సమీక్ష : మిస్టర్ నూకయ్య – స్టైలిష్ నూకయ్య

సమీక్ష : మిస్టర్ నూకయ్య – స్టైలిష్ నూకయ్య

Published on Mar 8, 2012 9:42 PM IST
విడుదల తేది : 8 మార్చి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3/5
దర్శకుడు : అనీల్ కన్నెగంటి
నిర్మాత : డి ఎస్ రావు
సంగిత డైరెక్టర్ : యువన్ శంకర్ రాజ
తారాగణం : మంచు మనోజ్, కృతి ఖర్బంద, సనా ఖాన్

మంచు మనోజ్, సనా ఖాన్ మరియు కృతి ఖర్బంధ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ నూకయ్య’. గతంలో ‘అసాధ్యుడు’ వంటి చిత్రాన్ని దర్శకత్వం వహించిన అని కన్నెగంటి దర్శకత్వంలో డి.ఎస్. రావు నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ చిత్రం ఈ రోజే విడుదలవగా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

నూకయ్య (మనోజ్) ఒక సెల్ ఫోన్ దొంగ. నూకయ్య అని పిలిపించుకోవడం ఇష్టం లేని నూకయ్య తనని తను స్టైల్ గా ‘నోకియా’ అని పిలుచుకుంటాడు. మంచి మనసున్న అతను తన స్నేహితులు నాంపల్లి (పరుచూరి వెంకటేశ్వరరావు) మరియు చిచా (వెన్నెల కిషోర్) తో కలిసి ఉంటూ ఎవరూ లేని అనాధ పిల్లల్ని చేరదీస్తాడు. పబ్ లో పని చేసే ‘సనా’ని నోకియా ప్రాణంగా ప్రేమిస్తాడు. సనా మాత్రం నోకియాని జీవితంలో బాగా డబ్బు సంపాదించి హొదా, కారు వంటివి సంపాదించమని కోరుతుంది. నోకియా ఆ వైపుగా ప్రయాణం మొదలు పెడతాడు. మరో వైపు కొత్తగా పెళ్ళయిన అను (కృతి కర్బంధ) మరియు కిరణ్ (రాజా) బెంగుళూరు ట్రిప్ కి వెళుతుండగా మురళి శర్మ మరియు అతని గ్యాంగ్ కిరణ్ ని కిడ్నాప్ చేస్తారు. కిరణ్ ని కిడ్నాప్ చేసిన ఆ గ్యాంగ్ 2 కోట్ల రూపాయల డబ్బు అడుగుతారు. అనుకోని మలుపుతో నోకియా మరియు అను ఇద్దరు కలుసుకుంటారు. వారి ప్రయత్నాలు సఫలం అయ్యాయా? అను తన భర్త కిరణ్ ని కిడ్నాప్ నుండి తప్పించగలిగిందా? నోకియా తన ప్రేయసి సనా ని పెళ్లి చేసుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

మనోజ్ తనకు ఇచ్చిన నోకియా పాత్రని సమర్ధవంతంగా పోషించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అధ్బుతంగా నటించి ప్రేక్షకులను బాగా అలరించాడు. సినిమాలో భయంకరమైన యాక్షన్ సన్నివేశాల్లో ఎలాంటి డూప్ సహాయం లేకుండా నటించి ఆశ్చర్య పరిచాడు. అతని గత చిత్రం ‘బిందాస్’ నుండి ప్రారంభించిన కొత్త తరహా డైలాగ్ డెలివరీ బావుంది. అతని కామెడి టైమింగ్ కూడా బావుంది. సనా ఖాన్ చిన్న పాత్ర పోషించిన అందంగా కనిపించింది. ముఖ్యంగా ‘పిస్తా పిస్తా’ పాటలో యువకుల హృదయాలను కొల్లగొట్టింది. కృతి కర్బంధ క్యుట్ గా అందంగా ఉంది. ఈ సినిమాలో ఆమెకి పెద్ద పాత్రే దక్కింది. మనోజ్ స్నేహితులుగా వెన్నెల కిషోర్ మరియు పరుచూరి వెంకటేశ్వరరావు బాగానే నవ్వించారు. కిరణ్ పాత్రలో రాజా బాగానే నటించాడు. అతను ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇది ప్రత్యేకం అని చెప్పాలి. ఆహుతి ప్రసాద్ చిన్న పాత్రలో నవ్వించాడు. స్టంట్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. కార్ రేస్ సన్నివేశాలు అధ్బుతంగా తెరకెక్కించారు. పాటల చిత్రీకరణ మరియు కెమెరా యాంగిల్స్ కొత్త అనుబూతిని పంచుతాయి.

మైనస్ పాయింట్స్:

చిత్ర మొదటి భాగంలో కథనం వేగం తగ్గింది. కొన్ని సన్నివేశాలు బాగా తీసినప్పటికీ స్క్రీన్ప్లే లో బిగి లేకపోవడంతో వృధా అయిపోయాయి. మురళి శర్మ పాత్ర పాత చింతకాయ పచ్చడి లాగా రొటీన్ గా ఉంది. కథలో కొన్ని అనుకోని మలుపులు తప్ప కొత్తదనం కొరవడింది. తరువాత జరగబోయే సన్నివేశాన్ని ప్రేక్షకుడు అంచనా వేయగలుగుతాడు. బ్రహ్మానందం పాత్ర ఎందుకు పనికిరాకుండా పోయింది. బ్రహ్మాజీ ఇలాంటి పాత్రలు అంగీకరించకుంటే బావుంటుంది. స్క్రీన్ప్లే చాలా లోపాలున్నాయి.ముఖ్యంగా చిత్ర రెండవ భాగంలో సాంగ్స్ టైమింగ్ సరిగా లేదు. సనా ఖాన్ పాత్ర తీర్చి దిద్దిన విధానం సరిగా లేదు. మనోజ్ తో ఆమె రొమాంటిక్ ట్రాక్ ఇంకా బాగా తీసి ఉంటే బావుండేది. సినిమా అంతా స్టైలిష్ గా తీస్తూ పాటల చిత్రీకరణ కూడా బాగా తీసి ఎ సెంటర్ ప్రేక్షకులని మాత్రమే ఆకట్టుకున్నారు కానీ బి, సి సెంటర్ ప్రేక్షకులను మాత్రం ఆకర్షించడంలో విఫలమయ్యారు.

సాంకేతిక విభాగం:

సినిమా అంతా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కింది. నిర్మాణాత్మక విలువలు చాలా బావున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా అందంగా సాగుతూ కొన్ని సన్నివేశాలు కన్నుల విందు చేస్తాయి. ఎడిటింగ్ ఇంకా బాగా చేసి ఉంటే బావుండేది. మొదటి భాగంలో ఎడిటింగ్ అయితే కొంత చిరాకు తెప్పిస్తుంది. డైలాగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. స్టంట్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గ్రాఫిక్స్ వర్క్ కూడా బావుంది.

తీర్పు:

మిస్టర్ నూకయ్య స్టైలిష్ గా తెరకెక్కిన చిత్రం. మనోజ్ నటన, అతున్నత సాంకేతిక విలువలు, సనా ఖాన్ గ్లామర్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. స్క్రీన్ప్లే బిగిగా ఉండి, కథనం ఇంకా బావుంది ఉంటే ఇంకా బావుండేది. ఎ సెంటర్ ప్రేక్షకులకు నచ్చే టేకింగ్ విధానంతో తెరకెక్కిన మిస్టర్ నూకయ్యని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలి.

123తెలుగు.కాం రేటింగ్ : 3/5

అనువాదం : అశోక్ రెడ్డి

Clicke Here For ‘Mr Nookayya’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు