సమీక్ష : పందెంకోడి 2 – ఎమోషన్ తో సాగే యాక్షన్ సినిమా

Published on Oct 19, 2018 12:01 pm IST
Pandem Kodi2 movie review

విడుదల తేదీ : అక్టోబర్ 18, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : విశాల్, కీర్తి సురేష్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రాజ్ కిరణ్, అర్జై , గంజ కరుప్పు , రామ్ దాస్ తదితరులు.

దర్శకత్వం : ఎన్ లింగుస్వామి

నిర్మాత : ఠాగూర్ మధు

సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా

స్క్రీన్ ప్లే : ఎన్ లింగుస్వామి

ఎడిటర్ : కె ఎల్ ప్రవీణ్

విశాల్, కీర్తి సురేష్ జంటగా లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పందెంకోడి 2’. ఈ చిత్ర తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకున్నారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

రాజా రెడ్డి (రాజ్ కిరణ్) చుట్టు పక్కల ఏడు ఊరులకు ఆయనే పెద్ద. రాజా రెడ్డి కుమారుడు బాలు (విశాల్) జాతర కోసం ఫారన్ నుంచి ఊరికి వస్తాడు. అయితే ఏడేళ్ల క్రితం.. ప్రతి ఏటా ఆ ఏడు ఊర్లు కలిసి జరుపుకున్నే వీరభద్ర జాతరలో భోజనాల దగ్గర జరిగిన ఓ చిన్నపాటి గొడవలో ఓ రెండు కుటుంబాల మధ్య పగ పెరుగుతుంది. దాంతో ఆ రెండు కుంటుంబాల్లోని ఒక కుటుంబం అయిన భవాని (వరలక్ష్మి శరత్ కుమార్) మనుషులు, ఆవతలి కుటుంబంలోని మనుషులందర్నీ చంపేస్తారు. ఇక చంపాల్సిన వ్యక్తి ఒక్కడు ఉంటాడు. ఆ వ్యక్తికి అండగా రాజా రెడ్డి నిలబడతాడు. ఉన్న ఆ ఒక్క శత్రువుని కూడా చంపాలని భవానీ మనుషులు ప్రతి నిముషం కాచుకొని ఉంటారు.

ఈ క్రమంలో రాజా రెడ్డి అతన్ని కాపాడటానికి ఏం చేశాడు..? రాజా రెడ్డి కొరకు మేరకు.. ఆ వ్యక్తిని బాలు(విశాల్) ఎలా కాపాడాడు ? మళ్లీ ఆ కుటుంబాల మధ్యన ఎలాంటి గొడవలు రాకుండా బాలు ఏమి చేశాడు ? పగతో రగిలిపోయే భవానీ చివరకు పగని వదిలేసి మాములు మనిషిగా మారుతుందా ? బాలు తన తండ్రి కోరికను నేరవేరుస్తాడా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే !

 

ప్లస్ పాయింట్స్ :

 

రాయలసీమకు చెందిన ఓ పవర్ ఫుల్ కుర్రాడి పాత్రలో నటించిన విశాల్, ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, చాలా సహజంగా నటిస్తూ సినిమాకి హైలెట్ గా నిలచారు.

అల్లరి అమ్మాయి అయిన చారుమతి పాత్రలో నటించిన హీరోయిన్ కీర్తీ సురేష్ తన గ్లామర్ తో పాటు, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో.. అచ్చం ఓ పల్లెటూరి అమ్మాయిగా, ఎవరికీ భయపడని చలాకీ అమ్మాయిలా చాలా బాగా నటించింది.

హీరోకి తండ్రి పాత్రలో నటించిన రాజ్ కిరణ్ ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. ఏడు ఊరులకు పెద్దగా.. ఎలాంటి గొడవలు జరగకుండా తాపత్రయపడే ఓ నాయకుడిగా ఆయన చాలా బాగా నటించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆయన నటన చాలా ఎమోషనల్ గానూ ఆకట్టుకుంటుంది.

ఇక సినిమాలో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పగతో రగిలిపోయే ఆడదానిలా.. శత్రువు వంశంలో ఎవ్వర్ని బతకనివ్వకూడదని పట్టు బట్టిన అమ్మాయి పాత్రలో ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణలా నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

దర్శకుడు ఎన్ లింగుస్వామి మొదటి అర్ధభాగాన్ని సరదాగా, కొంచెం ఎమోషనల్ గా నడిపిన ఆయన సెకండాఫ్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో ఆకట్టుకున్నే ప్రయత్నం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు ఎన్ లింగుస్వామి పగకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. హీరో, విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు సినిమాలోని కీలక సన్నివేశాలు కూడా మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి.

అసలు రెండు వంశాలకు మధ్య పుట్టే పగ కూడా అంత బలంగా అనిపించదు. మొదటి భాగంలో హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ సరదాగా సాగినప్పటికీ.. సెకెండాఫ్ లవ్ ట్రాక్ ను ఇంకా ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు. పైగా సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా సాగతీసారు.

ప్రధానంగా సినిమాలో తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. ఆర్టిస్ట్ ల దగ్గరనుంచి వారి హావాభావాలు దాకా తమిళ వాసనలు స్పష్టంగా కనిపిస్తాయి.

 

సాంకేతిక విభాగం :

 

దర్శకుడు లింగుస్వామి కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథా కథనాలని రాసుకోలేకపోయారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటలు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నే విధంగా లేవు.

శక్తివెల్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా పల్లెటూరి విజువల్స్ ను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. కె ఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

విశాల్, కీర్తి సురేష్ జంటగా లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పందెంకోడి 2’ చిత్రంలో కొన్ని మెప్పించే అంశాలు ఉన్నప్పటికీ, ముఖ్యమైన కథనం నెమ్మదిగా సాగడం, తెలుగు నేటివిటీకి సినిమా కొంచెం దూరంగా అనిపించడం.. సినిమాలో మెయిన్ థీమ్ కు తగట్లు ట్రీట్మెంట్ లేకపోవడం వంటి అంశాలు సినిమాకు బలహీనతలుగా నిలుస్తాయి.

అయితే, హీరోహీరోయిన్ల మధ్య కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు విశాల్ కి అతని తండ్రికి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ‘ఏ’ సెంటర్ ప్రేక్షకుల్ని పూర్తిగా మెప్పించలేకపోవచ్చు. కానీ, బీ. సీ సెంటర్ ప్రేక్షకులను.. ముఖ్యంగా పల్లెటూరి ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :