ఓటిటి సమీక్ష : “9 హవర్స్” తెలుగు సిరీస్ డిస్నీ+ హాట్ స్టార్ లో

ఓటిటి సమీక్ష : “9 హవర్స్” తెలుగు సిరీస్ డిస్నీ+ హాట్ స్టార్ లో

Published on Jun 4, 2022 3:01 AM IST
 Vikram Movie Review

విడుదల తేదీ : జూన్ 03, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: తారక రత్న, అజయ్, వినోద్ కుమార్, మధు శాలిని, రవివర్మ, ప్రీతి అస్రాని

దర్శకత్వం : నిరంజన్ కౌశిక్, జాకబ్ వర్గీస్

నిర్మాతలు: రాజీవ్ రెడ్డి వై, సాయి బాబు జాగర్లమూడి

సంగీత దర్శకుడు: శక్తికాంత్ కార్తీక్


ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో థియేటర్స్ లో సినిమాలతో పాటుగా ఓటిటి లో పలు సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి. అలా లేటెస్ట్ గా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో వచ్చిన తెలుగు ఇంట్రెస్టింగ్ సిరీస్ “9 హవర్స్”. మరి ఈ సిరీస్ ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వచ్చినట్టు అయితే ఈ సిరీస్ సెటప్ అంతా 1980ల టైం లో సెట్ చేసి ఉంటుంది. అప్పట్లో జైలు నుంచి కొంతమంది ఖైదీలు తప్పించుకొని రెండు దొంగతనాలు చేస్తారు. అయితే వాటిని చేసాక మూడో దొంగతనాన్ని ఓ బ్యాంకులో ప్లాన్ చేస్తారు కానీ అది అంత సక్సెస్ అయ్యేలా కనిపించదు. దీనితో అందులో ఉండే ఉద్యోగుల్ని అడ్డు పెట్టుకొని తప్పించుకోవాలని చూస్తారు. మరి ఈ క్లిష్ట కేస్ ని అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి తారక్ రత్న ఎలా డీల్ చేసాడు? చివరికి ఆ దొంగలు దొరుకుతారా లేదా? ఈ దొంగా పోలీస్ గేమ్ లో చివరికి ఎవరిది గెలుపు అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ ని డిస్నీ+ హోస్ట్ స్టార్ లో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సిరీస్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి మల్లాది వెంకట కృష్ణ రాసిన తొమ్మిది గంటలు నవల ఆధారంగా అడాప్ట్ చేసుకొని తన సృజనాత్మకతతో నిర్మాణం వహించారు. దీనితో ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు గాని నటీనటులు పెర్ఫామెన్స్ లు పర్ఫెక్ట్ గా ఆకట్టుకుంటాయి.

ఇక మొదటగా నటుడు తారక్ రత్న కోసం మాట్లాడితే తాను ఈ సినిమాలో ఒక కలిగిన పోలీస్ గా కనిపించి ఆకట్టుకుంటాడు. తన వచ్చిన ఈ రోల్ లో తాను సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించాడు. తనతో పాటుగా మరో కీలక నటుడు అజయ్ కి ఈ సిరీస్ లో మంచి రోల్ ని మంచి ఇంటెన్స్ గా చాలా ఈజ్ గా చేసాడు.

అలాగే నటుడు రవి వర్మ, శ్రీ తేజ్ లు మంచి నటనను కనబరిచారు. అలాగే వారి బ్యాక్గ్రౌండ్ స్టోరీలు కూడా బాగున్నాయి. ఇంకా మధుశాలిని, ప్రీతి అస్రాణి లు తమ రోల్స్ లో నీట్ గా చేశారు. అలాగే ఈ సిరీస్ లో కనిపించే కొన్ని ఎపిసోడ్స్ లో సస్పెన్స్ ఎలిమెంట్స్ మరియు అలాగే లాస్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ కూడా మంచి ఆసక్తి రేపుతోంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సిరీస్ ని టైటిల్ కి తగ్గట్టుగా ఉంటుంది అనో ఏమో కానీ 9 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేసారు కానీ ఈ కంటెంట్ ని స్ట్రిక్ట్ గా 7 ఎపిసోడ్స్ లో కంప్లీట్ చేసెయ్యొచ్చని అనిపిస్తుంది. అలాగే కొన్ని పాత్రలకి అయితే బ్యాక్ స్టోరీస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి అవి కట్ చేసి ఉంటే ఇంకా కథనం ఆసక్తిగా ఉండేది.

అలాగే మరో ఇంట్రెస్టింగ్ మైనస్ పాయింట్ ఏమిటంటే స్టార్టింగ్ లో ఆసక్తిగా కనిపించే తారక్ రత్న రోల్ ని అర్ధాంతరంగా ముగించినట్టు అనిపిస్తుంది. దానికి బెటర్ ఎండింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకా పలు సీన్స్ లో అయితే లాజిక్స్ బాగా మిస్ అయ్యినట్టు అనిపిస్తాయి.

అలాగే క్లైమాక్స్ లో మరిన్ని డీటెయిల్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. వీటితో పాటుగా హోస్టేజెస్ తో కనిపించే కాప్ డ్రామా అలాగే పోలీసులపై ఓ ఎపిసోడ్ బాహీగా వీక్ నరేషన్ లో కనిపిస్తాయి.

సాంకేతిక వర్గం :

ముందుగా చెప్పుకున్నట్టుగానే ఈ సిరీస్ కి క్రిష్ నుంచి సాలిడ్ నిర్మాణ విలువలు కనిపిస్తాయి. అలాగే టెక్నికల్ టీం లో సినిమాటోగ్రఫీ వర్క్ అలాగే శక్తి కాంత్ ల సంగీతం టాప్ నాచ్ లో ఉంటాయి. ముఖ్యంగా ఆద్యంతం సిరీస్ లో కనిపించే పాత కాలపు సెటప్ చాలా బాగుంది. దీనికి స్పెషల్ మెన్షన్ ఇవ్వొచ్చు. అలాగే డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది, ఇంకా బెటర్ గా చేసి ఉంటే మరింత బాగుండేది.

ఇక దర్శకులు జాకబ్, నిరంజన్ లు ఈ సిరీస్ కి డీసెంట్ వర్క్ అందించారని చెప్పాలి. మంచి ఎంగేజింగ్ నరేషన్ ని చాలా వరకు కొనసాగించి ప్రామిసింగ్ గా ప్రెజెంట్ చేశారు. కాకపోతే అక్కడక్కడా సాగదీతగా అనిపిస్తుంది. వీటిపై దృష్టి పెట్టి ఉంటే ఇంకా బెటర్ అవుట్ పుట్ ని మరింత ఎంగేజింగ్ గా అందించి ఉండేవారు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “9 హవర్స్” సిరీస్ డీసెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో దాదాపు ఆకట్టుకుంటుంది. నటీనటుల పెర్ఫామెన్స్ లు చాలా నీట్ గా కనిపిస్తాయి. కాకపోతే అక్కడక్కడా బాగా సాగదీతగా అనిపిస్తుంది. అవసరమైన సీన్స్ లో డీటెయిల్స్ తక్కవ అనవసర వాటికి ఎక్కువ కనిపిస్తాయి. దీనితో ఈ వారాంతానికి అయితే ఈ సిరీస్ ఓ మోస్తరుగా ఆడియెన్ ని ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు