సమీక్ష : ‘ది రోజ్‌ విల్లా’ – కొన్ని థ్రిల్స్ మాత్రమే !

Republic Movie Review

విడుదల తేదీ : అక్టోబర్ 1, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: దీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ, రాజా రవీంద్ర తదితరులు

దర్శకుడు: హేమంత్

నిర్మాత : అచ్యుత్ రెడ్డి

సినిమాటోగ్రఫీ: అంజి

సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి

ఎడిటర్: శివ

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ది రోజ్‌విల్లా’. ఈ సినిమాలో దీక్షిత్ షెట్టి, శ్వేత వర్మ కీలక పాత్రలో నటించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

క‌థ‌:

డాక్ట‌ర్ ర‌వి (దీక్షిత్ శెట్టి), శ్వేత (శ్వేత వ‌ర్మ) ఇద్దరు భార్యాభర్తలు. సరదాగా గడపడానికి మున్నార్ అనే అటవీ ప్రాంతలోకి న‌క్సల్స్ వున్న డేంజ‌ర్ పాయింట్‌ కి వస్తారు. అయితే, అక్క‌డ ర‌వి – శ్వేత కారు బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల అనంతరం మిల‌ట్రీ రిటైర్ ఆఫీసర్ సోల్‌మాన్ (రాజా ర‌వీంద్ర) ఇంటికి వెళ్తారు. సోల్‌మాన్ భార్య హెలెన్‌ (అర్చ‌నా కుమార్‌) తనకు దూరమైన కొడుకును రవిలో చూకుంటుంది. ఇక తన భార్య సంతోషం కోసం సోల్‌మాన్ ఏం చేశాడు ? ర‌వి – శ్వేత ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ? చివరకు ఏం జరిగింది ? ర‌వి – శ్వేత జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ద‌ర్శ‌కుడు హేమంత్ సినిమాను సైకలాజికల్ థ్రిల్లర్‌ లోని మ‌రో కోణాన్ని.. ముఖ్యంగా డిఫరెంట్ పాత్రల విపరీత భావోద్వేగాలను ట‌చ్ చేస్తూ ఈ సినిమాను బాగానే తెర‌కెక్కించారు. సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, పాత్రల్లోని వేరియేషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరియు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రెండు ఉత్కంఠభరితమైన సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

ఈ సినిమాలో హీరోగా నటించిన దీక్షిత్ శెట్టి తన పాత్రలో చాలా బాగా నటించాడు. ముఖ్యంగా సోల్‌మాన్ ఇంట్లో చిక్కుకుని ఇబ్బంది పడే సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ గా నటించిన శ్వేతా వర్మ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ మెప్పించింది. సినిమాలోనే కీలక పాత్రలో నటించిన రాజా రవీంద్ర కూడా చాలా బాగా నటించారు. అర్చ‌నా కుమార్‌ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు హేమంత్ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నా.. ఆ ఐడియాకి సరైన ట్రీట్మెంట్ ను రాసుకోవడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు. సెకండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారు. అయితే సినిమా నిడివి చాలా తక్కువ కావడంతో ప్రేక్షకుడు ఎక్కడా స్లో నేరేషన్ ఫీల్ అవ్వడు. కానీ కథలో వేగం మాత్రం లేదు.

ఇక హీరోకి హీరోయిన్లకు మధ్య వచ్చే సన్నివేశాలు అయితే టైం పాస్ కోసం పెట్టినట్టే ఉంటాయి తప్పితే.. ఎక్కడా కథను డ్రైవ్ చేయవు. పైగా కథలోని మెయిన్ ప్లాట్ చాలా పేలవంగా ఉంది. దానికి తోడూ లాజిక్స్ లేని సీన్స్ తో పండని సైకలాజికల్ ఇన్ బ్యాలెన్స్ తో కథనం మొత్తం నడిచింది. మొత్తానికి దర్శకుడు కథా కథనాలన్ని ఆసక్తికరంగా మలచలేకపోయాడు.

స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉండి ఉంటే బాగుండేది. అలాగే ట్విస్ట్ లను, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను ఇంకా ఆసక్తికరంగా మలిస్తే సినిమాకి ప్లస్ అయ్యేది.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. అంజి సినిమాటోగ్రఫీ పర్లేదు. ఇక శివ ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది. ఎడిటింగ్ సినిమాకి ప్లస్ అయింది. ఇక నిర్మాత అచ్యుత్ రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

‘ది రోజ్‌ విల్లా’ అంటూ వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అండ్ మెయిన్ పాయింట్ మరియు ప్రధాన పాత్రల భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి. అయితే, స్టోరీకి తగ్గట్టు సరైన ట్రీట్మెంట్ లేకపోవడం, లాజిక్స్ లేని సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం :