ఆడియో సమీక్ష : సారొచ్చారు – దేవీ శ్రీ శైలిలో మరో ఆల్బం


మాస్ మహారాజ రవితేజ “సారోచ్చారు” చిత్రం డిసెంబర్ 21న విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్ర ఆడియోని నేరుగా మార్కెట్లోకి ఈరోజు విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్ర ఆడియో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం

1. పాట : మేడ్ ఫర్ ఈచ్ అదర్

గాయకులు : దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

దేవిశ్రీ పాడిన ఈ పాట పెప్పిగా ఉంది, దేవిశ్రీ గాత్రం పాటకి మరింత బలాన్ని ఇచ్చింది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం సులభంగా అర్ధం అయ్యేలా ఉంది. దేవిశ్రీ సంగీతం కూడా పాటకు సరిగ్గా సరిపోయింది. హీరో మరియు హీరొయిన్ లు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ సాగే పాట ఇది మొత్తానికి వినడానికి బాగుంది.

 
2. పాట : జగ జగ జగదేకవీర

గాయకులు : వేణు,రనిన రెడ్డి

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

నెమ్మదిగా సాగే ఈ రొమాంటిక్ సాంగ్ చాలా బాగుంది మొదటిసారి వినగానే నచ్చేలా ఉంది. వేణు మరియు రనిన రెడ్డి అందించిన గాత్రం పాటను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పాటకు తగ్గట్టుగానే ఉంటుంది. ఈ సారి దేవిశ్రీ ప్రసాద్ తనదయిన శైలిలో పాటను అందించారు. ఇందులో అయన శైలి కనిపిస్తుంది. సింతసైజర్ మరియు పెర్కుజన్ పరికరాలు ఉపయోగించిన విధానం ఈ పాటను విన్న వెంటనే నచ్చేలా చేస్తాయి.

 
3. పాట : రచ్చ రంబోల

గాయకులు : జావేద్ అలీ, రీట

సాహిత్యం : శ్రీమణి

ఫాస్ట్ గా సాగిపోయే ఈ డ్యూయెట్ మాస్ పాటలా అనిపిస్తుంది జావేద్ అలీ మరియు రీట వారి గాత్రంతో ఆకట్టుకున్నారు శ్రీమణి అందించిన సాహిత్యం సాధారణంగా ఉంది. దేవిశ్రీ శైలి సంగీతం తప్ప ఈ పాటలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఈ పాటను ఎలా చిత్రీకరిస్తారు అన్న విషయం మీద ఈ పాట జనంలోకి వెళ్ళడం అనేది ఆధారపడి ఉంటుంది.

 

 

4. పాట : గుస గుస

గాయకులు : సాగర్, సునీత

సాహిత్యం :అనంత శ్రీరామ్

ఆల్బంలో మరో రొమాంటిక్ మెలోడీ ఈ పాట, ఒకటి కాజల్ ఇంకొకటి రిచా గంగోపాధ్యాయ్ కి ఉండవచ్చని అనిపిస్తుంది. సాగర్ మరియు సునీత గాత్రం అందించారు. వీరి ప్రదర్శన పాటకు బలాన్నిచ్చింది. ప్రత్యేకంగా సునీత గాత్రం రొమాంటిక్ ఫీల్ ని కలుగ చేసింది. అనంత శ్రీరామ్ సాహిత్యం కూడా బాగానే ఉండటంతో విన్న మొదటిసారే పాట నచ్చేస్తుంది. దేవిశ్రీ అందించిన సంగీతం కొదొఅ రొమాంటిక్ ఫీల్ ని ఇస్తుంది.

 

 

5. పాట : కాటుక కళ్ళు
గాయకులు : ఖుషి మురళి, శ్వేతా మోహన్ ,చిన్న పొన్ను
సాహిత్యం :చంద్రబోస్

ఫుల్ మాస్ ట్రాక్ ఈ పాట ముఖ్యంగా సి సెంటర్ వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ పాటను కంపోజ్ చేసినట్టు అనిపిస్తుంది. పాటలో మసాలా మరియు రవితేజ డాన్స్ ని ఊహించచ్చు. శ్వేతా మోహన్ అద్భుతమయిన ప్రదర్శన కనబరచగా మురళి తన గాత్రంతో పాటకు న్యాయం చేశారు. చంద్రబోస్ అందించిన సాహిత్యం చాలా బాగుంది. ట్రెడిషనల్ ఇంస్ట్రుమెంట్స్ ఉపయోగించి దేవిశ్రీ ప్రసాద్ పాటకు కొత్తదనాన్ని ఆపాదించారు. చిత్రీకరణ బాగుంటే మంచి మాస్ పాటగా పేరు తెచ్చుకుంటుంది.

 

 

తీర్పు :
“సారోచ్చారు” ఆడియో మాములు రవితేజ చిత్రాలలానే రెండు మంచి మెలోడీలు ఒక మాస్ పాట రెండు పెప్పి ట్రాక్స్ తో బాగుంది. మరీ అద్భుతం అని చెప్పలేకపోయిన దేవిశ్రీ తన ఫాం ని కొనసాగిస్తున్నాడని చెప్పవచ్చు. ఈ పాటలకు మంచి చిత్రీకరణ తోడయితే చాలా బాగుంటుంది. పరశురాం చిత్రీకరణ మీదనే మిగిలినది ఆధారపడి ఉంది. నాకు “గుస గుస” మరియు “జగ జగ జగదేక వీర” పాటలు బాగా నచ్చాయి.

సంబంధిత సమాచారం :

More