సమీక్ష : “సప్త సాగరాలు దాటి సైడ్ – ఏ” – పర్వాలేదనిపించే లవ్ డ్రామా

Saptha Sagaralu Dhaati Review In Telugu

విడుదల తేదీ :సెప్టెంబర్ 22, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్, పవిత్ర లోకేష్, రమేష్ ఇందిర, గోపాల్ కృష్ణ దేశ్ పాండే తదితరులు.

దర్శకుడు : హేమంత్ ఎం రావు

నిర్మాత: రక్షిత్ శెట్టి

సంగీతం: చరణ్ రాజ్

సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి

ఎడిటర్: సునీల్ భరద్వాజ్ మరియు హేమంత్ ఎం రావు

సంబంధిత లింక్స్: ట్రైలర్

రీసెంట్ గా కన్నడ సినిమా దగ్గర భారీ సక్సెస్ ని సాధించిన ఓ చిత్రం అయితే ఇప్పుడు తెలుగులో రిలీజ్ కి వచ్చింది. మరి ఆ చిత్రమే “సప్త సాగరాలు దాటి”. హీరో రక్షిత్ శెట్టి నటించిన ఈ చిత్రం కన్నడ ప్రేక్షకులని మెస్మరైజ్ చేసి హిట్ అయ్యింది. మరి తెలుగులో ఈ చిత్రం ఎంతమేర ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

ఇక ఈ సినిమా కథలోకి వస్తే..మను(రక్షిత్ శెట్టి) ఓ క్యాబ్ డ్రైవర్ కాగా ప్రియా(రుక్మిణి వసంత్) ఓ కాలేజ్ స్టూడెంట్ మరియు లైఫ్ లో సింగర్ కావాలని కోరుకుంటుంది. అయితే ఈ ఇద్దరూ కూడా గాఢమైన ప్రేమలో ఉంటారు. మరి ఈ ఇద్దరూ ఎప్పటికైనా ప్రియా సొంత ఊరి సముద్రం దగ్గర ఓ ఇంటిని కట్టుకోవాలని అందులో ఉండాలని నిర్ణయించుకుంటారు. అయితే వారిద్దరి ఫ్యూచర్ కోసం మను ఓ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. మరి ఆయా నిర్ణయం ఏంటి? అది వారిద్దరి జీవితాల్లో ఏమన్నా ఊహించని మార్పులు తీసుకొస్తుందా? వారిద్దరూ తమ కలని నెరవేర్చుకున్నారా లేదా ఈ క్రమంలో వారి ప్రయాణం ఎలా సాగింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

కొన్ని చిత్రాల్లో లైన్ చాలా సింపుల్ గా ఉన్నా కూడా అవి అలా ప్రేక్షకుల హృదయాల్లో అయితే నిలిచిపోతాయి మరి ఆ తరహా అతి కొద్ది చిత్రాల్లో ఈ “సప్త సాగరాలు దాటి” కూడా ఉంటుంది అన్ని చెప్పడంలో సందేహం లేదు. ఓ నీట్ అండ్ క్లీన్ ఎమోషన్స్ తో ఆడియెన్స్ కదిలించేలా అయితే సినిమా కొనసాగుతుంది. అలాగే సినిమాలో కనిపించే స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బావుంది.

మెయిన్ గా మూవీ లవర్స్ కి అయితే మరింతగా ఈ సినిమా కనెక్ట్ కావచ్చు. వీటికి అనుగుణంగా సినిమాలో వినిపించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పలు సీన్స్ కి ఎమోషన్స్ కి అదనపు బలాన్ని చేకూర్చింది. ఇక నటీనటులు కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ లను కనబరిచారు. రక్షిత్ శెట్టి తన సింపుల్ రోల్ ని చాలా మెచ్యూర్డ్ గా సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేసాడు. తన పాత్రలో పూర్తిగా రక్షిత్ అయితే ఒదిగిపోయాడు.

ఇక నటి రుక్మిణి వసంత్ కూడా ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. తన డీసెంట్ పెర్ఫామెన్స్ లుక్స్ తన పాత్రలో ఆమె చూపించే తాపత్రయం అంతా చాలా సహజంగా కనిపిస్తుంది. అలానే ఇద్దరి నడుమ పలు సీన్స్ కానీ వారి కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయి. వీరితో పాటుగా ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవాల్సింది. నటి పవిత్ర లోకేష్ కోసం అని చెప్పాలి. కాస్త లిమిటెడ్ గానే ఆమె కనిపించిన మంచి పాత్రలో అయితే ఆమె కనిపించి దానిని రక్తి కట్టించారు.

 

మైనస్ పాయింట్స్ :

మొదట చెప్పినట్టుగానే ఈ చిత్రంలో అయితే కొత్త కథ అనేది కనిపించదు కానీ అందరికీ తెలిసింది కనెక్ట్ అయ్యేదే కనిపిస్తుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ లాంటి వాటిని ఆశించి చూసేవారికి కూడా ఇది రుచికపోవచ్చు. వీటితో పాటుగా సినిమా నుంచీ కాస్త స్లోగా అలా సాగదీతగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

అలాగే కొందరు ముఖ్య నటులు అచ్యుత్ కుమార్, పవిత్ర లోకేష్ అలాగే శరత్ లాంటి నటుల పాత్రలని ఇంకా బెటర్ గా డిజైన్ చేసి అవసరమైనంత స్క్రీన్ స్పేస్ ఇవ్వాల్సింది. అలాగే సినిమాకి సోల్ లాంటి సెకండాఫ్ లో కాస్త విసుగు రావొచ్చు. కొన్ని సన్నివేశాలు కాస్త రీపీటెడ్ గా వస్తూ ఉంటాయి. వీటితో అయితే ఈ చిత్రం అన్ని వర్గాలు ప్రేక్షకులని ఆకట్టుకోకపోవచ్చు.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బావున్నాయి. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు తెలుగు డబ్బింగ్ విలువలు బాగున్నాయి. టెక్నీకల్ టీం లో అయితే చరణ్ రాజ్ మ్యూజిక్ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి. అలాగే అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ సినిమాలో మంచి విజువల్స్ ని తాను చూపించారు. అలాగే ఎడిటింగ్ బాగుంది. కాకపోతే కొన్ని చోట్ల మరికాస్త బెటర్ గా చేయాల్సింది. ఇక దర్శకుడు హేమంత్ ఎం రావు విషయానికి వస్తే..తాను సింపుల్ స్టోరీనే అయినప్పటికీ తన డైరెక్షన్ తో నిలబెట్టారు అని చెప్పాలి. ఓ క్లీన్ అండ్ డీసెంట్ నరేషన్ ని తాను అందించాడు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “సప్త సాగరాలు దాటి సైడ్ – ఏ” ఓ స్లోగా సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. డీసెంట్ కథా కథనాలు బాగున్నా, సినిమా మొత్తం స్లో గా సాగే నరేషన్ అలాగే కొన్ని రిపీటెడ్ సీన్స్ అన్ని వర్గాల ఆడియెన్స్ కి నచ్చకపోవచ్చు. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని ఈ వారాంతానికి ఓసారి ట్రై చేయవచ్చు.

 

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :