ఓటిటి సమీక్ష : రాశి ఖన్నా “రుద్ర” – హిందీ సిరీస్ హాట్ స్టార్ లో

Published on Mar 5, 2022 5:01 pm IST

123telugu.com Rating : 2.75/5

నటీనటులు: అజయ్ దేవగన్, ఈషా డియోల్, రాశి ఖన్నా, అతుల్ కులకర్ణి, అశ్విని కల్సేకర్, ఆశిష్ విద్యార్థి

దర్శకుడు: రాజేష్ మపుస్కర్

నిర్మాత: సమీర్ నాయర్

తాజాగా ఓటిటి లో రిలీజ్ అయ్యిన సరికొత్త ఇంట్రెస్టింగ్ సిరీస్ “రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్”. స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా మొదటి ఓటిటి ఎంట్రీ గా అలాగే బాలీవుడ్ బిగ్ స్టార్ అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. రుద్ర(అజయ్ దేవగన్) ఒక సస్పెన్షన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్. కానీ అనూహ్యంగా ముంబై నగరంలో పెద్ద ఎత్తున క్రైమ్ పెరిగిపోతుండడంతో మళ్ళీ పోలీస్ శాఖ వారు రుద్ర ని అపాయింట్ చేస్తారు. కానీ చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉన్న రుద్ర ఓ సైకో ఆలియా (రాశీ ఖన్నా) ని కలుస్తాడు. అలాగే ఆమెతో పాటు మరికొంతమంది రుద్ర లైఫ్ లోకి వస్తారు ఇలా వారితో మరోపక్క తనకి ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడతాడు. మరి ఈ ఎక్కువయ్యిపోతున్న సమస్యలతో రుద్ర ఎలా డీల్ చేసాడు. ఇంతకీ ఆ క్రైమ్స్ ని ఆపగలిగాడా? దాని వెనుక ఉంది ఎవరు? రాశీ ఖన్నా పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

మొదటగా ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ అజయ్ దేవగన్ కోసం మాట్లాడుకున్నట్టయితే ఈ సిరీస్ లో తానే బిగ్ ప్లస్ అని చెప్పాలి. ఆల్రెడీ ఒక సిన్సియర్ కాప్ రోల్ లో తాను కనిపించి అదరగొట్టాడు. అలానే ఈసారి ఓటిటి లో కూడా సాలిడ్ పోలీస్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ రోల్ లోని డీప్ ఎమోషన్స్ ని అజయ్ దేవగన్ చాలా బాగా చూపించడం బాగుంది. అలాగే తన సింపుల్ లుక్స్ కూడా ఈ షో వాతావరణంకి తగ్గట్టు బాగున్నాయి.

అలాగే ఈ సిరీస్ పై మరింత ఆసక్తి నెలకొనడానికి కారణం హీరోయిన్ రాశీ ఖన్నా. మరి ఈమె కోసం చెప్పాలి అంటే ఈ సిరీస్ లో కంప్లీట్ గా ఒక కొత్త రాశీ ని చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఒక సరికొత్త గెటప్ లో పైగా సైకో రోల్ లో కనిపించి ఆశ్చర్యపరుస్తుంది. అలాగే అజయ్ దేవగన్ తో కలిపి ఉన్న సీన్స్ మంచి ఆసక్తిగా ఉన్నాయి. ఇంకా మెల్లగా ఆమె పాత్ర మంచి ఇంటెన్స్ గా మారుతుంది.

అలాగే ఇతర నటులు అతుల్ కులకర్ణి మరియు అశ్వని కలశేఖర్ లు తమ పాత్రల్లో సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారు. అలాగే ఈ సిరీస్ లో మరో హైలైట్ గా కనిపించే సెటప్ అని చెప్పాలి. మొదటి ఎపిసోడ్స్ అయితే మంచి ఎంగేజింగ్ గా అనిపిస్తాయి అలాగే మరికొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంప్రెస్ చేస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ కంప్లీట్ సిరీస్ లో అతి పెద్ద డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే ప్రతి ఎపిసోడ్ తాలుకా నిడివి అని చెప్పాలి. ప్రతి ఎపిసోడ్ కూడా చాలా పెద్దగా ప్లాన్ చేశారు. పైగా అందులో ఒక్కో పాత్రకి మరీ ఎక్కువ డిటైలింగ్ గా చూపించడం చాలా సాగదీతగా అనిపిస్తుంది. దీనితో మొదటి సారి చూసే వీక్షకులకు చాలా బోరింగ్ గా ఉంటుంది.

అలాగే ఈషా డియోల్ పై డిజైన్ చేసిన కంప్లీట్ ట్రాక్ డిజప్పాయింట్ చేస్తుంది. ఇంకా మరికొన్ని అంశాలు అంటే క్రైమ్ సీన్స్ అంత ఆసక్తిగా ఉండకపోవడం కథనంలో నోవల్టి ఎక్కువగా కనిపించడం వంటివి ఈ సిరీస్ లో అంత ఆకట్టుకునే రేంజ్ లో కనిపించవు. దీనితో ఇవి మరింత నిరాశపరుస్తాయి. అలాగే అజయ్ పై క్లోజ్ అప్ షాట్స్ కూడా చూడ్డానికి అంత బాగోలేదు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ గా ఉన్నాయని చెప్పాలి. అలాగే టెక్నీకల్ టీం లో కెమెరా వర్క్ బాగుంది. పలు డార్క్ మూమెంట్ సన్నివేశాల్లో ఆసక్తిగా ఉంది. అలాగే యాక్షన్ సెటప్ మరియు మ్యూజిక్ వర్క్ కూడా బాగుంది. కానీ ఎడిటింగ్ మాత్రం బాగాలేదు.

ఇక దర్శకుడు రాజేష్ మపుష్కర్ విషయానికి వస్తే తాను ఈ సిరీస్ ని బీబీసీ సిరీస్ లూథర్ నుంచి రీమేక్ చేసారు. అయితే ఓవరాల్ గా తన వర్క్ మాత్రం జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. తన అడాప్షన్ బాగుంది కానీ ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే అజయ్ పాత్రని సహా మరికొన్ని రోల్స్ ని డిజైన్ చేసిన విధానం బాగుంది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మంచి అంచనాలతో వచ్చిన ఈ థ్రిల్లర్ సిరీస్ “రుద్ర” ఊహించిన రేంజ్ లో థ్రిల్ చెయ్యదనే చెప్పాలి. అజయ్ మరియు రాశీ ఖన్నా లు బాగున్నా వీరితో పటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగుంటాయి. కానీ అదే విధంగా లూప్ హొల్స్ కూడా ఉన్నాయి. చాలా నెమ్మదిగా ఉండే కథనం ఓవర్ డీటెయిల్స్ వంటివి బోర్ కొట్టిస్తాయి. ఇవి పక్కన పెడితే అజయ్ మరియు రాశీ ఖన్నా ఫ్యాన్స్ అయితే ఓ సారి చూడొచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :