సమీక్ష : రోబర్ట్ – ఆలోచన బాగున్నా.. అటెంప్ట్ బాగోలేదు

సమీక్ష : రోబర్ట్ – ఆలోచన బాగున్నా.. అటెంప్ట్ బాగోలేదు

Published on Mar 12, 2021 3:20 AM IST
Roberrt movie review

విడుదల తేదీ : మార్చి 11, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు : దర్శన్, వినోద్ ప్రభాకర్, ఆశాభట్, జగపతి బాబు, రవి కిషన్, రవి శంకర్ మరియు తదితరులు

దర్శకత్వం : తరుణ్ కిషోర్ సుధీర్

నిర్మాత‌లు : ఉమాపతి శ్రీనివాస్ గౌడ

సంగీతం : అర్జున్ జన్య

సినిమాటోగ్రఫీ : సుధాకర్ ఎస్ రాజ్

ఎడిటింగ్ : కె ఎమ్ ప్రకాశ్

కన్నడ స్టార్ దర్శన్ హీరోగా నటించిన కొత్త చిత్రం రాబర్ట్. ఈ రోజు అదే టైటిల్‌తో తెలుగులో కూడా ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో, ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి.

కథ:

ఉత్తరప్రదేశ్ బ్యాక్ డ్రాప్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రాఘవ (దర్శన్) అనే వ్యక్తి యొక్క పాత్రతో ప్రారంభమవుతుంది. ఓ ఫుడ్ క్యాటరింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న రాఘవ తన ఐదేళ్ల కుమారుడు అర్జున్‌తో కలిసి సాదా సీదా జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే ఒక రోజు రాఘవ త్రిపాఠి (రవి కిషన్) అనే రాజకీయ నాయకుడిని కొన్ని అనివార్యమైన పరిస్థితులలో చంపేస్తాడు. అయితే అసలు రాఘవ ఎవరు? అతని గతం ఏమిటి? త్రిపాఠి అనే రాజకీయ నాయకుడిని ఎందుకు చంపాల్సి వచ్చింది? నానా (జగపతి బాబు) అనే గ్యాంగ్‌స్టర్ కథ ఏమిటి? అన్న విషయాలు పూర్తిగా తెలియాలి అంటే ఈ సినిమాను వెండి తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

లుక్స్ పరంగా హీరో దర్శన్ ఫిట్ గా ఉన్నాడు మరియు సినిమా అంతటా తన స్క్రీన్ ఉనికితో ఆకట్టుకుంటాడు. అతని మేక్ఓవర్ మరియు రెండు విభిన్న పాత్రలలోని వైవిధ్యాలు అతని అభిమానులకు బాగా నచ్చుతాయి. అలాగే ఇంట్రడక్షన్ సాంగ్ లో హనుమంతుడి గెటప్‌లో ఎంట్రీ బాగుంది.

ప్రీ-ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ బాగా చిత్రీకరించబడింది. ద్వితీయార్ధంలో రాబర్ట్‌గా దర్శన్ చేసిన మేక్ఓవర్ మరియు కొన్ని గ్యాంగ్‌స్టర్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతాయి.

ఇక జగపతి బాబు, రవిశంకర్ వంటి స్టార్ నటులు ఆకట్టుకున్నారు. మిగతా నటులు వినోద్ ప్రభాకర్, ఆశా భట్, సోనాల్ మాంటెరో, ఐశ్వర్య ప్రసాద్ వంటి నటులు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం ఇద్దరు చిన్ననాటి స్నేహితుల మధ్య స్నేహం ఆధారంగా తీసిన పగ నాటకం అయినప్పటికీ, దానికి సంబంధించిన సన్నివేశాలు సరైన పద్ధతిలో చూపించలేకపోయారు.

ఇక ప్రీ-ఇంటర్వెల్ ఫైట్ తప్పా ఫస్టాఫ్‌లో కొత్తగా ఏమీ అనిపించేలేదు. ఇదే ఈ చిత్రానికి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా పది నిమిషాల తర్వాత దర్శన్ పాత్రకు విచారకరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉందని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు మరియు మిగతా పాత్రలు రివీల్ అయ్యే వరకు వేచి ఉండడం తప్ప వేరే మార్గం లేదు. ఇది చిత్రంలోని ప్రధాన అంశాన్ని ఆలస్యం చేస్తుంది.

సాంకేతిక విభాగం:

స్నేహం ఆధారంగా సినిమా తీయాలనే దర్శకుడు తరుణ్ సుధీర్ ఆలోచన బాగుంది కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కాన్సెప్ట్ ను అమలు చేయడంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు.

కథానాయకుడు మరియు విరోధి మధ్య ఘర్షణ ఎపిసోడ్ల రూపకల్పనలో అతను మంచి మార్గంలో పనిచేయాలి కానీ పాపం మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక కె.ఎమ్. ప్రకాష్ ఎడిటింగ్ కూడా సరైనదిగానే ఉందని చెప్పాలి.

సుధాకర్ ఎస్ రాజ్ సినిమాటోగ్రఫీ మర్యాదగా ఉంది, ఎందుకంటే అతని పని కొన్ని పాటలు మరియు యాక్షన్ సన్నివేశాలలో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక వి. హరికృష్ణ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది మరియు పాటల కోసం అర్జున్ జన్య సంగీతం విషయంలో కూడా ఇది బాగా ఉపయోగపడింది. ఏదేమైనా ఈ స్టార్ నటుడి చిత్రానికి నిర్మాణ విలువలు కూడా విలాసవంతంగానే ఉన్నాయి.

తీర్పు:

మొత్తంగా చూసుకున్నట్టయితే రాబర్ట్ సినిమా స్నేహం అనే భావన చుట్టూ తిరిగే రెగ్యులర్ రివేంజ్ డ్రామా. రెండు భాగాలలోని కొన్ని సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నప్పటికి, రేసీ స్క్రీన్ ప్లే లేకపోవడం మరియు నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్ అయ్యిందని చెప్పాలి. ఏదేమినా సినిమాపై పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒకసారి చూడొచ్చు.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు