లాక్ డౌన్ రివ్యూస్ : ఖరీబ్ ఖరీబ్ సింగిల్ 2017 హిందీ చిత్రం(నెట్ ఫ్లిక్స్)

Published on May 15, 2020 5:07 pm IST

నటీనటులు : ఇర్ఫాన్ ఖాన్, పార్వతి

దర్శకత్వం : తనూజా చంద్ర

నిర్మాతలు : జీ స్టూడియోస్, సుతాపా సిక్దార్, శైల్జా కేజ్రీవాల్ & అజయ్ రాయ్

సంగీతం : అను మాలిక్, రోచక్ కోహ్లీ, విశాల్ మిశ్రా

సినిమాటోగ్రఫీ : ఈషిత్ నరేన్

ఎడిటర్ : చందన్ అరోరా

 

 

లాక్ డౌన్ సిరీస్ లో నెక్స్ట్ 2017లో ఇర్ఫాన్ ఖాన్, పార్వతి జంటగా వచ్చిన రొమాంటిక్ డ్రామా ఖరీబ్ ఖరీబ్ సింగిల్. మరి ఈ మూవీలో ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

ఇన్సూరెన్స్ పాలసీ కంపెనీలో పనిచేసే విడో జయ( పార్వతి తిరువొత్తు) కి ఓ ఆన్లైన్ డేటింగ్ ఆప్ ద్వారా యోగి(ఇర్ఫాన్ ఖాన్) తో పరిచయం ఏర్పడుతుంది. ఒంటరి అయిన జయ ఓ రోజు యోగిని కలవడం జరుగుతుంది. యోగి ఒకప్పుడు తాను ప్రేమించిన ముగ్గురు మాజీ లవర్స్ ని జయకు పరిచయం చేస్తాను అని ఓ ట్రిప్ కి తీసుకెళ్తాడు. ఆ జర్నీ లో జయ మరియు యోగి మానసికంగా దగ్గరవుతారు. అనుకోకుండా కలిసి… ఒకరిపై మరొకరు ప్రేమ పెంచుకున్న ఈ జంట కథ ఎలా ముగిసింది అనేది మిగతా కథ

 

ఏమి బాగుంది?

అందమైన సంభాషలతో సాగే రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రధాన పాత్ర మధ్య వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అనుకోకుండా కలిసిన ఓ జంట మధ్య నడిచే రొమాంటిక్ డ్రామా ఆహ్లాదకరమైన సన్నివేశాలలో నడిపించిన విధానం బాగుంది. ఇక లేట్ ఇర్ఫాన్ ఖాన్ ఎప్పటిలాగే అద్భుత నటనతో కట్టిపడేశారు. హీరోయిన్ గా చేసిన పార్వతి నటన విమర్శకులను మెప్పించక పోయినా, సగటు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. కథలో భాగంగా సాగే సాంగ్స్, బీజీఎమ్ బాగున్నాయి.

 

ఏమి బాగోలేదు?

కొత్తదనం లేని ఓ సాధారణ కథ కావడం ఒక మైనస్ పాయింట్. డైరెక్టర్ తనూజ చంద్ర ఇద్దరు వ్యక్తుల ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్, వ్యక్తిత్వం వంటి విషయాల, చుట్టూ కథ నడిపించారు. డ్రామా లేని ఇలాంటి రొమాంటిక్ స్టోరీ ఓ వర్గం ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. ఇక మూవీ క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా తేల్చివేశారు.

 

చివరి మాటగా
కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ ఆహ్లాదం పంచే సన్నివేశాలు, ఆసక్తి కొలిపే సంభాషణలో ఖరీబ్ ఖరీబ్ సింగిల్ ఒకింత అనుభూతిని పంచుతుంది. ఇర్ఫాన్ ఖాన్ అద్భుత నటన కనబరచిన చిత్రాలలో ఒకటైన ఈ మూవీ ఆయన కోసమైనా ఓ సారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

123telugu.com Rating : 3.5/5

సంబంధిత సమాచారం :

X
More