ఓటిటి సమీక్ష : “రిపీట్” – తెలుగు చిత్రం హాట్ స్టార్ లో

ఓటిటి సమీక్ష : “రిపీట్” – తెలుగు చిత్రం హాట్ స్టార్ లో

Published on Dec 2, 2022 2:01 AM IST
Repeat Movie-Review-In-Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 01, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: నవీన్ చంద్ర, మధు, అచ్యుత్ కుమార్, మైమ్ గోపి, స్మృతి వెంకట్, సత్యం రాజేష్, పూజా రామచంద్రన్

దర్శకుడు : అరవింద్ శ్రీనివాసన్

నిర్మాత: కె విజయ్ పాండే

సంగీత దర్శకులు: జిబ్రాన్

సినిమాటోగ్రఫీ: పీజీ ముత్తయ్య

ఎడిటర్: అరుల్ ఈ సిద్ధార్థ్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

లేటెస్ట్ గా థియేటర్స్ లో సహా ఓటిటి లో కూడా పలు చిత్రాలు వస్తున్నాయి. మరి అలా ప్రముఖ ఓటిటి యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో వచ్చిన చిత్రం “రిపీట్”. నటీనటులు నవీన్ చంద్ర, మధూ లు నటించిన ఈ తెలుగు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. సుబ్రహ్మణ్యం(అచ్యుత్ కుమార్) అనే ఓ నవల రచయిత తాను ఊహించి రాసుకునే కొన్ని పాత్రలు కథలు నిజ జీవితంలో కూడా జరిగినట్టుగా అతనికి ప్రమాదం ఉన్నట్టుగా అతనికి తెలుస్తుంది. అయితే ఈ విషయాన్నే తాను పోలీసులకి చెప్పగా వారైతే నమ్మరు. కానీ అనుకోని విధంగా తాను రాసినట్టుగానే డీజీపీ ఆశా(మధూ) కూతరు కిడ్నాప్ కావడం అందరికీ షాకిస్తుంది. దీనితో ఈ కిడ్నాప్ సుబ్రమణ్యమే చేసాడని వారు నమ్ముతారు కానీ దానికి సరైన ఆధారాలు వారు పట్టుకోలేకపోతారు. దీనితో ఈ సస్పెన్స్ గా మారిన ఈ కేసుని ఓ అండర్ కవర్ పోలీస్ విక్రమ్(నవీన్ చంద్ర) కి అప్పగిస్తారు. మరి విక్రమ్ ఈ కేసును సాల్వ్ చేస్తాడా? ఆ పాపని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు సుబ్రహ్మణ్యం నవలలు నిజం అవుతున్నాయి అనేది తెలియాలి ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఇది వరకే పోలీస్ రోల్ లో నవీన్ చంద్ర పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని ప్రూవ్ చేసాడు. అలాగే ఈ చిత్రంలో కూడా ఓ అండర్ కవర్ పోలీస్ గా అయితే తాను మరోసారి సాలిడ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. అలాగే తన లుక్స్, బాడీ లాంగ్వేజ్ మరియు నటన అన్నీ బాగున్నాయి. అలాగే చాలా సీన్స్ లో అయితే సినిమాని తన ఈజ్ పెర్ఫామెన్స్ తో లాక్కొచ్చాడని చెప్పొచ్చు.

అలాగే ఇతర నటులు మధూ అచ్యుత్ లు తమ పాత్రల్లో కంప్లీట్ గా ఇమిడిపోయారు. చాలా నాచురల్ పెర్ఫామెన్స్ ని అయితే వారు కనబరిచారు. అలాగే ఇతర పాత్రధారులు సత్యం రాజేష్ పూజా రామచంద్రన్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. ఇక సినిమాలో మెయిన్ నరేషన్ అంతా కూడా సెకండాఫ్ మొదలు నుంచి బాగుంది.

మంచి ట్విస్టులు ఆసక్తికర నరేషన్ కనిపిస్తుంది. దీనితో ఇక్కడ కథనం అంతా మంచి ఎంగేజింగ్ గా ఉండగా ఫైనల్ ట్విస్ట్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే చాలా వరకు కొన్ని ట్విస్ట్ లు అయితే మాంచి సర్ప్రైజింగ్ గా కూడా అనిపించడం ఈ చిత్రంలో మరో హైలైట్. ఇంకా అక్కడక్కడా సినిమాలో కామెడీ బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రం హిట్ సినిమా డేజావు కి రీమేక్ గా తెలుగులో తీశారు. అయితే రీమేక్ అన్నాక చాలా వరకు మేకర్స్ మార్పులు చేర్పులు చేస్తారు కానీ ఈ చిత్రం సగం వండి వార్చినట్టుగా అనిపిస్తుంది. చాలా వరకు సీన్స్ ని కొత్తగా తీయలేదు.. ఏవో కొన్ని సన్నివేశాలు మాత్రమే షూట్ చేశారు కానీ మిగతా ఇతర సీన్స్ అన్నీ ఒరిజినల్ నుంచే కనిపిస్తాయి ఇది ఓ బ్లండర్ కాగా..

సినిమాలో మెయిన్ థీమ్ కూడా అంత అనుకున్న రేంజ్ లో కనిపించదు. అలాగే స్టార్టింగ్ కాస్త బాగానే అనిపించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్ తర్వాత సన్నగిల్లుతాయి. దీనితో కాస్త బోర్ అనిపించే ఛాన్స్ ఉంది. పైగా రిపీటెడ్ సీన్స్ మూలాన మరింత ఆసక్తి తగ్గుతుంది. అలాగే కొన్ని సీన్స్ లో కనెక్షన్ ఇంకా క్లారిటీ గా చూపించి ఉంటే బాగుండేది.

అలాగే ఇది తెలుగులో తీసిన సినిమానే అన్నట్టుగా కూడా పెద్దగా అనిపించదు. ఇంకా లాజిక్స్ కూడా ఓ పరిధి దాటాక ఎక్కడికో వెళ్లిపోతాయి. ఒరిజినల్ లో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో రీమేక్ లో వాటిని కరెక్ట్ చేసి గాని ఇంప్రూవ్ చేసి కానీ చూపించకపోవడం మరో బ్లండర్.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పొచ్చు. అలాగే టెక్నీకల్ టీం లో జిబ్రాన్ సంగీతం కోసం చెప్పుకోవాలి. సినిమాలో టెన్స్ కి తగ్గట్టుగా తాను ఇచ్చిన స్కోర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ముత్తయ్య ఇచ్చిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు అరవింద్ శ్రీనివాసన్ విషయానికి వస్తే తాను రాసుకున్న పాయింట్ ని అయితే పూర్తి స్థాయిలో ఆసక్తిగా చిత్రీకరించడంలో తడబడ్డారని చెప్పక తప్పదు. కొన్ని సన్నివేశాలు ట్విస్టులు మంచి ఆసక్తిగా అనిపిస్తాయి కానీ ఇదే క్లారిటీ ని సినిమా అంతా తాను మైంటైన్ చేయలేకపోయారు. ఆ మిస్టేక్స్ అన్నీ కూడా తాను సెట్ చేసుకొని ఉంటే ఈ థ్రిల్లర్ మావో లెవెల్లో ఉండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూస్తే ఈ “రిపీట్” చిత్రంలో నవీన్ చంద్ర సిన్సియర్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది అలాగే కొన్ని ట్విస్టులు అక్కడక్కడా ఆసక్తిగా నడిచే కథనాలు థ్రిల్ చేస్తాయి. కాకపోతే కొన్ని ఒరిజినల్ లో ఉన్న సేమ్ సీన్స్, లాజిక్స్ మిస్ అవ్వడం పక్కన పెడితే ఓటిటిలో ఈ చిత్రం ఒక్కసారి చూడడానికి పర్వాలేదు అనిపిస్తుంది.

 

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు