దీని వెనుక ఉన్నది ఎవరు అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

మెయిన్ గా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో కాన్సెప్ట్ ఒకింత ఆసక్తిగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ కాలంలో ఫైనాన్సియల్ గా స్కామ్ లు ఎలా జరుగుతున్నాయి అనే అంశం సినిమాలో బాగా చూపించారు. అలాగే దీని అనుగుణంగా చూపించిన మెసేజ్ కూడా ఆకట్టుకుంది.

ఇక లాస్ట్ లో అయితే నటుడు సునీల్ పాత్రతో ఇచ్చిన ఎండింగ్ కూడా బాగుంది. ఇక గణేష్ బెల్లంకొండ తన మొదటి సినిమా కంటే ఇందులో బెటర్ గా తనని తాను ప్రెజెంట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని చెప్పాలి. ఓ యంగ్ ఇనోసెంట్ స్టూడెంట్ గా అయితే సెన్సిబుల్ పెర్ఫామెన్స్ ని తాను ఈ చిత్రంలో కనబరిచాడు.

అలాగే క్లైమాక్స్ లో తన నటనలో మరింత పరిణితి కనబరిచాడు. ఇక మొదటగా చెప్పిన సునీల్ వచ్చిన తర్వాత సినిమా మరికాస్త ఆసక్తిగా మారుతుంది. అలాగే వెర్సటైల్ నటుడు తన రోల్ కి న్యాయం చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ థ్రిల్లర్ లో కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే బాగానే ఉన్నా అసలు సమస్య ఫస్టాఫ్ లో ఉందని చెప్పాలి. ఈ మొదటి సగం కాస్త బోరింగ్ గా సాగదీతగా అనిపిస్తుంది. మెయిన్ గా మెయిన్ లీడ్ మధ్య ఉన్న లవ్ ట్రాక్ ఏమంత గొప్పగా అనిపించదు. దీంతో ఆడియెన్స్ కి అయితే చికాకు తెప్పించవచ్చు.

ఇక సినిమాలో మరో పెద్ద బ్లండర్ ఏమిటంటే కొందరు నటీనటులకు వారిపై సీన్స్ లో వారి నటనకి వినిపించే డబ్బింగ్ కి అసలు సింక్ కూడా ఉండదు అంత జాగ్రత్తగా మేకర్స్ సినిమాని తెరకెక్కించారు. అలాగే సినిమా మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్ళడానికి సెకండాఫ్ లో కూడా సమయం ఎక్కువే తీసుకున్నారు.

దీనితో అక్కడ వరకు సినిమా అంతా కూడా చాలా సో సో గానే సాగుతుంది. మెయిన్ గా అనవసర బోరింగ్ సన్నివేశాలు ఎడిట్ చేసేయాల్సింది. ఇంకా కొన్ని లాజిక్స్ కూడా బాగా మిస్ అయ్యాయి అంతే కాకుండా కొన్ని సీన్స్ లో డైలాగ్స్ అలా రిపీటెడ్ గా రావడం ఆడియెన్స్ కి విసుగు తెప్పిస్తాయి.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే టెక్నికల్ టీం లో అయితే మహతి స్వర సాగర్ సంగీతం బాగుంది. అలాగే తన మాయే మాయే సాంగ్ విజువల్ గా బాగుంది. ఇక అనిత్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ గా ఉంది. ఇంకా ఎడిటింగ్ వర్క్ బాగాలేదు, సినిమాలో డైలాగ్స్ కూడా బెటర్ చేయాల్సింది. డబ్బింగ్ లో జాగ్రత్తలు లేవు.

ఇక దర్శకుడు రాఖి ఉప్పలపాటి విషయానికి వస్తే.. తాను ఈ థ్రిల్లర్ ని పూర్తి స్థాయిలో హ్యాండిల్ చేయలేకపోయారని చెప్పాలి. సినిమాలో మంచి థీమ్ ఉన్నప్పటికీ కూడా దానిని చాలా అనవసర సన్నివేశాలతో నింపేసి చాలా సమయాన్ని వేస్ట్ చేశారు. బెటర్ సీన్స్ ని ఈ థ్రిల్లర్ డ్రామాలో ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. కరెక్ట్ నరేషన్, స్క్రీన్ ప్లే గాని పడి ఉంటే ఈ సినిమా అవుట్ పుట్ మరింత బెటర్ గా వచ్చి ఉండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “నేను స్టూడెంట్ సర్” లో మంచి కాన్సెప్ట్ అండ్ మెసేజ్ కనిపిస్తాయి అలాగే యంగ్ హీరో బెల్లం కొండ గణేష్ మంచి నటనను కూడా కనబరిచాడు. సినిమా లాస్ట్ లో కొన్ని ఎలిమెంట్స్ తప్ప ఫస్ట్ నుంచి అయితే పూర్తి స్థాయి ఎంగేజింగ్ డ్రామాగా అయితే ఇది మెప్పించదు. సరైన స్క్రీన్ ప్లే లేదు, దర్శకుని వైఫల్యంతో అయితే ఈ చిత్రం ఈ వారాంతానికి జస్ట్ ఓకే ట్రీట్ మాత్రమే ఇస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు