లాక్ డౌన్ రివ్యూ : ఓ మై కడవులే- తమిళ్ ఫిల్మ్(జీ5)

లాక్ డౌన్ రివ్యూ : ఓ మై కడవులే- తమిళ్ ఫిల్మ్(జీ5)

Published on Aug 5, 2020 7:28 PM IST

 

నటీనటులు: అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్, షా రా

దర్శకత్వం : అశ్వత్ మారిముత్తు

నిర్మాతలు : జి. దిల్లీ బాబు, హ్యాపీ హై పిక్చర్స్, అశోక్ సెల్వన్ & అబినయ సెల్వం

సంగీతం : లియోన్ జేమ్స్

సినిమాటోగ్రఫీ : విధు అయ్యన్న

ఎడిట్ చేసినవారు : బూపతి సెల్వరాజ్

 

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు తమిళ చిత్రం ఓ మై కడవులే ని ఎంచుకోవడం జరిగింది. జీ5లో అందుబాటులో ఉన్న ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం

 

కథాంశం ఏమిటీ?

చిన్ననాటి మితృలు అయిన అర్జున్(అశోక్ సెల్వన్) అను(రితిక సింగ్) పెళ్లి చేసుకుంటారు. ఐతే వీరి కాపురంలో అన్ని కలహాలే. దీనితో ఇద్దరు విడాకులు తీసుకోవాలని అనుకుంటారు. అశోక్ లాయర్ కడవులే(విజయ్ సేతుపతి)ని కలుస్తాడు. నిజానికి కడవులే లాయర్ రోపంలో ఉన్న దేవుడు. దీనితో అశోక్ గతంలో చేసిన మిస్టేక్స్ సరిదిద్దుకునే అవకాశం ఇస్తాడు. మరి దేవుడు ఇచ్చిన ఆ అవకాశాన్ని అశోక్ ఎలా ఉపయోగించుకున్నాడు. చివరికి అశోక్, అనుల కథ ఎలా ముగిసింది అనేది మిగతా కథ…

 

ఏమి బాగుంది?

ఈ మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. దానిని దర్శకుడు హ్యూమర్ మరియు ఎమోషన్స్ జోడించి చక్కగా చెప్పాడు. దర్శకుడు అర్జున్ మారిముత్తు నెరేషన్ అద్బుతం.

హీరోగా చేసిన అశోక్ సెల్వన్, నటన ఆకట్టుకుంటుంది. అలాగే రితిక సింగ్ ఫ్రస్ట్రేటెడ్ వైఫ్ పాత్రలో మెప్పించింది. మరో హీరోయిన్ గా చేసిన వాణి భోజన్ నటన కూడా చెప్పుకోదగ్గ అంశం.

చివరిగా కడవులే పాత్రలో విజయ్ సేతుపతి మెప్పించారు. విజయ్ సేతుపతి, అశోక్ సెల్వన్ కాంబినేషన్ సన్నివేశాలు మంచి వినోదం పంచాయి.

 

ఏమి బాగోలేదు?

అద్భుతమైన ఫస్ట్ హాఫ్ తరువాత సెకండ్ హాఫ్ మూవీ ఆ వేగం కొనసాగించలేకపోయింది. ఇక కొన్ని రొమాంటికి సీన్స్ రొటీన్ గా ఉన్నాయి. అలాగే రితిక క్యారెక్టర్ కొంచెం లోతుగా రాసుకొని ఉంటే ఎమోషన్స్ మరింత పండేవి.

 

చివరి మాటగా

మొత్తంగా ఓ మై కడవులే ఆద్యంతం అలరించే రొమాంటిక్ కామెడీ డ్రామా అని చెప్పాలి. ప్రధాన పాత్రల నటనతో పాటు విజయ్ సేతుపతి రోల్ మూవీలో ఆకట్టుకొనే అంశాలు. సెకండ్ హాఫ్ లో నెమ్మదించిన కథనం, అంచనాలకు అందే రొటీన్ సన్నివేశాలు కొంచెం నిరాశపరిచే అంశాలు. ఈ లాక్ డౌన్ సమయంలో ఈ మూవీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి.

Rating: 3.25/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు