సమీక్ష : అందాల రాక్షసి – అందమైన విషాద ప్రేమకథ

విడుదల తేది : 9 ఆగష్టు 2012
123తెలుగు.కాం రేటింగ్: 2.75 /5
దర్శకుడు : హను రాఘపూడి
నిర్మాతలు : సాయి కొర్రపాటి
సంగీతం : రథన్
నటీనటులు : నవీన్, రాహుల్ మరియు లావణ్య

ఈ మధ్య కాలంలో విడుదలకు ముందు ఏ చిన్న చిత్రానికి రాని స్పందన ఈ చిత్రానికి వచ్చింది. ‘ఈగ’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి కొర్రపాటి నిర్మాతగా, ఎస్.ఎస్ రాజమౌళి సహా నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘అందాల రాక్షసి’. నవీన్, రాహుల్ మరియు అందాల భామ లావణ్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర ట్రైలర్స్ చూసినప్పటి నుంచి సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఈ రోజు ‘అందాల రాక్షసి’ చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదలైంది.ఇప్పడు ఈ చిత్రం ఎలా ఉందో? సినిమాలో లావణ్యని అందాల రాక్షసి అని ఎందుకన్నారో? చూసేద్దామా…

కథ :

అందాల రాక్షసి చిత్రంలో ఒకే సాదారణ పాయింట్ మీద రెండు ప్రేమ కథలను చూపించారు. ఈ చిత్ర కథ మొత్తం ఒక చిన్న టౌన్ అమ్మాయి అయిన మిథున (లావణ్య) చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గిటారిస్ట్ గా పనిచేసే గౌతమ్ (రాహుల్) మరియు స్క్రాప్ ఆర్టిస్ట్ అయినటువంటి సూర్య (నవీన్) లు మిథున ప్రేమలో పడతారు. మిథున వారిద్దరూ కోసం ఏదైనా చెయ్య వచ్చు అని అనుకుంటుంది కానీ వారిద్దరికీ పరిచయం ఉండదు.

మిథున సూర్యని ప్రేమిస్తుంది. సూర్య మరియు మిథున మధ్య ఒక మంచి రొమాంటిక్ ట్రాక్ జరుగుతూ ఉండగా ఒక ఊహించని మలుపు వస్తుంది. ఆ తర్వాత గౌతమ్ మిథున జీవితంలోకి వస్తాడు. మిథున గౌతమ్ యొక్క భావాలను మరియు అతనికి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది. మామూలుగా నిజమైన ప్రేమ పూర్తి రూపం దాల్చదు అందుకేనేమో చివరికి వీరిద్దరి మధ్య కూడా సమస్యలు వచ్చి కొంచెం భాదగా కథ ముగుస్తుంది.
ఇంతకీ సూర్య మరియు మిథునల మధ్య ఏం జరిగింది? అసలు మిథున జీవితంలో నుండి సూర్య ఎందుకు వెళ్ళిపోయాడు మరియు గౌతమ్ ఎలా మిథున జీవితంలోకి వచ్చాడు? అనే మిగిలిన కథని మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

లావణ్య ఈ సినిమాలో వర్ణించలేనంత అందంగా ఉంది. లావణ్య నటన చాలా బాగుంది మరియు ఆమె చేసిన మిథున పాత్రకి గాను విమర్శకుల నుండి మంచి అభినందనలు అందుకుంటుంది. ఈ చిత్రంలో లావణ్య చాలా అమాయకత్వమైన ముఖంతో చూడముచ్చటగా ఉంది. ఈ చిత్రం తర్వాత భవిష్యత్తులో తనకి ఇలాంటి పాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా రావచ్చు. సూర్య పాత్రలో నవీన్ చాలా బాగా చేశాడు. ఈ పాత్రకి కావలసిన ఎంతో కఠినమైన మరియు మంచి భారీ ఆకారం అతనికి ఉంది. ఈ చిత్రానికి ఇతని పాత్రే కీలకం. ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో నవీన్ కథలోకి వచ్చిన తర్వాత సినిమా చాలా వేగంగా ముందుకెలుతుంది. లావణ్య మరియు నవీన్ ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. సి.వి.ఎల్ నారాయణ నటన పరవాలేదనిపించాగా మరియు ప్రగతి నటన బాగుంది. రాహుల్ నాన్న గారి పాత్ర చేసిన యాక్టర్ నటన బాగుంది.

ఈ చిత్రంలో అందమైన విజువల్స్ మరియు సాంకేతిక విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఫోటోగ్రఫి ని అమితంగా ఇష్టపడే వారు ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేం ని మెచ్చుకుంటారు. ఈ చిత్ర రెండవ అర్ధభాగం చాలా బాగుంది. రెండవ అర్ధభాగంలో వచ్చే ఒక పెళ్ళిచూపుల సన్నివేశంలో విజయ్ ఎంట్రీ ఉంటుంది మరియు విజయ్ ప్రేక్షకులను బాగా నవ్వించాడు. పాటలను బాగా చిత్రీకరించారు మరియు ప్రతి ఫ్రేం ఒక కవిత్వంలా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

అందమైన విజువల్స్ మరియు సాంకేతిక విలువలు చాలా ఉన్నతంగా ఉన్న ఈ సినిమా మొదటి అర్ధభాగం చాలా నిధానంగా సాగటం అనే విషయం ఎంతో భాదాకరమైనది. మొదటి అర్ధభాగంలో కథ అనేది ఏమీ చెప్పరు మరియు లావణ్య మరియు రాహుల్ మధ్య భావోద్వేగపూరితమైన సన్నివేశాలు ఉంటే బాగుండేది. మొదటి అర్ధభాగం వేగం పెంచడం కోసం సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిటర్ కత్తిరిస్తే బాగుంటుంది.

ఈ చిత్రంలో రాహుల్ పాత్ర చాలా వీక్ గా ఉంటుంది. రాహుల్ చూడటానికి చాలా బాగున్నాడు కానీ అతను డైలాగ్ డెలివరీ మీద శ్రద్ద వహిస్తే బాగుంటుంది. అతను ప్రతి డైలాగ్ ని అరిచినట్టు చెబుతుంటాడు, ఇది ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. అతని వాయిస్ కొంచెం సిద్దార్థ్ ని పోలి ఉంటుంది కానీ అది అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఈ చిత్ర క్లైమాక్స్ కూడా మన ప్రేక్షకులకు మింగుడుపడదు. ఇలా ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునే సన్నివేశాలు క్లైమాక్స్ లో ఉన్నప్పుడు దానికి ముందు ప్రధాన పాత్రల మధ్య మరిన్ని భావోద్వేగాలు పలికించి ఉంటే బాగుండేది. అందువల్ల క్లైమాక్స్ అంత దృడంగా లేదు. ఈ చిత్రంలో ‘చచ్చిపోతా’ అనే డైలాగ్ చాలా సార్లు వస్తుంది అందువల్లా ప్రేక్షకుడికి వీళ్ళు ఆ డైలాగ్ మార్చారా అనే భావన వస్తుంది.

సాంకేతిక విభాగం :

అందాల రాక్షసి పేరుకి చిన్న చిత్రమే అయినా ఇందులో నిర్మాణ విలువలు మాత్రం ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. మురళి అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతం ప్రతి ఫ్రేం ఉన్నతంగా మరియు కలర్ ఫుల్ గా చూపించారు. ఎడిటింగ్ విభాగం మరింత శ్రద్ద తీసుకోనవలసింది ఈ విభాగం కాస్త బలహీనమైన ప్రదర్శన కనబరిచింది. డైలాగ్స్ పరవాలేదనిపించాయి. హను రాఘవపుడి దర్శకత్వం చాలా బాగుంది ప్రతి బ్లాక్ కంపోజిషన్లో తనదయిన ప్రత్యేకతను చూపించాడు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సింది.

తీర్పు :

అందాల రాక్షసి చిత్రం సాంకేతికంగా ఉన్నతమయిన చిత్రమే అయిన నేరేషన్ చాలా నిదానంగా ఉండడం మరియు బోరింగ్ ఫస్ట్ హాఫ్ చిత్రానికి పెద్ద మైనస్. రెండవ అర్ధ భాగం బాగుండటం, లావణ్య మరియు నవీన్ ల నటన ఈ చిత్రానికి కాస్త సహాయపడింది. మీరు సినిమా ప్రేమికులయితే, ఫిలిం మేకింగ్ విషయాల మీద పట్టు ఉంటే ఈ చిత్రాన్ని చుడండి. ఈ చిత్రాన్ని బి మరియు సి సెంటర్లలో ఆదరించే అవకాశాలు తక్కువ.

123తెలుగు.కాం రేటింగ్: 2.75/5

అనువాదం : రాఘవ

 

Click Here For ‘Andhala Rakshasi’ English Review

సంబంధిత సమాచారం :