ఓటిటి రివ్యూ : “త్రిభంగా” – (హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం)

ఓటిటి రివ్యూ : “త్రిభంగా” – (హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం)

Published on Jan 19, 2021 2:00 PM IST

నటీనటులు : కాజోల్, తన్వి అజ్మీ, మిథిలా పాల్కర్

దర్శకత్వం : రేణుక షాహనే

నిర్మాతలు : అజయ్ దేవ్‌గన్, పరాగ్ దేశాయ్, దీపక్ ధార్, రిషి నేగి, సిద్ధార్థ్ పి మల్హోత్రా, సప్నా మల్హోత్రా

సంగీతం : సంజోయ్ చౌదరి

సినిమాటోగ్రఫీ : బాబా అజ్మీ

ఎడిటింగ్ : జబీన్ మర్చంట్

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం ” త్రిభంగా”.దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఈ త్రిభంగా చిత్రం మూడు తరాలకు చెందిన ముగ్గురు మహిళకు తాలూకా కథలను చూపిస్తుంది. ఓ ప్రముఖ రచయితగా స్టార్ హీరోయిన్ నయనతార(తన్వి అజ్మీ) అనూహ్యంగా కోమాలోకి వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ సినీ రంగంలో ఎంతో పాపులర్ అయినటువంటి ఆమె కూతురు అనురాధ(కాజోల్)గా ఎంట్రీ ఇస్తుంది. మరి అలాగే తాను ఎంతో ప్రేమించే తన కూతురు మషా(మిథిలా పాల్కర్) అంతగా ఎమోషన్స్ ను బయట పెట్టని పాత్రలో కనిపిస్తుంది. అయితే నయన్ కోమా తర్వాత వీరి ముగ్గురి జీవితాలు ఎలా టర్న్ అయ్యాయి. మీరు ముగ్గురు జీవితాల్లో ఉన్న స్పర్ధలు ఏమిటి? చివరకు ఏమయ్యింది అన్నదే అసలు కథ.

 

ఏమి బాగుంది?

 

మూడు విభిన్న తరాలకు చెందిన ముగ్గురు వేర్వేరు మహిళల తాలూకా ఆలోచనా సరళిని ఈ చిత్రంలో అద్భుతంగ చూపించారు. చాలా సున్నితమైన అంశాన్ని నీట్ గా చూపించిన విధానం బాగుంది. అలాగే కాజోల్ మరియు తన్వి అజ్మీల నడుమ వచ్చే సీన్స్ కానీ వారి రిలేషన్ లోని ఎమోషన్స్ కానీ చాలా బాగా అనిపిస్తాయి. అలాగే కొన్ని డార్క్ ఎమోషన్స్ ను కూడా బాగా హ్యాండిల్ చేసారు. మరి అలాగే కాజోల్ అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి.

తన కెరీర్ లో ఉంటూ తన తల్లిని ద్వేషించే కూతురిగా మంచి నటనను కనబర్చింది. ఇక అలాగే సీనియర్ నటి తన్వి అజ్మీ పేరును కూడా స్పెషల్ మెన్షన్ చెయ్యాలి. ఆమె కూడా తనదైన శైలి అత్యున్నత నటనను కనబర్చారు. మరి అలాగే మిథాలీ పాల్కర్ రోల్ కూడా నీట్ గా ఉంది. అలాగే డైలాగ్స్ కానీ ఎండింగ్ కానీ మంచి ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. అలాగే ఈ చిత్రం రన్ టైం కూడా బాగా సెట్ చేసారు.

 

ఏమి బాగోలేదు?

 

చాలా అంశాల పరంగా ఎంతో బాగుంది అనుకునే ఈ చిత్రంలో కొన్ని డ్రా బ్యాక్స్ కూడా లేకపోలేవు. మొదటగా ఈ చిత్రం మరీ సున్నితంగా అలా స్లో గా సాగుతున్నట్టు అనిపిస్తుంది. వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే కథనం కూడా ఇంకా బాగుంటే మరింత ఎఫెక్టీవ్ గా ఉండేది.

మరి అలాగే 90ల కాలం నాటి సన్నివేశాలు కూడా బాగా ఎక్కువయ్యినట్టు అనిపిస్తాయి. వీటితో పాటుగా ఒకానొక సందర్భంలో కాజోల్ పై సీన్స్ కాస్త అతిగా అనిపిస్తుంది. మరి అలాగే కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను స్కిప్ చేసి ఉండాల్సింది. మరి ఇవన్నీ ఈ చిత్రంలోని డ్రా బ్యాక్స్ గానే కనిపిస్తాయి.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే ఈ త్రిభంగా చిత్రం ఓ కుటుంబంలోని మూడు తరాలకు చెందిన మహిళల సంబంధ బాంధవ్యాలను చిత్రికరిస్తుంది. సీరియస్ గా సాగే ఈ డ్రామాలో నటీనటుల పెర్ఫామెన్స్ అలాగే కొన్ని ఎమోషన్స్ ఆకట్టుకున్నా బాగా స్లోగా సాగే కథనం సడెన్ గా మళ్ళీ పరిస్థితులు మారిపోవడం కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఓవరాల్ గా అయితే ఓసారి చూడడానికి పర్వాలేదని చెప్పొచ్చు.

 

Rating: 2.75/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు