సమీక్ష : “షాదీ ముబారక్” – జస్ట్ ఓకే అనిపించే రోమ్ కామ్ ఎంటెర్టైనర్

Shaadi Mubarak movie review

విడుదల తేదీ : మార్చి 05, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సాగర్ ఆర్.కె.నాయుడు, దృష్టి రఘునాథ్, రాహుల్ రామకృష్ణ, బెనార్జీ, హేమ, రాజ్‌శ్రీ నాయర్, అదితి మయకల్, రామ్ మరియు ఇతరులు

దర్శకత్వం : పద్మశ్రీ

నిర్మాత‌లు : దిల్ రాజు, శిరీష్

సంగీతం : సునీల్ కశ్యప్

సినిమాటోగ్రఫీ : శ్రీకాంత్ నరోజ్

ఎడిటింగ్ : మధు చింతల

టెలివిజన్ తెరపై స్టార్ అయినటువంటి సాగర్ ఆర్ కె నాయుడు హీరోగా ఇది వరకే ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ కాస్త సుదీర్ఘ విరామంతో దిల్ రాజు బ్యానర్ లో “షాదీ ముబారక్” అనే చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు. మంచి బజ్ నడుమ విడుదల కాబడిన ఈ చిత్రం ఎంత మేర ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఎన్నారై అయినటువంటి సున్నిపెంట మాధవ్(సాగర్ ఆర్ కె నాయుడు) తన పెళ్లిచూపులు నిమిత్తం కేవలం ఒకే ఒక్క రోజు హైదరాబాద్ రావాల్సి వస్తుంది. పైగా ఆ ఒక్కరోజులోనే మూడు పెళ్లి చూపులు ఉంటాయి. ఇదిలా ఉండగా ఓ పెళ్లి కన్సల్టెంట్ కూతురుగా సత్యభామ(దృశ్య రఘునాథ్) కనిపిస్తుంది. మరి మూడు పెళ్లి చూపులకు వచ్చిన మాధవ్ సత్యభామను ఎలా కలుసుకుంటాడు? ఆమె కూడా ఒక పెళ్లి కూతురా వీరికి ఎలా కనెక్షన్ ఉంటుంది? చివరికి ఏం జరిగింది అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఇప్పటి వరకు ఆర్ కె నాయుడు స్మాల్ స్క్రీన్ పై షేడ్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు కానీ సిల్వర్ స్క్రీన్ కు వచ్చినట్టు అయితే మరింత యంగ్ గా కనిపించాడు. ఇప్పుడు ఇదే లుక్ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. తన గత సినిమాలో కంటే కూడా ఇందులో చక్కటి లుక్స్ మరియు నటనను కనబరుస్తాడు. అలాగే కొత్త హీరోయిన్ దృశ్య రఘునాథ్ కూడా మంచి నటనను కనబరిచింది. తన డీసెంట్ లుక్స్ కూడా ఇందులో అందంగా అనిపిస్తాయి.

ఇంకా ఈ ఇద్దరు మెయిన్ లీడ్ లో కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. అయితే ఈ సినిమాలో ఒకింత ఇంట్రెస్టింగ్ గా అనిపించే పాయింట్ ఏదన్నా ఉంది అంటే ఈ పెళ్లి చూపులని డిజైన్ చేసిన విధానం అని చెప్పాలి. ఒకే రోజున మూడు పెళ్లి చూపులు అది కూడా ఒక కార్ లో అన్నది ఇంట్రెస్ట్ గా అనిపించే అంశం. మరి అలాగే అక్కడక్కడా వచ్చే సిట్యుయేషనల్ కామెడీ పాటలు కూడా కథానుసారం నీట్ గా ఆకట్టుకుంటాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇక ఈ సినిమాలోని డ్రా బ్యాక్స్ విషయానికి వస్తే అవి కూడా కాస్త క్లియర్ గా కనిపించేవే ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్ రోల్ ను డిజైన్ చేసిన విధానం ఏమంత సమంజసంగా అనిపించదు. అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ పై పెద్దగా ఎలాంటి ఒపీనియన్ లేని అమ్మాయిలా ముందు చూపించి తర్వాత కొన్ని సిల్లీ ఎపిసోడ్స్ తోనే ఆమె పాత్రలో సడెన్ చేంజ్ చెయ్యడం అంత స్ట్రాంగ్ గా డీల్ చేసినట్టు అనిపించకపోగా పరమ రొటీన్ గా అనిపిస్తుంది.

అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆ కార్ ఎపిసోడ్ కూడా అంత ఎఫెక్టీవ్ గా ఉండదు పైగా చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందులోనే వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అయ్యియినట్టు అనిపించవు. ఆలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సహా డల్ గా సాగే నరేషన్ అంత ఇంట్రెస్ట్ తెప్పించవు.

 

సాంకేతిక వర్గం :

 

నిర్మాత దిల్ రాజు తాను చేసేది ఎలాంటిది అయినా కూడా నిర్మాణ విలువలలో ఎక్కడా రాజీ పడరు. అది ఈ చిన్నపాటి బడ్జెట్ సినిమాలో కూడా కనిపిస్తుంది. వాటి పరంగా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉంటాయి. అలాగే శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రఫీ మంచి ఎఫెక్టీవ్ గా ఇందులో కనిపిస్తుంది. అలాగే సునీల్ కశ్యప్ ఇచ్చిన సంగీతం ఓకే అనిపించే స్థాయిలో ఉంటుంది. కాకపోతే మధు చింతల ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉంటే బాగున్ను కొన్ని సీన్స్ ను తగ్గించడమో లేక మరింత టైట్ చెయ్యడమో చేసి ఉంటే బాగుండేది.

ఇక కొత్త దర్శకుడు పద్మశ్రీ విషయానికి వస్తే తన దర్శకత్వ పాత్రకు పర్వాలేదనిపించే స్థాయిలో ఆకట్టుకుంటారని చెప్పాలి. ఓ మళయాళ రోమ్ కామ్ ను ప్రేరణగా తీసుకొని చేసిన ఈ సినిమాలో ఒకింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ దానిని మరింత అందంగా ఎంగేజింగ్ గా చూపించే స్క్రీన్ ప్లే సహా సన్నివేశాలు రాసుకుని ఉంటే బాగుండేది. ఈ విషయంలో తాను మరిన్ని మెళుకువలు నేర్చుకోవాలి.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే పెళ్లి కాన్సెప్ట్ లో కొత్తగా ట్రై చేసిన ఈ “షాదీ ముబారక్” అక్కడక్కడా ఓకే అనిపిస్తుంది అని చెప్పాలి. హీరో హీరోయిన్స్ వారి పాత్రల పరిధి మేర మంచి నటనను కనబర్చారు. అలాగే వారి మధ్య కెమిస్ట్రీ, అక్కడక్కడా కామెడీ బాగుంటాయి. కానీ పరమ రొటీన్ గా అనిపించే కొన్ని ఎపిసోడ్స్ అంత ఎఫెక్టీవ్ గా అనిపించని ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టిస్తాయి. సో ఓవరాల్ గా తక్కువ అంచనాలు పెట్టుకొని అయితే ఓసారి ఈ సినిమా చూడొచ్చు.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :