సమీక్ష : ‘పులి – మేక’ – జీ 5 లో తెలుగు వెబ్ సిరీస్

సమీక్ష : ‘పులి – మేక’ – జీ 5 లో తెలుగు వెబ్ సిరీస్

Published on Feb 25, 2023 3:03 AM IST
Puli Meka Web Series Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 24, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి, సుమన్, సిరి హన్మంత్, రాజా చేంబోలు, ముక్కు అవినాష్, సాయి శ్రీనివాస్, గోపరాజు రమణ, స్పందన పల్లి

దర్శకుడు : చక్రవర్తి రెడ్డి

నిర్మాతలు: కోనా ఫిలిం కార్పొరేషన్ (KFC) & జీ 5

సంగీత దర్శకులు: ప్రవీణ్ లక్కరాజు

సినిమాటోగ్రఫీ: రామ్ కె మహేష్

ఎడిటర్: చోట కె ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రస్తుతం మంచి సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5. వారి ఓటిటి లో నేడు ఆడియన్స్ ముందుకి వచ్చిన వెబ్ సిరీస్ పులి మేక. థ్రిల్లింగ్ జానర్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

 

కథ :

హైదరాబాద్ లోని పలువురు పోలీస్ ఆఫీసర్లని ఒక సీరియల్ కిల్లర్ ఒకరి తరువాత మరొకరిని హత్యచేస్తూ ఉంటాడు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. వృత్తి పరంగా మంచి ట్రాక్ రికార్డు కలిగిన ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి) ని ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకునేందుకు స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తారు. అయితే తన టీమ్ తో కలిసి ఆమె ఇన్వెస్టిగేషన్ ప్రారంబించిన సమయంలో ఆమెకు ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ లో హెడ్ గా వర్క్ చేసే ప్రభాకర్ శర్మ (ఆది సాయి కుమార్) సహాయం చేస్తుంటాడు. మరి ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు, అసలు అతడు పోలీస్ డిపార్ట్ మెంట్ ని ఎందుకు టార్గెట్ చేసాడు, ఫైనల్ గా అతడిని కిరణ్ ప్రభ పట్టుకున్నారా లేదా అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఇక ఈసిరీస్ ద్వారా తొలిసారిగా వెబ్ సిరీస్ లో నటించారు ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి. ఇక ఈ సిరీస్ లో కిరణ్ ప్రభ పాత్రలో లావణ్య త్రిపాఠి నటన అమోఘం అనే చెప్పాలి. పలు కీలక సన్నివేశాల్లో ఆమె చేసిన స్టంట్స్ అలానే పండించిన ఎమోషన్స్ ఎంతో బాగున్నాయి. మొత్తంగా ఈ పాత్ర ఆమె కెరీర్ లో బెస్ట్ అని చెప్పాలి. ఆడియన్స్ ని ఆమె నటన ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక చాలా రోజుల తరువాత ఆది సాయి కుమార్ మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో నటించారు. ప్రభాకర్ శర్మ పాత్ర సిరీస్ మొదట్లో వస్తుంది, తనకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ కూడా పాత్ర యొక్క పరిధి మేరకు ఆది సిన్సియర్ గా పెర్ఫార్మ్ చేసారు ని చెప్పాలి. ఇటువంటి డిఫరెంట్ రోల్స్ ఫ్యూచర్ లో ఆది మరిన్ని చేస్తే నటుడిగా ఆయన మంచి స్థాయికి వెళ్లడం ఖాయం. బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ ఈ సిరీస్ లో కీలక రోల్ చేసారు. ఈ సిరీస్ లో పల్లవి పాత్రలో ఆమె కనబరిచిన నటన, ఎమోషన్స్ నిజంగా ఎంతో బాగున్నాయి. ఆమె పాత్ర ఎంట్రీ తో కథ పై మరింతగా ఆసక్తి పెరుగుతుంది. మరొక ముఖ్య పాత్రలో నటించిన సీనియర్ యాక్టర్ సుమన్ ఎంతో బాగా ఆకట్టుకున్నారు. అలానే రాజా చెంబోలు పాత్ర కూడా ఆడియన్స్ ని అలరిస్తుంది. ఈ సిరీస్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ట్విస్ట్ టోటల్ గా పెద్ద ప్లస్ అని చెప్పాలి.

 

మైనస్ పాయింట్స్ :

నిజానికి ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ ని తెరకెక్కించేటపుడు స్క్రిప్ట్ ని పక్కాగా రాసుకోవాలి. ఇక ఈ సిరీస్ ని తీసుకుంటే మొదటి నాలుగు ఎపిసోడ్స్ కొంత స్లో గా సాగుతాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు, కథనం కూడా మెల్లగా సాగుతూ అంతగా ఆడియన్స్ కి కనెక్ట్ కాదు. ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ లో కొన్ని లాజికల్ ఎర్రర్స్ ఉంటాయి. అలానే ఈ సిరీస్ లో కూడా అలాంటివి ఉన్నాయి. ఒక కీలక పాత్ర డ్రగ్స్ కేసులో చిక్కుకుని వార్తల్లో నిలుస్తుంది. విచిత్రంగా అదే నగరంలో నివసిస్తున్న నిందితుల తల్లిదండ్రులకు తప్ప అది అందరికీ తెలుస్తుంది. కొన్ని అనవసరమైన ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు, అలానే స్టోరీ లైన్ కి అవి పెద్దగా అవసరం లేదనిపిస్తుంది. అలానే కొన్ని అన్ పార్లమెంటరీ పదాలు ఆడియన్స్ కి ఇబ్బందికరంగా మారుతాయి. ఇక రన్ టైం విషయంలో కూడా మరింత శ్రద్ద తీసుకుంటే బాగుండేదనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

చాలామంది పెద్ద టెక్నీషియన్స్ పులి మేక సిరీస్ కి వర్క్ చేసారు. వారిలో ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి పనితీరు అయితే ఎంతో బాగుంది. ప్రవీణ్ లక్కరాజు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. కొన్ని కీలక సీన్స్ లో వచ్చే బీజీఎమ్ ఆడియన్స్ ని ఎంతో అలరిస్తుంది. ఇక రామ్ కె మహేష్ ఫోటోగ్రఫి కూడా బాగుంది, విజువల్స్ ఆకట్టుకుంటాయి. అయితే ఎడిటింగ్ విభాగం మాత్రం మరింతగా కేర్ తీసుకుంటే బాగుండేదనిపిస్తుంది. మెయిన్ స్టోరీ యొక్క పాయింట్ ని కోనా వెంకట్, వెంకటేష్ కిలారు బాగా రాసుకున్నారు. ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్‌లు అఫ్ ది అఫ్ ది బాక్స్ కానప్పటికీ, అవి ఒకింత అర్ధవంతంగానే ఉంటాయి, అలానే ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. దర్శకుడు చక్రవర్తి విషయానికి వస్తే, అతను సిరీస్‌తో ఓవరాల్ గా ఓకే అనిపించాడు. బిగినింగ్ ఎపిసోడ్స్ ని హ్యాండిల్ చేసిన విధానం ఆసక్తికరంగా లేదు, అలానే కథనం కూడా నీరసంగా సాగుతుంది.

 

తీర్పు :

మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పులి మేక ఓవరాల్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ప్రధాన పాత్రలు చేసిన లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, అలానే ఇతర పాత్రధారులు అందరూ కూడా తమ పెర్ఫార్మన్స్ లతో ఆడియన్స్ ని అలరిస్తారు. కొన్ని ఎస్పిసోడ్స్ తరువాత వచ్చే ట్విస్టుల అనంతరం కథ పుంజుకుంటుంది. కొన్ని ఎపిసోడ్స్ పర్వాలేదనిపించినా ఫైనల్ గా అయితే ఈ వారం ఫామిలీ తో కలిసి ఈ సిరీస్ చూడొచ్చని చెప్పవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు